ETV Bharat / business

మీడియా, వినోద రంగానికి 2021-22లో కొత్త కళ!

author img

By

Published : Sep 30, 2020, 5:14 PM IST

India's media, entertainment segment
మీడియా, వినోద రంగం

కరోనా సంక్షోభంతో తీవ్రంగా దెబ్బతిన్న మీడియా, వినోద రంగం క్రమంగా పుంజుకుంటుందని తెలిపింది కేపీఎంజీ ఇండియా నివేదిక. 2021-22 ఆర్థిక ఏడాదిలో ఈ రంగం ఆదాయం 33 శాతం వృద్ధితో రూ.1.86 లక్షల కోట్లకు చేరుకుంటుందని అంచనా వేసింది.

కరోనా మహమ్మారి కారణంగా దేశీయ మీడియా, వినోద రంగాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. వాటి ఆదాయాలు గణనీయంగా పడిపోయాయి. అయితే.. వినియోగాదారులు డిజిటల్​ వైపు వేగంగా అడుగులు వేస్తున్న క్రమంలో 2021-22 ఆర్థిక ఏడాదిలో ఈ రంగం పుంజుకుంటుందని, ఆదాయం రూ.1,86,600 కోట్లకు చేరుకుంటుందని తాజాగా ఓ సంస్థ అంచనా వేసింది.

ప్రస్తుత సంక్షోభ సమయంలో ఎంఅండ్​ఈ సెక్టార్​ పనితీరును అంచనా వేసి 'ఎ ఇయర్​ ఆఫ్​ స్క్రిప్ట్​: టైమ్​ ఫర్​ రెసిలియన్స్​' అనే నివేదికను రూపొందించింది కేపీఎంజీ ఇండియా. వచ్చే ఆర్థిక ఏడాదిలో 33 శాతం వృద్ధి నమోదు చేస్తుందని కేపీఎంజీ భారత్​ అధినేత గిరీశ్​ మేనన్​ తెలిపారు.

" భారత ఆర్థిక వ్యవస్థ నిరంతర వృద్ధికి, వినియోగదారులు డిజిటల్​ వైపు మళ్లేందుకు ఈ రెండు రంగాలు ప్రోత్సహిస్తాయి. మా సవరించిన అంచనాల ప్రకారం.. 2028 నాటికే భారత్​లో ఒక బిలియన్​ డిజిటల్​ వినియోగదారులు ఉంటారు. అది గతంలో 2030 వరకు అని అంచనా వేశారు."

- గిరీశ్​ మేనన్, కేపీఎంజీ ఇండియా అధినేత.

కేపీఎంజీ నివేదిక ప్రకారం మీడియా, వినోద రంగం 2019-20లో రూ.1,75,100 కోట్ల ఆదాయాన్ని సమకూర్చుకుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అది రూ.1,40,200 కోట్లకు తగ్గుతుందని అంచనా. అయితే.. క్రమంగా పుంజుకుని వచ్చే 2021-22 ఆర్థిక ఏడాదిలో రూ.1,86,600 కోట్లకు చేరుతుందని తెలిపింది కేపీఎంజీ.

ఇదీ చూడండి: కొవిడ్​ ప్రభావంతో కుదేలైన ప్రైవేట్​ ట్రావెల్స్​ రంగం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.