ETV Bharat / business

Gold Rate Today: తగ్గిన పసిడి ధర.. ఏపీ, తెలంగాణలో ఎంతంటే?

author img

By

Published : Nov 19, 2021, 9:40 AM IST

Updated : Nov 19, 2021, 10:00 AM IST

gold rates
పసిడి ధర

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో బంగారం (Gold Rate Today) ధర స్వల్పంగా తగ్గింది. వెండి ధర (Silver price today) మాత్రం రూ.400కు పైగా దిగొచ్చింది. రెండు రాష్ట్రాల్లో ప్రస్తుత బంగారం, వెండి ధరలతో పాటు.. పెట్రోల్​, డీజిల్ రేట్ల (Fuel prices today) వివరాలు ఇలా ఉన్నాయి.

బంగారం ధర (Gold Rate Today) శుక్రవారం స్వల్పంగా తగ్గింది. వెండి ధర (Silver price today) భారీగా క్షీణించింది. ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలోని ప్రధాన నగరాల్లో మేలిమి పుత్తడి, వెండి ధరలు ఇలా ఉన్నాయి.

  • హైదరాబాద్​లో పది గ్రాముల బంగారం (Gold Price in Hyderabad) ధర దాదాపు రూ.110 తగ్గి.. రూ.50,770 వద్ద కొనసాగుతోంది. కిలో వెండి ధర రూ.460 క్షీణించి రూ.67,940 వద్ద ఉంది.
  • విజయవాడలో 10 గ్రాముల పసిడి (Gold Price in Vijayawada) ధర రూ.50,660గా ఉంది. కిలో వెండి ధర రూ.67,940 వద్ద కొనసాగుతోంది.
  • వైజాగ్​లో 10 గ్రాముల పసిడి ధర (Gold Price in Vizag) రూ.50,660గా ఉంది. కేజీ వెండి ధర రూ.67940 వద్ద కొనసాగుతోంది.

స్పాట్​ గోల్డ్​ ధర ఎంతంటే..

  • ఔన్సు స్పాట్ గోల్డ్ ధర 1,862 డాలర్ల వద్ద కొనసాగుతోంది.
  • ఔన్సు స్పాట్ వెండి ధర 24.94 డాలర్ల వద్ద ఉంది.

పెట్రోల్ ధరలు..

ఆంధ్రప్రదేశ్​, తెలంగాణల్లో పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి.

  • హైదరాబాద్​లో (Petrol Prices Hyderabad) లీటర్ పెట్రోల్ ధర రూ.108.18గా ఉంది. లీటరు డీజిల్ ధర రూ.94.61కి వద్ద ఉంది.
  • వైజాగ్​లో (Petrol Price in Vizag) లీటరు పెట్రోల్ ధర రూ.109.03వద్ద కొనసాగుతోంది. డీజిల్ ధర రూ.95.17వద్ద ఉంది.
  • గుంటూరు నగరంలో (Petrol Price in Guntur) లీటరు పెట్రోల్ ధర రూ.110.33, డీజిల్ ధర రూ.96.43గా ఉన్నాయి.

ఇవీ చదవండి:

Last Updated :Nov 19, 2021, 10:00 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.