ETV Bharat / business

ట్విట్టర్​లో కొత్తగా 'టిప్​ జార్​' ఫీచర్​

author img

By

Published : May 7, 2021, 9:46 PM IST

Tip jar Feature
టిప్​ జార్​ ఫీచర్​

తమకు నచ్చిన అభిమాన ఖాతాదారులకు నగదు పంపించేందుకు 'టిప్​ జార్​' ఫీచర్​ను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తోంది ట్విట్టర్​. ఐఓఎస్​, ఆండ్రాయిడ్​ యూజర్స్​ కూడా చెల్లింపులు చేసేలా ఈ ఫీచర్​ను రూపొందిస్తుంది. దీనిని భారత్​ సహా ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకొచ్చేందుకు పరిశీలిస్తుంది.

మైక్రోబ్లాగింగ్ సంస్థ ట్విట్టర్​.. కొత్త ఫీచర్​ను తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. ఆంగ్లంలో ట్విట్టర్​ వినియోగిస్తున్న లాభాపేక్షలేని, పాత్రికేయులతో పాటు ఎక్కువమంది ఫాలోవర్స్​ ఉన్న మరికొందరి కోసం 'టిప్ ​జార్'​ ఫీచర్​ను అందుబాటులోకి తీసుకురానుంది. ఐఓఎస్​, ఆండ్రాయిడ్​ యూజర్లు సులభంగా నగదు పంపించేలా ఈ​ ఫీచర్​ను రూపొందిస్తోంది. దీని ద్వారా తన అభిమాన ఖాతాదారులకు డబ్బులు పంపొచ్చు. దీనిని భారత్​ సహా ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషల్లో తీసుకొచ్చేందుకు ట్విట్టర్​ కసరత్తు చేస్తోంది.

ఈ టిప్​ జార్​ ఇప్పటికే బ్యాండ్​క్యాంప్​, క్యాష్​ యాప్​, పేపాల్​, వెన్మో, పట్రెయాన్​ వంటి నగదు బదిలీల్లో పని చేస్తోంది.

"ఇక నుంచి ఎన్నో గొంతుకలకు మీరు మద్దతుగా నిలవొచ్చు. టిప్​ జార్​తో వారికి నగదు పంపొచ్చు. ట్విట్టర్​ ప్రొఫైల్​లోని టిప్​జార్​ ఐకాన్​ నొక్కి.. ఐఓఎస్​, ఆండ్రాయిడ్​లలో పరీక్షించిన తర్వాత నగదు బదిలీ చేయవచ్చు."

- ట్విట్టర్

ఆంగ్లంలో ట్విట్టర్​ యూజర్లందరూ పరిమిత సంఖ్యలో ఖాతాలకు క్యాష్​ గిఫ్ట్స్​, లేదా టిప్స్​ పంపవచ్చు. టిప్​జార్​ను ప్రారంభించగానే.. మీ ప్రొఫైల్​ పేజీలోని ఫాలో బటన్​ పక్కన ఈ ఐకాన్​​ యాడ్​​ అవుతుంది.

ఈ ఫీచర్​ను ఆన్​, ఆఫ్​ చేసుకునే సౌకర్యం కూడా ఉంది. అలాగే ట్విట్టర్ ఆడియో చాట్​ యాప్​ ద్వారా ఆండ్రాయిడ్​ యూజర్లు నగదు బదిలీ చేసుకోవచ్చు.

ఇదీ చూడండి: 'ప్రైవసీ పాలసీ'పై వెనక్కి తగ్గిన వాట్సాప్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.