ETV Bharat / business

బంగారం ధర ప్రియం.. స్థిరంగా వెండి.. ఏపీ, తెలంగాణలో ఇలా..

author img

By

Published : Feb 6, 2022, 1:34 PM IST

GOLD PRICE TODAY
GOLD PRICE TODAY

Gold Price Today: దేశంలో బంగారం ధర ప్రియమైంది. వెండి ధర మాత్రం స్థిరంగా ఉంది. ఇంధన ధరల్లో ఎలాంటి మార్పు లేదు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో పది గ్రాముల బంగారం ధర ఎంత ఉందంటే..?

Gold Price Today: ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో బంగారం ధర స్వల్పంగా పెరిగింది. పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం.. రూ.30 అధికమైంది. వెండి ధర మాత్రం స్థిరంగా ఉంది. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ధరలు ఇలా ఉన్నాయి.

  • Gold price in Hyderabad: పది గ్రాముల బంగారం ధర రూ.49,640గా ఉంది. కిలో వెండి ధర రూ.62,330 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Vijayawada: 10 గ్రాముల పసిడి ధర రూ.49,640 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.62,330గా ఉంది.
  • Gold price in Vizag: 10 గ్రాముల పుత్తడి ధర రూ.49,640గా ఉంది. కేజీ వెండి ధర రూ.62,330 వద్ద కొనసాగుతోంది.
  • Gold price in Proddatur: పది గ్రాముల పసిడి ధర రూ.49,640గా ఉంది. కేజీ వెండి ధర రూ.62,330గా ఉంది.

స్పాట్​ గోల్డ్​ ధర ఎంతంటే..

అంతర్జాతీయంగానూ బంగారం ధర పెరిగింది. ఔన్సు బంగారం 5 డాలర్లు అధికమైంది. ప్రస్తుతం ఔన్సు స్పాట్ గోల్డ్.. 1,808 డాలర్లు పలుకుతోంది. వెండి ధర స్థిరంగా ఉంది. స్పాట్ వెండి ధర ఔన్సుకు 22.53 డాలర్లుగా ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో ఇంధన ధరలు

జాతీయ స్థాయిలో ఇంధన ధరల్లో ఎలాంటి మార్పులు లేవు. దీంతో ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో పెట్రోల్​, డీజిల్​ ధరలు స్థిరంగా ఉన్నాయి.

  • Petrol Price Hyderabad: హైదరాబాద్​లో లీటర్ పెట్రోల్ ధర రూ.108.18గా ఉంది. లీటరు డీజిల్ ధర రూ.94.61 వద్ద ఉంది.
  • Petrol Price Vizag: వైజాగ్​లో లీటరు పెట్రోల్ ధర రూ.109.03వద్ద కొనసాగుతోంది. డీజిల్ ధర రూ.95.17వద్ద ఉంది.
  • Petrol Price Guntur: గుంటూరులో లీటరు పెట్రోల్ ధర రూ.110.33, డీజిల్ ధర రూ.96.43గా ఉన్నాయి.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.