ETV Bharat / city

సీఎం కేసీఆర్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు..

author img

By

Published : May 18, 2020, 7:03 PM IST

Updated : May 18, 2020, 9:31 PM IST

cm kcr
cm kcr

21:06 May 18

లాక్‌డౌన్‌పై పరిస్థితుల ఆధారంగా మరోసారి సమీక్ష 

  • జిల్లాల నుంచి హైదరాబాద్‌కు బస్సులు వస్తాయి
  • దిల్‌సుఖ్‌నగర్‌, ఇమ్లీబన్‌ వైపు బస్సులు తిరగవు
  • జూబ్లీ బస్టాండ్‌ నుంచి మాత్రమే బస్సులు తిరుగుతాయి
  • మహారాష్ట్ర, ఏపీలకు బస్సులు పంపట్లేదు, రానివ్వట్లేదు
  • రాత్రి 7 గంటలలోపే బస్సులు డిపోలకు వెళ్లిపోవాలి
  • ప్రైవేటు సర్వీసులు, బస్సులు, సొంత వాహనాలకు అనుమతి

21:05 May 18

ఏపీ, తెలంగాణకు ఏమీ వివాదాలు లేవు

  • కేంద్ర పన్నుల్లో వాటా అనేది రాజ్యాంగం ఇచ్చిన హక్కు
  • కేంద్రం పన్నుల రూపంలో కాకుండా సెస్సుల రూపంలో వసూలు చేస్తోంది
  • గోదావరి జలాలపై ఇటీవల ఒక కమిటీ వేశాను: సీఎం
  • తాగు, సాగునీటికి గోదావరి తప్ప మరో దిక్కు లేదు: సీఎం
  • మా వాటా 950 టీఎంసీలు కాకుండా మరిన్ని జలాలు కేటాయించాలని కోరుతున్నాం
  • ఏపీతో కలిసి ఉంటే కొంతమందికి కళ్లు మండుతున్నాయి
  • తెలంగాణ ప్రయోజనాలకు నష్టం కలగనంత వరకు ఏపీతో స్నేహం

20:53 May 18

  • చంద్రబాబు మాట్లాడితే బస్తీమే సవాల్ అన్నారు.. ఏం సాధించారు?
  • మహారాష్ట్ర మీదకు బాబ్లీ అని పంచాయతీ పెట్టారు చంద్రబాబు
  • నేను మహారాష్ట్రతో సత్సంబంధాలతో నీళ్లు సాధించా
  • రాయలసీమకు నీళ్లు అవసరమైతే గోదావరి నుంచి తీసుకుని వెళ్లండి
  • తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీ లేదు
  • మిగులు జలాలు ఉన్న గోదావరి నీళ్లు ఎవరు వాడుకున్నా అభ్యంతరం లేదు

20:45 May 18

నీటి వాటాలపై నాకు స్ఫటిక సదృశ్యమైన స్పష్టత ఉంది:  కేసీఆర్‌

  • ఉమ్మడి రాష్ట్రంలో అధికారిక కేటాయింపుల మేరకు ప్రాజెక్టులు నిర్మిస్తున్నాం
  • పోతిరెడ్డిపాడు మీద భయంకరంగా పోరాడింది ఎవరు?
  • ప్రతిపక్షాలకు విషయాలు వేటిని లేవనెత్తాలో కూడా తెలియట్లేదు
  • కాంగ్రెస్‌ హయాంలో సీఎంలకు చెంచాగిరి చేసిందెవరో తెలియదా
  • చట్టం పరిధిలో తెలంగాణ ప్రజలకు న్యాయం చేయడం కోసం ప్రయత్నం
  • నిబంధనలు ఎక్కడా ఉల్లంఘించి ప్రాజెక్టులు కట్టట్లేదు
  • మిగులు జలాలు గోదావరిలోకి పోయే బదులు రాయలసీమకు వెళితే తప్పేంటి
  • నీటి విషయంలో నాకున్న అవగాహన ప్రజలందరికీ తెలుసు
  • నీటి విషయంలో బేసిన్లు, భేషజాలు లేవని నేనే చెప్పాను

20:41 May 18

కేంద్ర ప్యాకేజీపై సీఎం కేసీఆర్ కామెంట్స్

  • కేంద్రం ప్రకటించిన ప్యాకేజీ ఒట్టి డొల్ల, బోగస్
  • కేంద్ర ప్యాకేజీ అంకెల గారడీ అని అంతర్జాతీయ పత్రికలే చెబుతున్నాయి
  • కేంద్రం వైఖరి నియంతృత్వంగా ఉంది
  • ఆర్థికంగా నిర్వీర్యమైన సమయంలో రాష్ట్రాలను భిక్షగాళ్లను చేస్తారా?
  • ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితి పెంచుతూ దరిద్రపు ఆంక్షలు పెట్టారు
  • కేంద్రం ప్రకటించిన దాన్ని ప్యాకేజీ అంటారా ఎవరన్నా?
  • కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల పట్ల దుర్మార్గంగా వ్యవహరిస్తోంది
  • కేంద్ర సంస్కరణలు అమలు చేస్తే రుణం ఇస్తామనడం ప్యాకేజీ అవుతుందా?
  • ఒకే దేశం - ఒకే రేషన్ అనే షరతు పెట్టారు
  • కేంద్ర ప్యాకేజీ పచ్చి దగా, మోసం, గ్యాస్
  • రాబోయే రోజుల్లో కేంద్రం తీరు జనాలకు తెలియకుండా ఉండదు
  • కేంద్రం వ్యవహరించిన తీరు చాలా తప్పు
  • రాష్ట్రాల మీద కేంద్రం పెత్తనం.. సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం
  • ఫలానావి చేస్తేనే డబ్బులిస్తాం అనడం ఏం ప్యాకేజీ?
  • సంస్కరణలు అమలు చేస్తేనే అని రాష్ట్రాలపై షరతులు రుద్దటం సరికాదు
  • కేంద్రం చెప్పిన పరిమితుల్లో అనేకంలో తెలంగాణ తొలి స్థానంలో ఉంది
  • అవసరమైతే ముష్టి రూ.2,500 కోట్లు తీసుకోం
  • రాష్ట్రాలకు భిక్షం వేస్తున్నారా? మావి కూడా రాజ్యాంగబద్ధమైన ప్రభుత్వాలే కదా?
  • శిశుపాలుడికి కూడా వంద తప్పుల వరకు సహించారు

20:31 May 18

ఏదైనా ఛానెల్‌లో రైతులతో ముఖాముఖి నేనే పెట్టి సందేహాలు నివృత్తి చేస్తా

తెలంగాణ సోనా రకాన్ని మన శాస్త్రవేత్తలే కనిపెట్టారు

షుగర్ శాతం తక్కువ ఉండే రకానికి అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్

వరిలో తెలంగాణ సోనా రకాన్నే రైతులు వేయాలి

ఫుడ్ ప్రాసెసింగ్ ఎస్‌ఈజెడ్‌లు ఏర్పాటు చేస్తున్నాం

40 లక్షల టన్నుల నిల్వకు సరిపడా గోదాముల నిర్మాణం

అభ్యుదయ వ్యవసాయ రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దుతాం

పెద్ద సంఖ్యలో ఫుడ్ ప్రాసెసింగ్‌ యూనిట్లు, నియోజకవర్గానికో కోల్డ్ స్టోరేజ్‌

అమ్మబోతే అడవి.. కొనబోతే కొరివి అనే పాతవిధానం మారాలి

20:30 May 18

వరిలో ఏఏ రకాలు వేస్తే లాభమో అవి మాత్రమే వేయాలి

  • 40 లక్షల ఎకరాల్లో వరి పంటలు వేద్దాం
  • వర్షాకాలంలో మక్క పంట వేయవద్దు.. బదులుగా కందులు వేయాలి
  • రాష్ట్రంలో మక్కల వినియోగం 25 లక్షల టన్నుల వరకు ఉంది
  • వేసంగిలోనే మక్క పంట వేయాలి.. వర్షాకాలంలో వేయవద్దు
  • ఏ పంటను ఎలా.. ఎప్పుడు పండించాలనేది ప్రభుత్వం చెబుతుంది
  • ఈసారి 15 లక్షల ఎకరాల్లో కంది పంట వేద్దాం
  • కంది పంట మొత్తం ప్రభుత్వమే కొంటుంది
  • 2 లక్షల ఎకరాల్లో కూరగాయలు పండించాలి
  • ఎప్పటిలాగే 1.25 లక్షల ఎకరాల్లో పసుపు పంట వేసుకోవచ్చు
  • మిర్చి, సోయాబీన్, మామిడి, బత్తాయి ఎప్పటిలాగే వేసుకోవచ్చు
    వరి పంట ప్రభుత్వం చెప్పింది కాకుండా వేరేది వేయకూడదు
  • ప్రభుత్వం చెప్పిన రకం కాకుండా వరి వేస్తే రైతుబంధు వర్తించదు
  • ప్రభుత్వం చెప్పే పంటలు రైతులతో వేయించే బాధ్యత కలెక్టర్లదే
  • కొత్త వ్యవసాయ విధానం అమల్లో కలెక్టర్ల మధ్య పోటీ పెట్టాం
    అంతర్జాతీయ మార్కెట్‌లో పోటీపడి మన ధాన్యం అమ్ముడవ్వాలి

20:20 May 18

రైతులు నియంత్రిత విధానంలో వ్యవసాయం చేయాలి: సీఎం

  • నియంత్రిత వ్యవసాయ విధానంపై వ్యవసాయ, పౌరసరఫరాల మంత్రులు, శాస్త్రవేత్తలతో చర్చ
  • తెలంగాణలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన పత్తి పండుతోంది
  • తెలంగాణ పత్తికి పింజ పొడుగు.. పత్తిలో దూది శాతం ఎక్కువ
  • పత్తి నాణ్యత ఇంకాస్త పెంచితే ప్రపంచంలోనే మన పంటకు గొప్ప పేరు వస్తుంది
  • ప్రభుత్వం చెప్పినట్లు పంటలు వేసి మంచి ధరను రైతు పొందాలి
  • కాళేశ్వరం నీళ్లు వచ్చినందున వ్యవసాయ విస్తీర్ణం పెరుగుతుంది
  • 70 లక్షల ఎకరాల్లో పత్తి పంటను పండిచాలి
  • గతంలో 53 లక్షల ఎకరాల్లో పత్తి పండించారు.. ఈసారి 70 లక్షల ఎకరాల్లో వేయాలి
  • మన పత్తికి డిమాండ్ ఉంది
  • ప్రాజెక్టు పరివాహక ప్రాంతంలో.. భూగర్భ జలాల సాగులోనూ పత్తి వేయండి
  • పత్తి పంటకు అధిక దిగుబడి, లాభం వస్తుంది
  • వరిలో ఏఏ రకాలు వేస్తే లాభమో అవి మాత్రమే వేయాలి

20:11 May 18

రైతులకు ఉచిత నీటి సరఫరా ఒక్క తెలంగాణలోనే ఉంది: సీఎం

  • రైతు బీమా రూ.700 కోట్ల నుంచి రూ.1,100 కోట్లకు పెంచాం: సీఎం
  • 24 గంటల ఉచిత నాణ్యమైన విద్యుత్ తెలంగాణలోనే ఉంది: సీఎం
  • వేలాది పాడిపశువులు పంపిణీ చేసి ప్రోత్సాహకాలు అందిస్తున్నాం: సీఎం
  • అధునాతన పద్ధతుల్లో పంటలు పండించేందుకు విప్లవాత్మక చర్యలకు శ్రీకారం
  • 5 వేల ఎకరాలకు ఒక క్లస్టర్‌ ఏర్పాటు చేసిన ఘనత తెలంగాణదే
  • గతంలో ఉన్న ఎరువులు, విత్తనాల కొరత అధిగమించేశాం
  • కల్తీ విత్తన విక్రేతలపై ఒక్క తెలంగాణలోనే పీడీ యాక్టు అమలు అవుతోంది
  • రూ.350 కోట్లతో క్లస్టర్లలో రైతు వేదికలు ఏర్పాటు చేస్తున్నాం: సీఎం
  • రైతులకు ప్రోత్సాహకాలు, రక్షణ కల్పనలో తెలంగాణ దేశానికి ఆదర్శం

20:08 May 18

వ్యవసాయ రాష్ట్రంగా తెలంగాణ అవతరించేందుకు ఎన్నో అవకాశాలు

  • తెలంగాణలో ఉన్న నేల స్వభావం ఎంతో అరుదైనది
  • ఇక్రిశాట్‌ హైదరాబాద్‌లో పెట్టడానికి ఇక్కడి నేల తత్వమే కారణం
  • సమశీతోష్ణ వాతావరణ పరిస్థితులు తెలంగాణకు ఉన్న వరం
  • అన్ని పంటలు పండటానికి అనుకూల వాతావరణం ఇక్కడ ఉంది
  • అన్ని పంటలు పండటానికి అనుకూల వాతావరణం ఇక్కడ ఉంది
  • పంటల ఉత్పత్తిలో తెలంగాణ చరిత్ర సృష్టిస్తోంది
  • దేశానికి, ప్రపంచానికి అన్నం పెట్టే పరిస్థితికి తెలంగాణ ఎదుగుతోంది
  • నీటిపారుదల ప్రాజెక్టులు చాలా చురుగ్గా సాగుతున్నాయి
  • నీటిపారుదల ప్రాజెక్టుల ఫలాలు మనం చూస్తున్నాం
  • బలమైన ఈదురుగాలులు, వరదల వంటి విపత్తులు తెలంగాణలో తక్కువ
  • కొన్ని రకాల అరుదైన పండ్లకు తెలంగాణ కేంద్రంగా ఉంది
  • తెలంగాణ అవతరించాక దేశ చరిత్రలో లేనివిధంగా రైతు ప్రోత్సాహకాలు
  • తెలంగాణలో అమలు చేసే పథకాలను అందరూ అనుసరిస్తున్నారు

20:03 May 18

వీటికి అనుమతి లేదు: సీఎం

  • మెట్రో రైలు సర్వీసులు కూడా పనిచేయవు: సీఎం
  • సినిమా హాళ్లు, ఫంక్షన్ హాళ్లకు అనుమతి లేదు: సీఎం
  • అన్ని రకాల విద్యాసంస్థలు బంద్: సీఎం
  • బార్లు, పబ్‌లు, క్లబ్‌లు, క్రీడా స్టేడియాలు, జిమ్‌లు, పార్కులు కూడా బంద్
  • ప్రతి ఒక్కరూ మాస్కు తప్పనిసరిగా ధరించాలి: సీఎం
  • మాస్కులు ధరించకపోతే రూ.వెయ్యి జరిమానా: సీఎం
  • వ్యక్తిగత శానిటైజేషన్ దుకాణాల యజమానులే చేసుకోవాలి: సీఎం
  • దుకాణాల్లో వినియోగదారులు భౌతిక దూరం పాటించాలి: సీఎం
  • అవసరం ఉంటే తప్ప బయటకు రాకూడదు: సీఎం
  • పిల్లలు, వృద్ధులను ఇళ్లకే పరిమితం చేయండి: సీఎం
  • జాగ్రత్తలు పాటిస్తే త్వరలోనే కరోనా నుంచి బయటపడతాం: సీఎం
  • వ్యవసాయ రాష్ట్రంగా తెలంగాణ అవతరించేందుకు ఎన్నో అవకాశాలు
  • తెలంగాణలో ఉన్న నేల స్వభావం ఎంతో అరుదైనది
  • ఇక్రిశాట్‌ హైదరాబాద్‌లో పెట్టడానికి ఇక్కడి నేల తత్వమే కారణం
  • సమశీతోష్ణ వాతావరణ పరిస్థితులు తెలంగాణకు ఉన్న వరం
  • అన్ని పంటలు పండటానికి అనుకూల వాతావరణం ఇక్కడ ఉంది

19:59 May 18

రేపటి నుంచి ఆర్టీసీ బస్సులు తిరుగుతాయి: సీఎం

  • హైదరాబాద్ నగరం తప్ప అన్నిచోట్లా అన్ని దుకాణాలు తెరుచుకోవచ్చు: సీఎం
  • హైదరాబాద్‌లో జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఎక్కడ దుకాణాలు తెరవాలో ప్రకటిస్తారు: సీఎం
  • హైదరాబాద్‌లో ఎక్కడెక్కడ దుకాణాలు ఏ పద్ధతిలో తెరవాలో తెలియచేస్తాం: సీఎం
  • రేపటి నుంచి ఆర్టీసీ బస్సులు తిరుగుతాయి: సీఎం
  • అంతర్రాష్ట్ర బస్సులు అనుమతించట్లేదు: సీఎం
  • హైదరాబాద్‌లో ఆటోలు, కార్లు తిరగటానికి అనుమతి: సీఎం
  • నిబంధనలకు మించి ఎక్కించుకుంటే కఠిన చర్యలు: సీఎం

19:52 May 18

రాష్ట్రంలో మే 31 వరకు లాక్‌డౌన్‌ : సీఎం

  • మే 31 వరకు లాక్‌డౌన్‌ పొడిగింపు: సీఎం
  • కేంద్ర మార్గదర్శకాలపై విస్తృతంగా చర్చ జరిగింది: సీఎం
  • అధికారులతో మాట్లాడి వ్యూహరచన చేశాం: సీఎం
  • రాష్ట్రంలో కంటైన్‌మెంట్ ప్రాంతాలు తప్ప మిగతావన్నీ గ్రీన్‌జోన్లే
  • కంటైన్మెంట్ ఏరియాలో ప్రభావం ఉన్న పరిసరాల్లో మాత్రమే లాక్‌డౌన్
  • 1452 కుటుంబాలు మాత్రమే కంటైన్‌మెంట్‌ ఏరియాలో ఉంటారు: సీఎం
  • పూర్తిగా పోలీస్ పహారాలోనే కంటైన్‌మెంట్ ఏరియా ఉంటుంది: సీఎం
  • కంటైన్‌మెంట్ ఏరియాలో ఉండే కుటుంబాలకు నిత్యావసరాలు ప్రభుత్వమే సరఫరా: సీఎం
  • కరోనాకు వ్యాక్సిన్‌ రేపోమాపో వచ్చే పరిస్థితి లేదని ప్రపంచం అంగీకరించింది: సీఎం
  • కరోనాతో కలిసి జీవించడం నేర్చుకోవాలి: సీఎం
  • బతుకుదెరువు కోసం అన్ని జాగ్రత్తలు తీసుకుని ముందుకు పోవాలి: సీఎం
  • హైదరాబాద్ నగరం తప్ప అన్నిచోట్లా అన్ని దుకాణాలు తెరుచుకోవచ్చు: సీఎం

18:53 May 18

రాష్ట్రంలో లాక్‌డౌన్‌ సడలింపులపై సర్వత్రా ఉత్కంఠ...

కరోనా కట్టడి, లాక్‌డౌన్‌కు సంబంధించి.. రాష్ట్రంలో అనుసరించాల్సిన వ్యూహంపై మంత్రివర్గ సమావేశం కొనసాగుతోంది. రాష్ట్రంలో నమోదవుతున్న కరోనా కేసులు, ఇప్పటి వరకు చేపట్టిన నిరోధక చర్యలు, లాక్‌డౌన్‌కు సంబంధించి... కేంద్రం ఇచ్చిన సడలింపులు, రాష్ట్రంలో అనుసరించాల్సిన వ్యూహాలపై సీఎం కేసీఆర్‌... మంత్రుల అభిప్రాయాలు సేకరిస్తున్నట్లు తెలుస్తోంది.  

కేంద్రం నూతన మార్గదర్శకాలకు అనుగుణంగా ఎలా ముందుకెళ్లాలనే అంశంపై చర్చిస్తున్నట్టు సమాచారం. రేపటి నుంచి ఆర్టీసీ బస్సులు ప్రారంభమయ్యే అవకాశం కనిపిస్తుండగా ఆ విషయంలో ఏ విధంగా నిర్వహించాలనే అంశంపై... కేసీఆర్‌ చర్చిస్తున్నట్లు తెలిసింది. ఈ మేరకు ఆర్టీసీ అధికారులతో ఇవాళ మధ్యాహ్నమే సమీక్షించిన రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌... సీఎం కేసీఆర్​కు వివరణ ఇచ్చారు.

Last Updated :May 18, 2020, 9:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.