ETV Bharat / city

టాప్​టెన్ న్యూస్ @9PM

author img

By

Published : Jan 14, 2021, 9:00 PM IST

etv-bharat-top-ten-9pm-news
టాప్​టెన్ న్యూస్ @9PM

ఇప్పటి వరకు ఉన్న ప్రధాన వార్తలు

1. అంబరాన్నంటిన సంబురాలు

రాష్ట్రవ్యాప్తంగా మకర సంక్రాంతి వేడుకలు ఘనంగా జరిగాయి. వేకువజాము నుంచే మహిళలు ఇంటి ముందు అలికి రంగురంగుల ముగ్గులు వేశారు. చిన్నా, పెద్దా తేడా లేకుండా గాలి పతంగులు ఎగురవేస్తూ సంబురాలు చేసుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

2. కోడి పందేల్లో వివాదం

పశ్చిమ గోదావరి జిల్లాలో కొయ్యలగూడెంలో జరుగుతున్న కోడి పందాల్లో కొంతమంది యువకులు ఘర్షణలకు దిగారు. పేకాటలో తలెత్తిన వివాదం కారణంగా ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

3. పతంగుల పండుగ

హైదరాబాద్​ నగరంలో సంక్రాంతి శోభ సంతరించుకుంది. రంగురంగుల గాలిపటాలతో సికింద్రాబాద్​ పరేడ్​ మైదానం సందడిగా మారింది. వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున మైదానానికి చేరుకుని గాలి పటాలు ఎగరవేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

4. ముగిసిన అఖిలప్రియ కస్టడీ

ప్రవీణ్‌రావు సోదరుల అపహరణ కేసులో 3 రోజుల విచారణలో అఖిలప్రియ స్టేట్‌మెంట్​ను పోలీసులు రికార్డ్ చేశారు. భూ వివాదానికి సంబంధించి పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

5. మకరజ్యోతి దర్శనం

సంక్రాంతి పర్వదినాన శబరిమల అయ్యప్పస్వామి ఆలయం శరణుఘోషతో మార్మోగింది. మకరజ్యోతి రూపంలో స్వామి.. భక్తులకు దర్శనమిచ్చారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

6. శుక్రవారం మరోసారి చర్చలు

సాగు చట్టాలపై ప్రతిష్టంభన నేపథ్యంలో కేంద్రం, రైతులకు మధ్య శుక్రవారం 9వ విడత చర్చలు జరగనున్నాయి. సమస్య పరిష్కారం కోసం సుప్రీంకోర్టు ఇటీవల కమిటీ ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

7. 'ఈసారి అతిథి లేకుండానే వేడుకలు'

ఈసారి గణతంత్ర వేడుకల్లో అతిథులు కనిపించరు. కరోనా వైరస్​ నేపథ్యంలో అతిథులు లేకుండానే కార్యక్రమం జరుగుతుందని విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

8. తొలి డోసు తీసుకున్న పోప్​

పోప్ ఫ్రాన్సిస్ గురువారం.. కరోనా టీకా మొదటి డోసు తీసుకున్నారు. ఈ వారం వ్యాక్సినేషన్​ ప్రక్రియ ప్రారంభం కానున్న నేపథ్యంలో పోప్​ మొదటి టీకా వేసుకోవడం విశేషం. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

9. ట్రోఫీ ఎవరి సొంతం?

నిర్ణయాత్మక నాలుగు టెస్టులో గెలవాలని టీమ్​ఇండియా, ఆస్ట్రేలియా పట్టుదలగా ఉన్నాయి. అందుకు తగ్గట్లే ప్రణాళికలు రచిస్తున్నాయి. భారత కాలమానం ప్రకారం శుక్రవారం ఉదయం 5 గంటలకు నాలుగో టెస్టు మొదలు కానుంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

10. అదరగొట్టిన పవన్

పవన్​ 'వకీల్ సాబ్' టీజర్​ వచ్చేసింది. ఆద్యంతం ఆకట్టుకుంటూ సినిమాపై అంచనాల్ని పెంచేస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.