ETV Bharat / city

టాప్​ టెన్​ న్యూస్​@9PM

author img

By

Published : Apr 10, 2021, 8:59 PM IST

9pm top news, top headline news
టాప్​ టెన్​ న్యూస్​@9PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

1. కొవిడ్​ సెంటర్లుగా ప్రభుత్వ భవనాలు

రాష్ట్రంపై కొవిడ్ మరోసారి పంజా విసురుతోంది. కొత్తగా మరో 3 వేలకు చేరువలో కేసులు నమోదు అయ్యాయి. మహమ్మారి విజృంభిస్తున్న దృష్ట్యా ఇప్పటికే ఆసుపత్రులను అప్రమత్తం చేసిన సర్కారు జిల్లాల్లోనూ కోవిడ్ కేర్ సెంటర్లను ప్రారంభించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

2. మాజీమంత్రి అల్లుడు ఇంట్లో భారీగా నగదు

ఈఎస్ఐ కుంభకోణం కేసు దర్యాప్తులో భాగంగా.. హైదరాబాద్‌లో జరిపిన ఈడీ సోదాల్లో భారీగా నగదు, నగలు వెలుగులోకి వచ్చాయి. గతంలో పెను వివాదాస్పదమైన ఈఎస్ఐ స్కాం కుంభకోణానికి సంబంధించి.. హైదరాబాద్ నగరంలో ఎన్​ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ సోదాలు ముమ్మరం చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

3. 'ప్రభుత్వ ధరకే ప్రైవేటులో కొవిడ్ చికిత్స'

కొవిడ్ ఉన్నప్పటికీ సాధారణ జీవితం తప్పదని మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. గతంలో కంటే కేసులు పెరుగుతున్నప్పటికీ తీవ్రత తగ్గిందన్నారు. ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలతో సమీక్ష నిర్వహించిన మంత్రి ఈటల.. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే కొవిడ్ చికిత్సలు చేయాలని ఆదేశించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

4. 'ఆ గింజల సాగు పెంచాలి'

రానున్న ఖరీఫ్ సీజన్​లో కంది, పత్తి, నూనె గింజల సాగును పెంచాలని అధికారులను మంత్రి నిరంజన్​ రెడ్డి ఆదేశించారు. సాగు విస్తీర్ణం పెరుగుతున్న దృష్ట్యా ఈ పంటలపై రైతులకు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పించాలని అన్నారు. నకిలీ విత్తనాలను అరికట్టేందుకు కఠిన చర్యలు అమలు చేయాలని చెప్పారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

5. రక్తపాతం మధ్య నాలుగో విడత

హింసాత్మక ఘటనల మధ్య బంగాల్ శాసనసభ ఎన్నికల నాలుగో విడత పోలింగ్‌ ముగిసింది. కూచ్‌ బిహార్‌ జిల్లా సితాల్‌కుచిలో జరిగిన రెండు వేర్వేరు కాల్పుల ఘటనల్లో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. కాల్పులు జరిగిన ప్రాంతంలో పోలింగ్‌ను ఈసీ రద్దు చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

6. 10 మంది మృతి

ఉత్తర్​ప్రదేశ్​లోని ఇటావాలో ట్రక్కు లోయలో పడింది. ఈ ఘటనలో 10మంది మృతి చెందారు. 30మందికి పైగా గాయపడ్డారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

7. 'శాంతితోనే ద్వైపాక్షిక సంబంధాల పురోగతి'

సరిహద్దులో శాంతియుత పరిస్థితులు నెలకొంటేనే ద్వైపాక్షిక సంబంధాల్లో పురోగతి సాధ్యమవుతుందని 11వ విడత సైనిక చర్చల్లో భాగంగా చైనాకు భారత్ స్పష్టం చేసింది. సమస్యలకు ఆమోదయోగ్యమైన పరిష్కారం తీసుకొచ్చేందుకు.. చర్చలు కొనసాగించాలని ఇరుపక్షాలు అంగీకారానికి వచ్చినట్లు భారత సైన్యం తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

8. 'లాక్​డౌన్​ కన్నా అదే మేలు'

కొవిడ్​ వ్యాప్తిని అరికట్టడానికి లాక్​డౌన్​ కన్నా గుంపులుగా తిరగకపోవడం, భౌతిక దూరం పాటించడమే కీలకమని డబ్ల్యూహెచ్​ఓ అధికారి డా.పూనమ్ సింగ్ అన్నారు. పరీక్షలు, చికిత్సను పెంచాల్సిన అవసరం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

9. టాస్ గెలిచిన దిల్లీ.. చెన్నై బ్యాటింగ్

దిల్లీతో మ్యాచ్​లో టాస్ ఓడిన చెన్నై సూపర్​కింగ్స్ బ్యాటింగ్​కు రానుంది. ముంబయి వేదికగా ఈ మ్యాచ్​ జరుగుతోంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

10. కరోనాతో 'మహాభారతం' నటుడు మృతి

'మహాభారతం' సీరియల్​ ఫేమ్​ సతీష్​ కౌల్​(ఇంద్రుడు) కరోనాతో పోరాడుతూ మరణించారు. ఆయన మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.