ETV Bharat / business

తగ్గిన బంగారం ధరలు- ఏపీ, తెలంగాణలో ఇలా..

author img

By

Published : Aug 11, 2021, 8:45 AM IST

Updated : Aug 11, 2021, 10:05 AM IST

silver and gold price
బంగారం, వెండి ధరలు

బంగారం ధరలు(Gold price today) బుధవారం స్పల్పంగా తగ్గాయి. వెండి ధర రూ.65వేల దిగువకు చేరింది. ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు(Silver price today) ఇలా ఉన్నాయి.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో బంగారం, వెండి ధరలు కాస్త తగ్గాయి. పదిగ్రాముల బంగారం ధర సుమారు రూ.78 మేర తగ్గింది. కిలో వెండి రూ.56 మేర దిగొచ్చింది

  • హైదరాబాద్​, వైజాగ్​, విజయవాడలో 10 గ్రాముల బంగారం (Gold price) ధర (24 క్యారెట్)​ రూ.47,670 వద్ద ఉంది.
  • ఆయా నగరాల్లో కిలో వెండి(Silver price) ధర రూ.64,900 వద్దకు చేరింది.
  • స్పాట్​ గోల్డ్ ధర ఔన్సు 1733.35 డాలర్ల వద్ద ఉంది.
  • వెండి ధర ఔన్సు 23.36 డాలర్ల వద్ద కొనసాగుతోంది.

ఏపీ, తెలంగాణలో పెట్రోల్, డీజిల్ ధరలు..

  1. హైదరాబాద్​లో లీటర్​ పెట్రోల్ రూ.105.58 వద్ద, డీజిల్​ లీటర్​ రూ.98.01 వద్ద ఉన్నాయి.
  2. గుంటూరులో లీటర్​ డీజిల్ రూ.99.65 వద్ద ఉండగా.. పెట్రోల్​ లీటర్​ రూ.108.06గా ఉంది.
  3. వైజాగ్​లో పెట్రోల్, డీజిల్ ధరలు లీటర్​కు వరుసగా.. రూ.106.86, రూ. 98.49గా వద్ద ఉన్నాయి.

ఇదీ చూడండి: గోల్డ్​పై ఇన్వెస్ట్ చేస్తున్నారా? ఈ విషయాలు తెలుసుకోండి..

Last Updated :Aug 11, 2021, 10:05 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.