ETV Bharat / city

కాసేపట్లో జూనియర్​ ఎన్టీఆర్​ను కలవనున్న అమిత్ షా

author img

By

Published : Aug 21, 2022, 2:06 PM IST

Updated : Aug 21, 2022, 8:02 PM IST

బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న అమిత్‌షా
బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న అమిత్‌షా

20:01 August 21

కాసేపట్లో జూనియర్​ ఎన్టీఆర్​ను కలవనున్న అమిత్ షా

  • నోవాటెల్‌ హోటల్‌ చేరుకున్న కేంద్ర హోమంత్రి అమిత్‌ షా
  • కాసేపట్లో జూనియర్​ ఎన్టీఆర్​ను కలవనున్న అమిత్ షా
  • అమిత్‌షా-జూనియర్‌ ఎన్టీఆర్‌ భేటీని ధ్రువీకరించిన భాజపా వర్గాలు
  • జూనియర్‌ ఎన్టీఆర్‌ను సమావేశానికి ఆహ్వానించిన అమిత్‌షా

18:52 August 21

కేసీఆర్‌ కుటుంబ పాలన వల్ల ప్రజలు ఎందుకు బాధ పడాలి: అమిత్‌ షా

  • కేసీఆర్‌, ఆయన కుమారుడు, కుమార్తె, అల్లుడు పదవుల్లో ఉంటే మాకు బాధ లేదు
  • కేసీఆర్‌ కుటుంబ పాలన వల్ల ప్రజలు ఎందుకు బాధ పడాలి: అమిత్‌ షా
  • కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్‌ కుటుంబానికి ఏటీఎంగా మారింది
  • అన్ని రాష్ట్రాలు రెండుసార్లు పెట్రోల్‌, డీజిల్ ధరలు తగ్గిస్తే కేసీఆర్‌ తగ్గించలేదు
  • కేసీఆర్ వైఖరి వల్ల దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధర తెలంగాణలోనే అధికంగా ఉంది
  • మునుగోడు అభివృద్ధికి మోదీ సర్కారు కట్టుబడి ఉంటుంది
  • తెలంగాణలో భాజపా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారా?:
  • అమిత్‌ షా సమక్షంలో భాజపాలో చేరిన పలువురు నాయకులు
  • పలువురు నేతలకు భాజపా కండువా కప్పిన అమిత్‌ షా

18:45 August 21

మజ్లిస్‌కు భయపడి విమోచన దినోత్సవాన్ని కేసీఆర్ జరపడం లేదు

  • రాజగోపాల్‌రెడ్డి పార్టీలో చేరడం అంటే ఒక నాయకుడు చేరినట్లు కాదు
  • కేసీఆర్ ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో పెకిలించి సముద్రంలో పారేసేందుకు ఇది ప్రారంభం
  • రాజగోపాల్‌రెడ్డిని గెలిపిస్తే కేసీఆర్ ప్రభుత్వం మాయం అవుతుంది
  • మజ్లిస్‌కు భయపడి విమోచన దినోత్సవాన్ని కేసీఆర్ జరపడం లేదు
  • తెలంగాణలో భాజపా ప్రభుత్వం వచ్చితీరుతుంది: అమిత్ షా
  • భాజపా ప్రభుత్వం వచ్చాక సెప్టెంబరు 17ను ఉత్సవంగా జరుపుతాం
  • నిరుద్యోగులకు రూ.3 వేల భృతి ఇస్తానని కేసీఆర్ ఇచ్చారా?
  • ప్రతి జిల్లాకు ఒక సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మించారా?
  • రెండు పడకల గది ఇళ్లు కాదు కదా.. టాయిలెట్లు కూడా నిర్మించలేదు
  • కేంద్రం నిర్మించే మరుగుదొడ్లను కేసీఆర్‌ను అడ్డుకుంటున్నారు
  • దళితుడిని సీఎం చేస్తానన్న కేసీఆర్ మాట నిలబెట్టుకున్నారా?
  • తెరాసకు ఓటు వేస్తే.. ఎన్నిసార్లయినా కేసీఆర్‌ సీఎం అవుతారు తప్ప దళితుడు కాదు
  • హుజురాబాద్‌లో చెప్పిన దళితబంధు ఎన్ని కుటుంబాలకు ఇచ్చారు
  • దళితులకు మూడెకరాల భూమి ఇస్తానని ఇచ్చారా?: అమిత్ షా
  • రైతులను కేసీఆర్‌ తీవ్రంగా మోసం చేస్తున్నారు: అమిత్ షా
  • పీఎం ఫసల్‌ బీమాను తెలంగాణలో అమలు చేయకపోవడంతో రైతులు నష్టపోతున్నారు
  • భాజపా రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ప్రతి ధాన్యం గింజను కొంటుంది

18:34 August 21

ఈడీ, సీబీఐ పేరు చెప్తే కేసీఆర్ ఎందుకు భయపడుతున్నారు: కిషన్‌రెడ్డి

  • కేసీఆర్‌ కుటుంబ పాలనకు చరమగీతం పాడాలి: కిషన్‌రెడ్డి
  • తెలంగాణ తల్లికి విముక్తి కల్గించేందుకు అమిత్ షా వచ్చారు: కిషన్‌రెడ్డి
  • ఈడీ, సీబీఐ పేరు చెప్తే కేసీఆర్ ఎందుకు భయపడుతున్నారు: కిషన్‌రెడ్డి
  • తప్పు చేసిన వారే దర్యాప్తు సంస్థలంటే భయపడతారు: కిషన్‌రెడ్డి
  • కేసీఆర్‌ ప్రతిపశ్నకు జవాబు చెప్పే సత్తా భాజపాకు ఉంది: కిషన్‌రెడ్డి
  • రాజగోపాల్‌రెడ్డి రాజీనామా చేసి భాజపాలో చేరారు: కిషన్‌రెడ్డి

18:21 August 21

మునుగోడు అభ్యర్థిని ప్రకటించే దమ్ము కూడా కేసీఆర్‌కు లేదు: రాజగోపాల్‌రెడ్

  • కుటుంబ పాలనలో బందీ అయిన తెలంగాణకు విముక్తి కల్పించాలి: రాజగోపాల్‌రెడ్డి
  • ఒక పార్టీలో గెలిచి ఒక పార్టీలోకి నేను వెళ్లట్లేదు: రాజగోపాల్‌రెడ్డి
  • రాజీనామా చేసి నిజాయతీగా ప్రజల తీర్పు కోరుతున్నా: రాజగోపాల్‌ రెడ్డి
  • కేసీఆర్‌ వివక్షకు వ్యతిరేకంగా యుద్ధం చేస్తున్నా: రాజగోపాల్‌రెడ్డి
  • ఎన్నిసార్లు అపాయింట్‌మెంట్ అడిగినా కేసీఆర్‌ ఇవ్వలేదు: రాజగోపాల్‌రెడ్డి
  • నా రాజీనామా తర్వాతే కేసీఆర్‌ నిద్ర లేచారు: రాజగోపాల్‌ రెడ్డి
  • నా రాజీనామాతో గట్టుప్పల్‌ మండలం, పింఛన్లు వచ్చాయి: రాజగోపాల్‌
  • 2018లో చెప్పిన 57 ఏళ్ల వారికి ఫించను ఇప్పుడు ఇస్తున్నారు: రాజగోపాల్‌రెడ్డి
  • దేశ, రాష్ట్ర అభివృద్ధి భాజపాతోనే సాధ్యం: రాజగోపాల్‌రెడ్డి
  • మునుగోడు అభ్యర్థిని ప్రకటించే దమ్ము కూడా కేసీఆర్‌కు లేదు: రాజగోపాల్‌రెడ్డి
  • కాళేశ్వరం అక్రమసొమ్ముతో ఎమ్మెల్యేలను కొన్నారు: రాజగోపాల్‌రెడ్డి

18:19 August 21

కేసీఆర్‌ కుటుంబ పాలనను కూకటివేళ్లతో పెకిలించాలి: లక్ష్మణ్‌

  • నిన్న తెరాస సభ జనం లేక వెలవెలబోయింది: ఎంపీ లక్ష్మణ్‌
  • కేసీఆర్‌ వైఖరి.. ఆడలేక మద్దెలఓడు అన్నట్లుంది: ఎంపీ లక్ష్మణ్‌
  • రైతుల ఆదాయం రెట్టింపు చేసేందుకు మోదీ కృషి చేస్తున్నారు: లక్ష్మణ్‌
  • రాష్ట్రంలో ధాన్యం కొనకుండా కేసీఆర్‌ రైతులను ఇబ్బంది పెట్టారు: లక్ష్మణ్‌
  • కేసీఆర్‌ కుటుంబ పాలనను కూకటివేళ్లతో పెకిలించాలి: లక్ష్మణ్‌
  • నయా నిజాం మెడలు వంచేది భాజపా మాత్రమే: ఎంపీ లక్ష్మణ్‌

18:08 August 21

  • నిన్న తెరాస సభ జనం లేక వెలవెలబోయింది: ఎంపీ లక్ష్మణ్‌
  • కేసీఆర్‌ వైఖరి.. ఆడలేక మద్దెలఓడు అన్నట్లుంది: ఎంపీ లక్ష్మణ్‌
  • రైతుల ఆదాయం రెట్టింపు చేసేందుకు మోదీ కృషి చేస్తున్నారు: లక్ష్మణ్‌
  • రాష్ట్రంలో ధాన్యం కొనకుండా కేసీఆర్‌ రైతులను ఇబ్బంది పెట్టారు: లక్ష్మణ్‌
  • కేసీఆర్‌ కుటుంబ పాలనను కూకటివేళ్లతో పెకిలించాలి: లక్ష్మణ్‌
  • నయా నిజాం మెడలు వంచేది భాజపా మాత్రమే: ఎంపీ లక్ష్మణ్‌

18:06 August 21

  • మునుగోడులో భాజపా బహిరంగ సభకు హాజరైన అమిత్ షా
  • రాజగోపాల్‌రెడ్డిని భాజపాలోకి ఆహ్వానించిన అమిత్ షా
  • రాజగోపాల్‌రెడ్డికి కాషాయ కండువా కప్పిన అమిత్ షా

17:21 August 21

మునుగోడు సభా వేదిక వద్దకు చేరుకున్న అమిత్ షా

  • మునుగోడు సభా వేదిక వద్దకు చేరుకున్న అమిత్ షా
  • అమిత్ షా రాకతో నేతలు, కార్యకర్తల్లో ఉత్సాహం
  • మునుగోడు బహిరంగసభకు బయలుదేరిన అమిత్ షా
  • బేగంపేట విమానాశ్రయం నుంచి బయలుదేరిన అమిత్ షా

16:49 August 21

కేసీఆర్‌ దిల్లీలో మద్దతు ఇచ్చి రాష్ట్రానికి వచ్చి మాట మార్చారు: సంజయ్‌

  • విద్యుత్ సవరణ చట్టాల మీద ఎలాంటి చర్చ జరగలేదు: బండి సంజయ్‌
  • కావాలనే కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు: బండి సంజయ్‌
  • సేంద్రీయ వ్యవసాయం గురించే అమిత్ షా మాట్లాడారు: బండి సంజయ్‌
  • దిల్లీలో విద్యుత్‌ చట్టాలకు కేసీఆర్‌ మద్దతు తెలిపారు: బండి సంజయ్‌
  • కేసీఆర్‌ దిల్లీలో మద్దతు ఇచ్చి రాష్ట్రానికి వచ్చి మాట మార్చారు: సంజయ్‌

16:37 August 21

మోటార్లకు మీటర్లు అంటూ కేసీఆర్‌ దుష్ప్రచారం చేస్తున్నారు

  • ధనిక రాష్ట్రంలో పిల్లలకు పుస్తకాలు ఇవ్వలేని దుస్థితి: కొండా విశ్వేశ్వర్‌రెడ్డి
  • కమీషన్లు వచ్చే కాళేశ్వరంలోనే నిధులన్నీ గుమ్మరించారు: కొండా విశ్వేశ్వరరెడ్డి
  • ప్రతిపక్ష ఎమ్మెల్యేల నియోజకవర్గాలకు కేసీఆర్‌ నిధులు ఇవ్వలేదు
  • మునుగోడులో ఉపఎన్నిక రాబోతుందని ఇప్పుడు రోడ్లు వేస్తున్నారు
  • మోటార్లకు మీటర్లు అంటూ కేసీఆర్‌ దుష్ప్రచారం చేస్తున్నారు
  • మీటర్లు ట్రాన్స్‌ఫార్మర్లకు పెడతారు కానీ.. రైతుల మోటార్లకు కాదు

16:35 August 21

విద్యుత్ మోటర్లకు మీటర్ల గురించి అమిత్ షాను అడిగాం: రైతు నేతలు

  • విద్యుత్ మోటర్లకు మీటర్ల గురించి అమిత్ షాను అడిగాం: రైతు నేతలు
  • విద్యుత్ చట్టాలను మార్చాలని అమిత్‌ షాను అడిగాం: రైతు సంఘాల నేతలు
  • చట్టాలు కాదు.. ముందు ప్రభుత్వాన్ని మార్చాలన్నారు: రైతు సంఘాల నేతలు

16:17 August 21

కాసేపట్లో మునుగోడు సమరభేరి సభకు హాజరుకానున్న అమిత్‌ షా

  • మునుగోడులో కాసేపట్లో భాజపా బహిరంగ సభ
  • మునుగోడు సమరభేరి సభకు హాజరుకానున్న అమిత్‌ షా
  • ఇప్పటికే సభా స్థలికి చేరకున్న పలువురు భాజపా నాయకులు
  • మునుగోడులో భాజపా సభకు తరలివస్తున్న కార్యకర్తలు, ప్రజలు
  • సభకు హాజరైన లక్ష్మణ్, రాజాసింగ్‌, రఘునందన్‌రావు, మురళీధర్‌రావు
  • సభకు హాజరైన డి.కె.అరుణ, వివేక్‌, ఇంద్రసేనారెడ్డి, కొండా విశ్వేశ్వరరెడ్డి

15:50 August 21

రైతు సంఘాల నేతలతో ముగిసిన అమిత్ షా సమావేశం

  • రైతు సంఘాల నేతలతో ముగిసిన అమిత్ షా సమావేశం

15:37 August 21

రాత్రి 8.30 గంటలకు అమిత్‌ షాతో భేటీకానున్న ఎన్‌టీఆర్‌

  • రాత్రి 8.30 గం.కు అమిత్‌ షాతో భేటీకానున్న ఎన్‌టీఆర్‌
  • నోవాటెల్ హోటల్‌లో అమిత్ షాను కలవనున్న ఎన్‌టీఆర్

15:18 August 21

బేగంపేటలో రైతుసంఘాల నేతలతో సమావేశమైన అమిత్ షా

  • బేగంపేటలో రైతుసంఘాల నేతలతో సమావేశమైన అమిత్ షా
  • కాసేపట్లో మునుగోడు సభకు బయలుదేరనున్న అమిత్‌ షా

15:05 August 21

కార్యకర్త సత్యనారాయణ ఇంట్లో తేనీరు సేవించిన అమిత్ షా

  • సికింద్రాబాద్‌లో భాజపా కార్యకర్త ఇంటికి వెళ్లిన అమిత్‌షా
  • సాంబమూర్తినగర్‌లో ఎస్సీ కార్యకర్త ఇంటికి వెళ్లిన అమిత్‌షా
  • కార్యకర్త సత్యనారాయణ ఇంట్లో తేనీరు సేవించిన అమిత్ షా
  • అనంతరం బేగంపేట విమానాశ్రయానికి బయలుదేరిన అమిత్ షా

14:37 August 21

సాంబమూర్తినగర్‌లోని భాజపా కార్యకర్త ఇంటికి వెళ్లిన అమిత్‌ షా

  • భాజపా కార్యకర్త ఇంటికి వెళ్లిన అమిత్‌ షా
  • సాంబమూర్తినగర్‌లోని భాజపా కార్యకర్త ఇంటికి వెళ్లిన అమిత్‌ షా
  • కార్యకర్త సత్యనారాయణ ఇంటి వద్ద పోలీసుల బందోబస్తు
  • అమిత్‌షా రాకతో భారీగా మోహరించిన పోలీసులు
  • అమిత్‌షాకు స్వాగతం పలికిన సత్యనారాయణ కుటుంబసభ్యులు

14:24 August 21

అమిత్‌షాకు పూర్ణకుంభంతో స్వాగతం పలికిన ఆలయ అర్చకులు

  • సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయం వద్ద అమిత్‌ షా
  • అమిత్‌షాకు పూర్ణకుంభంతో స్వాగతం పలికిన ఆలయ అర్చకులు
  • సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయం వద్ద భారీ బందోబస్తు
  • ఎవరినీ లోపలికి అనుమతించకుండా పటిష్ట భద్రతా ఏర్పాట్లు
  • అమిత్‌షా పర్యటన నేపథ్యంలో భారీ బందోబస్తు

14:13 August 21

  • సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయం వద్ద భారీ బందోబస్తు
  • ఎవరినీ లోపలికి అనమతించకుండా పటిష్ట భద్రతా ఏర్పాట్లు

14:13 August 21

  • ఉజ్జయిని అమ్మవారి ఆలయంలో పూజల అనంతరం భాజపా కార్యకర్త సత్యనారాయణ ఇంటికి వెళ్లనున్న అమిత్‌ షా
  • అనంతరం బేగంపేటలోని మనోహర్ హోటల్‌కి వెళ్లనున్న అమిత్‌ షా
  • మ.3.20 నుంచి సా. 4 వరకు రైతు సంఘాల నేతలతో సమావేశం
  • సాయంత్రం 4.10గంటలకు ప్రత్యేక హెలికాప్టర్‌లో మునుగోడుకు అమిత్‌ షా
  • సాయంత్రం 4.40 గంటలకు సీఆర్పీఎఫ్ అధికారులతో అమిత్‌షా సమావేశం
  • సా.5 గంటలకు బహిరంగ సభలో పాల్గొననున్న కేంద్రమంత్రి అమిత్‌ షా
  • సభలో అమిత్ షా సమక్షంలో భాజపాలో చేరనున్న కోమటిరెడ్డి రాజ్‌గోపాల్‌రెడ్డి
  • రాత్రి 7.50 గంటలకు శంషాబాద్ నోవాటల్ హోటల్‌ చేరుకోనున్న అమిత్‌ షా
  • రాత్రి 8 గంటల నుంచి 9 వరకు భాజపా ముఖ్య నేతలతో సమావేశం
  • ముఖ్యనేతలతో సమావేశం అనంతరం దిల్లీ వెళ్లనున్న కేంద్రమంత్రి అమిత్‌ షా

14:07 August 21

  • సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయానికి బయలుదేరిన అమిత్ షా, బండి సంజయ్, కిషన్ రెడ్డి
  • ఉజ్జయిని అమ్మవారి ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించనున్న నేతలు
  • దాదాపు అరగంట పాటు అమ్మవారి ఆలయంలో గడపనున్న అమిత్ షా, బండి సంజయ్, కిషన్ రెడ్డి

13:57 August 21

బేగంపేట విమానాశ్రయంలో అమిత్‌ షాకు ఘన స్వాగతం

  • బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న అమిత్‌ షా
  • అమిత్‌షాకు స్వాగతం పలికిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
  • స్వాగతం పలికిన బండి సంజయ్, తరుణ్ చుగ్, ప్రేమేందర్ రెడ్డి
  • అనంతరం సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయానికి చేరుకోనున్న అమిత్ షా
Last Updated :Aug 21, 2022, 8:02 PM IST

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.