ETV Bharat / business

లాభాల్లో ముగిసిన మార్కెట్లు- నిఫ్టీ@15,246

author img

By

Published : Mar 3, 2021, 9:25 AM IST

Updated : Mar 3, 2021, 3:53 PM IST

STOCKS LIVE UPDATES
లాభాల్లో ముగిసిన మార్కెట్లు- నిఫ్టీ 15,240 ప్లస్

15:42 March 03

స్టాక్ మార్కెట్లు బుధవారం రికార్డు స్థాయి లాభాలతో ముగిశాయి. బీఎస్​ఈ-సెన్సెక్స్ 1,148 పాయింట్లు బలపడి 51,445 వద్ద స్థిరపడింది. ఎన్​ఎస్​ఈ-నిఫ్టీ 326 పాయింట్ల లాభంతో 15,246 వద్దకు చేరింది.

అమెరికా కరోనా ఉద్దీపనపై సానుకూల అంచనాలు, ఆసియాలో ఇతర ప్రధాన మార్కెట్ల జోరు సహా బ్యాంకింగ్, ఐటీ, లోహ షేర్లు రాణించడం వల్ల దేశీయ మార్కెట్లు ఈ స్థాయిలో పుంజుకున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బుధవారం సెషన్​లో వాహన షేర్లు మినహా దాదాపు అన్ని రంగాలు లాభాలను గడించాయి.

ఇంట్రాడే సాగిందిలా..

  • సెన్సెక్స్ 51,539 అత్యధిక స్థాయిని; 50,512 పాయింట్ల అత్యల్ప స్థాయిని నమోదు చేసింది.
  • నిఫ్టీ 15,273 పాయింట్ల గరిష్ఠ స్థాయి, 14,995 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.

15:04 March 03

లాభాల్లో ముగిసిన మార్కెట్లు- నిఫ్టీ 15,240 ప్లస్

రికార్డు స్థాయిలో మార్కెట్లు దూసుకెళ్తున్నాయి. సెన్సెక్స్​ 1116 పాయింట్ల లాభంతో 51,405 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 313 పాయింట్ల వృద్ధి చెంది 15, 232 వద్ద కొనసాగుతోంది. 

13:31 March 03

లాభాల్లో ముగిసిన మార్కెట్లు- నిఫ్టీ 15,240 ప్లస్

స్టాక్​ మార్కెట్లు భారీ లాభాల్లో దూసుకెళ్తున్నాయి. సెన్సెక్స్​ 724 పాయింట్ల లాభంతో 51,023 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ సైతం 281 పాయింట్ల వృద్ధి చెంది 15,137 వద్ద కొనసాగుతోంది. 

12:06 March 03

స్టాక్​ మార్కెట్లు భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్​ 588 పాయింట్ల లాభంతో 50,896 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 186 పాయింట్లు వృద్ధి చెంది 15,105 వద్ద కొనసాగుతోంది. 

  • ఎస్​బీఐన్​, బజాజ్​ఫిన్​ఎస్వీ, బజాజ్​ఫైనాన్స్, హెచ్​డీఎఫ్​సీ, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంకు షేర్లు భారీ లాభాల్లో ఉన్నాయి.
  • ఎం&ఎం, మారుతీ, బజాజ్ ఆటో షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.

09:12 March 03

లాభాల్లో ముగిసిన మార్కెట్లు- నిఫ్టీ@15,246

స్టాక్ మార్కెట్లు బుధవారం భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. బీఎస్​ఈ-సెన్సెక్స్ దాదాపు 440 పాయింట్లు వృద్ధి చెంది 50,737 వద్ద కొనసాగుతోంది. ఎన్​ఎస్​ఈ-నిఫ్టీ 129 పాయింట్లు వృద్ధి చెంది 15,048 వద్ద ట్రేడింగ్​ సాగిస్తోంది.

Last Updated :Mar 3, 2021, 3:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.