ETV Bharat / city

టాప్​టెన్​ న్యూస్ @11AM

author img

By

Published : Nov 2, 2020, 11:00 AM IST

ETV BHARAT TOP TEN NEWS
టాప్​టెన్​ న్యూస్ @11AM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

1. 82 లక్షలు దాటాయ్!

దేశంలో కొత్తగా 45 వేల కరోనా కేసులు బయటపడ్డాయి. 496 మంది వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 82 లక్షలకు చేరగా... మరణాల సంఖ్య 1,22,607కి పెరిగింది. ఒక్కరోజులో 8.55 లక్షల కరోనా నిర్ధరణ పరీక్షలు జరిగాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

2. తగ్గిన వ్యాప్తి

రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పడుతోంది. తాజాగా వెయ్యికి దిగువగా కేసులు నమోదయ్యాయి. ఆదివారం రాత్రి 8 గంటల వరకు నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షల్లో కొత్తగా 922 మందికి పాజిటివ్‌ తేలింది. ఇప్పటి వరకు మొత్తం నమోదైన కేసుల సంఖ్య 2,40,970కి చేరింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

3. ఈసీకి ఫిర్యాదు

అధికారిక ప్రారంభోత్సవాల పేరిట సీఎం కేసీఆర్​... దుబ్బాక ఎన్నికల ప్రచారాన్ని పరోక్షంగా నిర్వహిస్తున్నారని టీపీసీసీ ఎన్నికల కమిషన్​ సమన్వయ కమిటీ కన్వీనర్​ నిరంజన్​ ఆరోపించారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన కేసీఆర్​పై చర్యలు తీసుకోవాలని కేంద్ర ఎన్నికల కమిషనర్ సునీల్ అరోరాకు ఫిర్యాదు చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

4. బడి గంట మోగింది

ఏపీలో పాఠాశాలలు పునః ప్రారంభమయ్యాయి. కొవిడ్ నిబందనలకు అనుగుణంగా తరగతులు నిర్వహించనున్నారు. తొమ్మిది, పదో తరగతి విద్యార్థులకు రోజు విడిచి రోజు ఒంటిపూట బడులు నిర్వహించేలా ప్రభుత్వం కార్యాచరణ రూపొందించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

5. ఝార్ఖండ్ ఘోర​ రోడ్డు ప్రమాదం

ఝార్ఖండ్​లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మరణించారు. ఆగి ఉన్న ట్రక్కును వేగనార్​ ఢీకొట్టడంతో ఈ ఘటన జరిగింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

6. ఎన్నికల ఓట్ల లెక్కింపు ఇలా...

అమెరికా అధ్యక్ష ఎన్నికల తేదీ దగ్గరపడుతున్న కొద్దీ ప్రపంచ దేశాల్లో ఉత్కంఠ తీవ్రస్థాయికి చేరుతోంది. అమెరికా అధ్యక్ష పదవిని చేపట్టడం అంటే అంతే మరి. అయితే అధ్యక్ష ఎన్నిక ప్రక్రియ ఎంత సంక్లిష్టమో.. ఓట్ల లెక్కింపు ప్రక్రియ కూడా అంతే కష్టతరం. ఆ వివరాలు మీకోసం... పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

7. స్వీయ నిర్భంధంలోకి డబ్ల్యూహెచ్​ఓ చీఫ్​!

ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ అథనోమ్.. హోం ఐసోలేషన్‌లోకి వెళ్లారు. తాను ఇటీవల కరోనా సోకిన ఓ వ్యక్తిని కలిసిన తరుణంలో క్వారంటైన్​లోకి వెళ్లినట్టు అథనోమ్ తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

8. నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

అంతర్జాతీయ మార్కెట్లలో అనిశ్చితులు, అమెరికా ఎన్నికల నేపథ్యంలో మదుపరులు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. దీంతో దేశీయ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. తొలుత 200 పాయింట్ల పతనంతో ప్రారంభమైన బొంబయి స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్... ప్రస్తుతం 153 పాయింట్ల నష్టంతో 39,457 వద్ద కొనసాగుతోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

9. వచ్చే ఐపీఎల్​లో రాణించవచ్చు

చెన్నై జట్టు సారథి ధోనీ.. దేశవాళీ క్రికెట్​లో ఆడాలని సూచించాడు భారత దిగ్గజ బ్యాట్స్​మన్​ సునీల్​ గావస్కర్​. దీంతో మహీ మళ్లీ ఫామ్​లోకి వచ్చే అవకాశముందని చెప్పాడు. తద్వారా వచ్చే ఐపీఎల్​లో 400 పరుగులు చేయగలడని ఆశాభావం వ్యక్తం చేశాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

10. బాలయ్య సినిమాలో నందమూరి హీరో!

బాలకృష్ణ - బోయపాటి కాంబోలో తెరకెక్కిస్తున్న సినిమాలో హీరో తారకరత్న నటించనున్నారని టాక్​. ప్రతినాయక ఛాయలున్న​ పాత్రను పోషించబోతున్నారని తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.