ETV Bharat / business

భారీ నష్టాల్లో స్టాక్​ మార్కెట్లు.. సెన్సెక్స్​ 1600 డౌన్​

author img

By

Published : Mar 7, 2022, 9:24 AM IST

Updated : Mar 7, 2022, 2:40 PM IST

stocks
స్టాక్స్​

14:38 March 07

స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్ 1600పాయింట్లకుపైగా కోల్పోయి 52వేల 700 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ 430 పాయింట్ల నష్టంతో 15వేల 810 వద్ద ట్రేడవుతోంది.

11:47 March 07

భారీ నష్టాల్లో స్టాక్​ మార్కెట్లు.. సెన్సెక్స్​ 1200 డౌన్​

ఉక్రెయిన్​పై రష్యా భీకర దాడులు కొనసాగిస్తుండటం, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల పవనాలతో దేశీయ స్టాక్​ మార్కెట్లు కుప్పకూలాయి. ఓ దశలో 1700 పాయింట్లకుపైగా నష్టపోయిన సెన్సెక్స్​ కాస్త తేరుకుని 1200 పాయింట్ల నష్టంతో కొనసాగుతోంది. రష్యాపై ఆంక్షలతో ముడి చమురు ధరల ఆకాశాన్నంటుతుండటమూ మార్కెట్ల పతనానికి కారణమవుతోంది.

బాంబే స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్​ 1238 పాయింట్ల నష్టంతో 53,095 వద్ద ట్రేడవుతోంది.

జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ.. 323 పాయింట్లు దిగజారి.. 15,921 వద్ద కొనసాగుతోంది.

09:51 March 07

కుప్పకూలిన మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్‌ సూచీలు సోమవారం భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉక్రెయిన్‌-రష్యా పరిణామాలు మరింత ఉద్రిక్తంగా మారాయి. ఉక్రెయిన్‌లో రష్యా దాడుల తీవ్రతను పెంచింది. చమురు బ్యారెల్‌ ధర 130 డాలర్లకు చేరింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణ భయాలు అలముకున్నాయి. ఈ పరిణామాల మధ్య నేడు సూచీలు భారీ నష్టాలను చవిచూస్తున్నాయి.

  • 1695 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్​ 52,638 వద్ద ట్రేడ్​ అవుతోంది.
  • మరోవైపు.. 450 పాయింట్ల నష్టంతో 15,794 వద్ద నిఫ్టీ కొనసాగుతోంది.

09:13 March 07

Stock markets live: స్టాక్​ మార్కెట్​ లైవ్​ అప్డేట్స్​

Stock markets: ఉక్రెయిన్​పై రష్యా భీకర దాడులు కొనసాగుతుండటం, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల పవనాలతో దేశీయ సూచీలు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. నిఫ్టీ 15,900 దిగువకు చేరింది.

  • బాంబే స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్​ 1404 పాయింట్ల నష్టంతో 52,903 పాయింట్ల వద్ద కొనసాగుతోంది.
  • జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 378 పాయింట్లు కోల్పోయి 15,866 వద్ద ట్రేడవుతోంది.
Last Updated :Mar 7, 2022, 2:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.