ETV Bharat / business

స్టాక్​ మార్కెట్ల నయా రికార్డ్- సెన్సెక్స్​@72,038- నిఫ్టీ@21,654

author img

By ETV Bharat Telugu Team

Published : Dec 27, 2023, 3:57 PM IST

Updated : Dec 27, 2023, 4:59 PM IST

bse sensex
stock market close today

Stock Market Close Today 27th December 2023 In Telugu : బుధవారం దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్​ 72,038 వద్ద, నిఫ్టీ 21,654 వద్ద ఆల్​-టైమ్ హై క్లోజింగ్​ను నమోదు చేశాయి.

Stock Market Close Today 27th December 2023 : దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం భారీ లాభాలు సాధించి, ఆల్​టైమ్​ హై క్లోజింగ్​ నమోదు చేశాయి. చరిత్రలో తొలిసారి బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి​ సూచీ సెన్సెక్స్​ 72,000 మార్కుకు ఎగువన ముగిసింది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి​ సూచీ నిఫ్టీ 21,654 వద్ద స్థిరపడి సరికొత్త రికార్డు సృష్టించింది.

  • బుధవారం బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 71,492 వద్ద మంచి లాభాలతో ప్రారంభమైంది. ఒకానొక దశలో 72,119 వద్ద జీవనకాల గరిష్ఠాలను తాకింది. చివరికి 72,038 వద్ద రికార్డు స్థాయి ముగింపును నమోదు చేసింది.
  • జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ బుధవారం ఉదయం 21,497 వద్ద ప్రారంభమైంది. తరువాత 21,673 వద్ద జీవనకాల గరిష్ఠాలను నమోదు చేసింది. చివరికి 21,654 వద్ద ఆల్​-టైమ్ హైరికార్డ్​తో ముగిసింది.

అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు రావడం, దేశ స్థూల ఆర్థిక వృద్ధి అంచనాలు పెరగడం కూడా ఇందుకు కారణం. వీటితోపాటు మెటల్​, కమోడిటీ, ఆటో, బ్యాంకింగ్​ షేర్లు లాభాల పంట పండించడం వల్ల దేశీయ స్టాక్ మార్కెట్లు రికార్డు స్థాయి ముగింపును నమోదు చేశాయి.

  • లాభపడిన షేర్లు : ఆల్ట్రాటెక్​ సిమెంట్​, జేఎస్​డబ్ల్యూ సిమెంట్​, టాటా మోటర్స్, భారతీ ఎయిర్​టెల్​, ఎల్​ అండ్ టీ, ఎస్​బీఐ, ఇన్ఫోసిస్​, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్​, ఐసీఐసీఐ బ్యాంక్​
  • నష్టపోయిన షేర్లు : ఎన్​టీపీసీ, టెక్ మహీంద్రా

ఆసియా, యూరోపియన్​ మార్కెట్లు
Asian Stock Markets Today 27th December 2023 : బుధవారం సియోల్​, టోక్యో, షాంఘై, హాంకాంగ్​ మొదలైన ఆసియా మార్కెట్లు ఉన్న మంచి లాభాలతో ముగిశాయి. యూరోపియన్​ మార్కెట్లు కూడా చాలా వరకు లాభాల్లోనూ కొనసాగుతున్నాయి.

శాంటా క్లాజ్​ ర్యాలీ
US Stock Markets Today 27th December 2023 : మంగళవారం యూఎస్​ మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి. అంతర్జాతీయ ద్రవ్యోల్బణ అంచనాలు తగ్గుముఖం పట్టడం సహా యూఎస్​ ఫెడరల్ రిజర్వ్​ కీలక వడ్డీ రేట్లు తగ్గించవచ్చనే అంచనాలతో యూఎస్​ మార్కెట్లలో శాంటా క్లాజ్​ ర్యాలీ నడిచింది.

ముడి చమురు ధరలు
Crude Oil Prices Today 27th December 2023 : అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు 0.21 శాతం మేర తగ్గాయి. ప్రస్తుతం బ్యారెల్ క్రూడ్​ ఆయిల్ ధర 80.90 డాలర్లుగా ఉంది.

సెకండ్​ హ్యాండ్​ కారు కొనాలా? ఈ విషయాలు కచ్చితంగా తెలుసుకోండి!

SBI కస్టమర్లకు గుడ్ న్యూస్​ - 'అమృత్ కలశ్'​ గడువు పెంపు - ఎఫ్​డీల వడ్డీ రేట్లు కూడా!

Last Updated :Dec 27, 2023, 4:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.