ETV Bharat / business

ప్రభుత్వ బీమా సంస్థలకు రూ.2,500 కోట్ల మూలధనం

author img

By

Published : Feb 12, 2020, 4:11 PM IST

Updated : Mar 1, 2020, 2:33 AM IST

cab, insurance
కేబినెట్​ బేటీ

ప్రభుత్వ రంగ బీమా సంస్థలకు మూలధనం అందించే ప్రతిపాదనకు కేంద్ర మంత్రివర్గం​ పచ్చజెండా ఊపింది. 'వివాద్ సే విశ్వాస్' సహా మరికొన్ని బిల్లుల్లో మార్పులకు ఆమోదముద్ర వేసింది.

దేశంలోని 3 ప్రభుత్వ రంగ బీమా సంస్థలకు మూలధనం అందించే ప్రతిపాదనకు కేంద్రమంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఫలితంగా నేషనల్​ జనరల్ ఇన్స్యూరెన్స్​ కంపెనీ, ఓరియంటల్​ ఇన్స్యూరెన్స్​ కంపెనీ, యునైటెడ్​ ఇండియా ఇన్స్యూరెన్స్​కు రూ.2,500 కోట్లు సమకూరనుంది. దిల్లీలో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో సమావేశమైన కేబినెట్... మరికొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది.

మంత్రివర్గం నిర్ణయాలు...

  • ఈ పార్లమెంటు సమావేశాల్లో క్రిమిసంహారక మందుల నియంత్రణ బిల్లు-2020 ప్రవేశపెట్టేందుకు అంగీకారం
  • వివాద్​ సే విశ్వాస్​ బిల్లులో పలు మార్పులకు ఆమోదం
  • మత్స్య పరిశ్రమ సుస్థిరాభివృద్ధికి సంబంధించి భారత్​-ఐస్​లాండ్​ మధ్య అవగాహన ఒప్పందానికి ఆమోదం
  • రెట్టింపు పన్నుల తొలగింపు, ఆర్థిక లోటుకు సంబంధించి భారత్​-శ్రీలంక మధ్య నిబంధనల సవరణకు ఆమోదం
Last Updated :Mar 1, 2020, 2:33 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.