ETV Bharat / business

లాభాల్లో స్టాక్​ మార్కెట్లు.. సెన్సెక్స్​ 300 పాయింట్లు ప్లస్​

author img

By

Published : Jun 26, 2020, 9:39 AM IST

Updated : Jun 26, 2020, 10:26 AM IST

STOCKS
లాభాల్లో స్టాక్​ మార్కెట్లు

10:11 June 26

లాభాల్లో స్టాక్​ మార్కెట్లు..

అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల పవనాలతో పాటు ఇన్ఫోసిస్​, రిలయన్స్​, హెచ్​డీఎఫ్​సీ, ఐసీఐసీఐ బ్యాంకు వంటి హెవీ వేయిట్​ షేర్ల దూకుడుతో దేశీయ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. ఆరంభ ట్రేడింగ్​లో సెన్సెక్స్​ 300 పాయింట్లకు పైగా లాభపడగా, నిఫ్టీ 100 పాయింట్లపైనా వృద్ధి చెందింది.  

బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్​ 355 పాయింట్లు లాభంతో 35,197 వద్ద ట్రేడవుతోంది.  

జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 100 పాయింట్ల వృద్ధితో 10,389 వద్ద కొనసాగుతోంది.  

లాభనష్టాల్లోనివి..

ఇండస్​ఇండ్​ బ్యాంకు లాభాల్లో దూసుకెళుతోంది. దాదాపు 4 శాతం మేర లాభపడింది. ఆ తర్వాత టీసీఎస్​, ఐసీఐసీఐ బ్యాంకు, రిలయన్స్​ ఇండస్ట్రీస్​, ఐటీసీ, హెచ్​డీఎఫ్​సీ బ్యాంకులు లాభాల్లో కొనసాగుతున్నాయి.  

మరోవైపు కొటక్​ మహీంద్రా బ్యాంకు, హెచ్​యూఎల్​, సన్​ఫార్మాలు నష్టాల్లోకి జారుకున్నాయి.  

రూపాయి..

అంతర్జాతీయ మార్కెట్లో రూపాయి మారకపు విలువ డాలరుతో పోలిస్తే 14 పైసలు బలపడి రూ.75.51 వద్ద ఉంది.

09:34 June 26

లాభాల్లో స్టాక్​ మార్కెట్లు.. సెన్సెక్స్​ 300 పాయింట్లు ప్లస్​

అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల పవనాలతో పాటు ఆర్థిక రంగం షేర్ల దన్నుతో దేశీయ స్టాక్​ మార్కెట్లు లాభాల్లో ప్రారంభమయ్యాయి. ఆరంభ ట్రేడింగ్​లోనే బొంబాయి స్టాక్​ ఎక్స్చేంజి సూచీ సెన్సెక్స్​ 347 పాయింట్లు లాభపడింది. ప్రస్తుతం 35,189 వద్ద కొనసాగుతోంది.  

జాతీయ స్టాక్​ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 91 పాయింట్ల వృద్ధితో 10,380 వద్ద ట్రేడవుతోంది. 

Last Updated :Jun 26, 2020, 10:26 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.