ETV Bharat / city

LIVE UPDATES: 'ఏదేమైనా ఈ విషయంలో నేను కీలక పాత్ర పోషిస్తా'

author img

By

Published : Feb 13, 2022, 6:12 PM IST

Updated : Feb 13, 2022, 7:45 PM IST

CM KCR PRESS MEET LIVE UPDATES
CM KCR PRESS MEET LIVE UPDATES

19:43 February 13

నేను ముంబయి వెళ్తా.. ఉద్ధవ్‌ ఠాక్రేను కలుస్తా

  • కుల, మతాలు పక్కన పెట్టి జనమంతా పిడికిలి బిగించాలి
  • అప్పుడే దేశ ప్రగతిని సాధించగలం
  • రాజకీయ ఫ్రంట్‌ను ఊహించొద్దు.. ప్రజల ఫ్రంట్‌ను ఊహించండి
  • నేను ముంబయి వెళ్తా.. ఉద్ధవ్‌ ఠాక్రేను కలుస్తా
  • ఏదేమైనా ఈ విషయంలో నేను కీలక పాత్ర పోషిస్తా
  • దేశంలో చాలామంది రాజకీయ నాయకులు ఉన్నారు
  • ప్రజల కోసం పని చేస్తూ పోతే పదవులు అవే వస్తాయి
  • ఎన్టీఆర్, ఎంజీఆర్‌ వంటి సినిమా నటులు సీఎంలు కాలేదా?

19:29 February 13

  • ప్రజలు కలిసి వస్తే.. నాయకులు కదిలి వచ్చే పరిస్థితి వస్తుంది
  • కఠోర సమైక్యవాదినన్న చంద్రబాబు జై తెలంగాణ అనలేదా?
  • సమైక్యవాద పార్టీ సీపీఐ జై తెలంగాణ అనలేదా?
  • ఈ దేశం కోసం ముందు కదలాల్సింది దేశ ప్రజలే
  • జనం ప్రభంజనమైతే.. ఎవరూ అడ్డుకోలేరు..
  • అందరి కోరిక అదే అయితే.. దేశం కోసం కొత్త పార్టీ పెడతా

19:24 February 13

  • గవర్నర్‌ వ్యవస్థ సరిగ్గా పని చేయడం లేదని సర్కారియా కమిషన్ చెప్పింది
  • గవర్నర్‌ వ్యవస్థ దుర్వినియోగం భాజపా హయాంలో పెరిగింది
  • దేశంలోని అన్ని రాజకీయ శక్తులు ఏకమై భాజపాను వెళ్లగొట్టాలి
  • భవిష్యత్‌ రాజకీయాలను ఊహించి చెప్పలేం
  • భాజపా అరాచక పాలనపై దేశమంతా చర్చ జరగాలి
  • ఎవరు ఎవరితో కలుస్తారు అన్నది కాలం చెబుతుంది

19:18 February 13

  • హిజాబ్ పై దేశం మొత్తం మౌనం వహిస్తోంది
  • కర్ణాటకలోని విద్వేషం అంతటా వస్తే దేశం గతేంటి..?
  • ధర్మం పేరిట విద్వేష రాజకీయం మానుకోవాలి

19:18 February 13

  • తెలంగాణలా దేశం మారాలని కొత్త రాజ్యాంగం కావాలంటున్నా.. తప్పా..
  • దళితుల కోసమే కొత్త రాజ్యాంగం రావాలని చెబుతున్నా
  • దళితుల రిజర్వేషన్లు 19 శాతానికి పెంచాలని రాజ్యాంగం మార్చమంటున్నా
  • దేశమంతా దళిత బంధు పెట్టడం కోసం రాజ్యాంగం మార్చమంటున్నా
  • బీసీల కులగణన కోసం కొత్త రాజ్యాంగం కావాలంటున్నా
  • రాజ్యాంగం ప్రగతిశీలంగా ఉండాలని అంబేడ్కరే చెప్పారు
  • గుజరాత్‌లో దళిత బిడ్డలను చంపేస్తున్నారు
  • గుజరాత్‌లో దళిత బిడ్డల ఊరేగింపులను సహించలేకపోతున్నారు
  • 77 శాతం సంపద 10 శాతం మంది దగ్గర ఉండొద్దు
  • 77 శాతం సంపద 90 శాతం మంది దగ్గర ఉండాలనే కొత్త రాజ్యాంగం కావాలి
  • అందరికీ సమాన హక్కుల కోసం కొత్త రాజ్యాంగం కావాలి

19:10 February 13

  • రాహుల్ గాంధీ పట్ల అసోం సీఎం వ్యాఖ్యలు సమంజసమేనా?
  • రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యల విషయాన్ని వదిలిపెట్టను
  • అసోం సీఎంను భాజపా ప్రోత్సహిస్తోందా..?
  • అసోం సీఎంపై భాజపా ఎందుకు చర్యలు తీసుకోలేదు?
  • కాంగ్రెస్‌తో పొత్తు కోసం రాహుల్‌ను వెనకేసుకొస్తున్నానని అంటున్నారు
  • తెరాసకు ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు

19:06 February 13

  • దేశ యువత మధ్య ఎందుకు విద్వేషాలు రగులుస్తున్నారు?
  • భాజపా విద్వేష రాజకీయాల గురించి యువత ఆలోచించాలి: కేసీఆర్‌
  • శాంతి లేని చోట ఎవరు పెట్టుబడులు పెడతారు: కేసీఆర్‌
  • శాంతిభద్రతలు కోరుకుందామా?.. ఘర్షణలు, కర్ఫ్యూలు కోరుకుందామా?

18:58 February 13

  • మోదీ ట్రంప్‌ తరపున అమెరికాలో ప్రచారం చేశారు
  • మోదీ అమెరికా ఎన్నికల్లో ప్రచారం చేయడం ఏంటి?
  • అమెరికా ఎన్నికలు.. అహ్మదాబాద్ మున్సిపల్ ఎన్నికలా?
  • అమెరికా ఎన్నికల కోసం మోదీ ప్రచారం వ్యూహాత్మక తప్పిదం

18:46 February 13

మీకు దమ్ముంటే నన్ను జైలుకు పంపాలి కదా..

  • మీకు దమ్ముంటే నన్ను జైలుకు పంపాలి కదా..
  • మేం మిమ్మల్ని జైలుకు పంపేది మాత్రం పక్కా
  • భాజపా పాలకుల అవినీతి చిట్టా నా దగ్గర ఉంది
  • రఫేల్‌ జెట్‌ విమానాల కొనుగోలులో గోల్‌మాల్‌ జరిగింది
  • మన కంటే చౌకగా ఇండోనేషియా రఫేల్‌ విమానాలు కొన్నది
  • భాజపా అవినీతి గురించి దిల్లీలో పంచాయితీ పెడతా
  • భాజపా తన సిద్ధాంతాలు గాల్లో కలిపేసింది
  • ఎన్నికల్లో గెలవకపోయినా పాలించే సిగ్గులేని పార్టీ భాజపా
  • కర్ణాటక, మధ్యప్రదేశ్‌, మణిపూర్‌ గెలవకపోయినా పాలిస్తున్నారు
  • మహారాష్ట్రలోనూ గెలవకపోయినా పాలించాలని యత్నించారు
  • మహారాష్ట్రలో పాలిద్దామని యత్నించి బోల్తా పడ్డారు
  • యూపీ ఎన్నికల తర్వాత పెట్రోల్‌ రేట్లు పెంచుతారు

18:39 February 13

  • విద్యుత్‌ సంస్థలు నిర్మించినా ఉత్పత్తి కానివ్వట్లేదు
  • విద్యుత్‌ లేక దేశంలో 60 శాతం అంధకారంలో ఉంటుంది
  • తెలంగాణ తప్ప 24 గంటల విద్యుత్‌ ఏ రాష్ట్రం ఇవ్వలేదు
  • విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరించాలనేది కేంద్రం ఉద్దేశం
  • పార్టీలకు చందాలు ఇచ్చేవాళ్లను ప్రోత్సహిస్తున్నారు
  • చందాలు ఇచ్చే సంస్థల సోలార్‌ విద్యుత్‌ కొనాలంటున్నారు

18:36 February 13

బహిరంగ సభలో ప్రధాని పచ్చి అబద్దాలు చెప్పారు

  • మిషన్‌ భగీరథ పథకం ప్రారంభోత్సవానికి ప్రధానిని పిలిచా
  • బహిరంగ సభలో ప్రధాని పచ్చి అబద్దాలు చెప్పారు
  • యూనిట్‌కు రూ.11 చొప్పున కొని రూ.1.10కే రాష్ట్రాలకు ఇచ్చినట్లు చెప్పారు
  • కేంద్రం ఎన్నడూ రూ.1.10కు ఏ రాష్ట్రానికి విద్యుత్‌ ఇవ్వలేదు
  • కేంద్ర అబద్దాలపై చర్చకు రావాలన్నా భాజపా నేతలు ముందుకు రారు
  • దేశంలో 4 లక్షల మెగావాట్ల విద్యుత్‌ ఉన్నా.. వాడే తెలివి కేంద్రానికి లేదు

18:14 February 13

తెలంగాణ రైతులు ధనవంతులు కావాలి

  • రాష్ట్రానికి అరశాతం ఎఫ్‌ఆర్‌బీఎం ఇస్తే రూ.5 వేల కోట్లు వస్తాయి
  • కేంద్ర నిబంధనతో ఐదేళ్లకు రాష్ట్రం రూ.25 వేల కోట్లు నష్టపోవాలి
  • ఎఫ్‌ఆర్‌బీఎం లేకపోయినా సంస్కరణలకు అంగీకరించలేదు
  • తెలంగాణలో వ్యవసాయం స్థిరీకరణ జరగాలి..
  • తెలంగాణ రైతులు ధనవంతులు కావాలి
  • నీటి ప్రాజెక్టులపై పీఎఫ్‌సీ, ఆర్‌ఈసీ రుణాలు ఇస్తుంది
  • చెల్లింపు రికార్డు బాగుంటుందని రాష్ట్రానికి రుణాలు ఇస్తారు
  • విద్యుత్‌ సంస్కరణలు అమలు చేయట్లేదని కేంద్రం ఒత్తిడి తెస్తోంది
  • రుణాలు నిలిపివేయాలని విద్యుత్‌ మంత్రి ఒత్తిడి తెస్తున్నారు

15:00 February 13

LIVE UPDATES: సీఎం కేసీఆర్​ ప్రెస్​మీట్​ లైవ్​ అప్​డేట్స్​

  • దేశం నష్టపోయిన అంశాలపై పుస్తకాలు వెలువడుతున్నాయి: సీఎం
  • చరిత్రను కప్పిపుచ్చి గోల్‌మాల్ చేస్తున్నారు: సీఎం కేసీఆర్‌
  • జనగామ, యాదాద్రి బహిరంగ సభల్లో ప్రసంగించా
  • బహిరంగ సభల్లో అన్నిఅంశాలు సమగ్రంగా చెప్పలేము
  • విద్యుత్‌ సంస్కరణలపై కేంద్రం ముసాయిదా బిల్లు చేసింది
  • ముసాయిదా బిల్లును పలు రాష్ట్రాల సీఎంలకు పంపారు
  • విద్యుత్‌ సంస్కరణల ముసాయిదా బిల్లుపై కేంద్రానికి లేఖ రాశా
  • కేంద్ర ముసాయిదా బిల్లుపై అసెంబ్లీలో తీర్మానం చేసి పంపాం
  • విద్యుత్‌ సంస్కరణలకు అదనపు రుణాలు తీసుకుంటున్నారు
  • అదనపు రుణాల విషయమై కేంద్ర బడ్జెట్‌లోనూ చెప్పారు
  • సాగు రంగంలో అభివృద్ధి ఆశాజనకంగా లేదు
  • రంగాలవారీగా దృష్టిపెట్టాల్సిన అవసరం ఉంది
  • వందశాతం మీటరింగ్‌పై డిస్కంలు చర్యలు తీసుకోవాలి
  • పాలసీ ప్రకారం వినియోగదారులకు ఏడాదిలోగా మీటర్లు పెట్టాలి
  • బిల్లు ఆమోదానికి ముందే రాజ్యాంగాన్ని ఉల్లంఘించారు
  • సంస్కరణలు అమలుచేస్తే అరశాతం ఎఫ్‌ఆర్‌బీఎం ఇస్తామన్నారు
  • అరశాతం ఎఫ్‌ఆర్‌బీఎం ఐదేళ్లపాటు ఇస్తామన్నారు
  • కేంద్ర విద్యుత్‌ సంస్కరణలకు తెలంగాణ అంగీకరించలేదు
  • కేంద్ర ముసాయిదా బిల్లుకు ఏపీ అంగీకరించింది
  • శ్రీకాకుళంలో 25 వేల వ్యవసాయ మీటర్లు ఏర్పాటు చేశారు
  • మిగతా విద్యుత్‌ మీటర్లకు రూ.737 కోట్లతో టెండర్లు పిలిచారు
  • ప్రధాని మోదీ చెప్పేది ఒకటి..చేసేది ఒకటి
Last Updated :Feb 13, 2022, 7:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.