ETV Bharat / business

మార్కెట్ రికార్డులకు బ్రేక్​- 17,600 దిగువకు నిఫ్టీ

author img

By

Published : Sep 17, 2021, 3:43 PM IST

Stock Market updates
స్టాక్ మార్కెట్​ అప్​డేట్స్​

స్టాక్ మార్కెట్ల (Stock Market) రికార్డులకు వారాంతంలో బ్రేక్​ పడింది. సెన్సెక్స్ (Sensex Today) 126 పాయింట్లు తగ్గి.. 59,100 మార్క్​ను కోల్పోయింది. నిఫ్టీ (Nifty Today) 44 పాయింట్లు​ నష్టంతో 17,600 దిగువకు చేరింది. బ్యాంకింగ్, ఫార్మా, ఐటీ షేర్లు ఎక్కువగా నష్టపోయాయి.

స్టాక్ మార్కెట్లు (Stock Market) వారాంతంలో డీలా పడ్డాయి. మదుపరుల అప్రమత్తతతో బీఎస్​ఈ-సెన్సెక్స్ (Sensex today) 126 పాయింట్లు తగ్గి 59,015 వద్ద స్థిరపడింది. ఎన్​ఎస్​ఈ-నిఫ్టీ (Nifty today) 44 పాయింట్ల నష్టంతో 17,585 వద్దకు చేరింది.

ఇటీవలి భారీ లాభాలను మదుపరులు సొమ్ము చేసుకునే పనిలో పడటం నష్టాలకు కారణంగా తెలుస్తోంది. బ్యాంకింగ్, ఫార్మా, ఐటీ షేర్లు ఎక్కువగా అమ్మకాల ఒత్తిడి ఎదుర్కొన్నాయి.

ఇంట్రాడే సాగిందిలా (Intraday)..

సెన్సెక్స్ 59,737 పాయింట్ల అత్యధిక స్థాయి(జీవనకాల గరిష్ఠం), 58,871 పాయింట్ల అత్యల్ప స్థాయిలను నమోదు చేసింది.

నిఫ్టీ 17,792 పాయింట్ల గరిష్ఠ స్థాయి(కొత్త రికార్డు), 17,537 పాయింట్ల కనిష్ఠ స్థాయిల మధ్య కదలాడింది.

లాభనష్టాల్లోనివి ఇవే..

కోటక్ మహీంద్రా బ్యాంక్​, హెచ్​డీఎఫ్​సీ బ్యాంక్​, భారతీ ఎయిర్​టెల్​, మారుతీ సుజుకీ, యాక్సిస్​ బ్యాంక్​ ప్రధానంగా లాభాలను గడించాయి.

టాటా స్టీల్​, ఎస్​బీఐ, టీసీఎస్​, రిలయన్స్ ఇండస్ట్రీస్, సన్​ ఫార్మా​ నష్టాలను మూటగట్టుకున్నాయి.

ఇతర మార్కెట్లు

ఆసియాలో ఇతర ప్రధాన మార్కెట్లలో.. షాంఘై (చైనా), నిక్కీ (జపాన్​), కోస్పీ (దక్షిణ కొరియా), హాంగ్​సెంగ్ (హాంకాంగ్​) సూచీలు లాభాలను గడించాయి. గత సెషన్​లో ఈ సూచీలన్నీ నష్టాలను మూటగట్టుకోవడం గమనార్హం.

ఇదీ చదవండి: Petrol GST news: అప్పుడు లీటర్ పెట్రోల్ రూ.56, డీజిల్ రూ.50!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.