ETV Bharat / business

IBM ఉద్యోగులకు షాక్.. 3,900 జాబ్స్​ కట్​!

author img

By

Published : Jan 26, 2023, 1:54 PM IST

Updated : Jan 26, 2023, 2:46 PM IST

IBM to cut 3900 jobs
IBM to cut 3900 jobs

ఐటీ కంపెనీలు ఒకదాని తర్వాత ఒకటి ఉద్యోగాల్లో కోత విధిస్తున్నాయి. టెక్​ దిగ్గజం ఐబీఎమ్​ 3,900 ఉద్యోగుల్ని తొలగిస్తున్నట్లు తెలుస్తోంది.

టెక్​ కంపెనీల్లో ఉద్యోగుల తొలగింపుల పరంపర కొనసాగుతోంది. తాజాగా ఈ జాబితాలోకి దిగ్గజ టెక్​ కంపెనీ ఐబీఎఎమ్​ చేరింది. ఈ సంస్థ దాదాపు 3,900 ఉద్యోగాలకు కోత విధిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ తొలగింపులు ఐబీఎమ్​లో ఉన్న 2,80,000 ఉద్యోగుల్లో 1.4 శాతమని సమాచారం.
గత డిసెంబర్​తో ముగిసిన నాలుగో త్రైమాసికంలో ఈ కంపెనీ 1 బిలియన్​ యూఎస్​ డాలర్ల మేరకు నష్టాలు చవిచూసింది. ఐబీఎమ్​, ఐటీ సేవల కంపెనీ కిండ్రిల్​ హోల్డింగ్స్​పై భారం పడుతుండడమే ఈ తొలగింపులు చేపట్టడానికి కారణంగా ఐబీఎమ్​ ప్రతినిధి ఒకరు చెప్పినట్లు ఓ అంతర్జాతీయ వార్తా సంస్థ పేర్కొంది.

ఆర్థిక అనిశ్చితి, మాంద్యం తప్పదేమోనన్న భయాలతో టెక్​ కంపెనీలు ఖర్చులకు వెనకాడుతున్నాయి. అందులో భాగంగానే ఉద్యోగాలకు కోత విధిస్తున్నాయి. గత కొన్ని నెలలుగా ఈ తొలగింపుల ప్రక్రియ కొనసాగుతోంది. మరో టెక్​ దిగ్గజం మైక్రోసాఫ్ట్​ కూడా ఉద్యోగుల్ని తొలగిస్తున్నట్లు ప్రకటించింది. సాఫ్ట్​వేర్​, క్లౌడ్​ సేవల డిమాండ్​ తగ్గపోవడం వల్ల, మంగళవారం ఈ కంపెనీ వృద్ధిరేటు ఆరేళ్ల కనిష్ఠానికి పడిపోయింది. ఇంతక ముందు ట్విట్టర్​, అమెజాన్​, మెటా లాంటి దిగ్గజ టెక్​ కంపెనీలు ఉద్యోగాల్లో కోతలు విధించాయి.

Last Updated :Jan 26, 2023, 2:46 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.