ETV Bharat / business

ఉద్యోగులకు డీఏ పెంపుపై కేంద్రం కీలక ఆదేశాలు

author img

By

Published : Jul 20, 2021, 7:22 PM IST

Union finance minister
కేంద్ర ఆర్థిక శాఖ

కేంద్ర కేబినెట్ ఇటీవల తీసుకున్న నిర్ణయం మేరకు.. ఉద్యోగులకు డీఏ పెంపుపై ఆర్థిక శాఖ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. జులై 1 నుంచే పెంపును అమలు చేయాలని సంబంధిత శాఖలను ఆదేశించింది.

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డియర్​నెస్ అలవెన్స్ (డీఏ), పెన్షనర్లకు డియర్​నెస్​ రిలీఫ్​ (డీఆర్​) పెంపును జులై 1 నుంచి అమలు చేయాలని కేంద్ర ఆర్థిక శాఖ ఆదేశాలు జారీ చేసింది.

ఉద్యోగులకు డీఏ, పెన్షనర్లకు డీఆర్​ 17 శాతం నుంచి 28 శాతానికి (11 శాతం పెంపు) పెంచుతూ కేంద్ర కేబినెట్ ఇటీవల నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో 48.34 లక్షల ఉద్యోగులకు, 65.26 లక్షల పెన్షనర్లకు లబ్ధి చేకూరనుంది. పెంచిన డీఏ, డీఆర్​ వల్ల కేంద్రంపై రూ.34,401 కోట్ల అదనపు భారం పడనుంది.

ఇదీ చూడండి: 'కరోనాపై కేంద్రానివి తప్పుడు లెక్కలు!'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.