ETV Bharat / business

పద్దు 2020: బ్యాంకింగ్ రంగం కోలుకునేదెలా?

author img

By

Published : Jan 23, 2020, 6:31 PM IST

Updated : Feb 18, 2020, 3:35 AM IST

can banks privatization solve the problem?
బ్యాంకుల ప్రైవేటీకరణతో సమస్య పరిష్కారమౌతుందా?

నిరర్ధక ఆస్తులు పేరుకుపోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న బ్యాంకింగ్ రంగానికి ఊతమిచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇందుకు పరిష్కారంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనం, ప్రైవేటీకరణ మార్గాలను పరిశీలిస్తోంది. అయితే దీని వల్ల సమస్య మరింత జఠిలమయ్యే అవకాశముందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

మందగమనంలో ఉన్న ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు మోదీ ప్రభుత్వం పలు కసరత్తులు చేస్తోంది. ఇందులో భాగంగా బ్యాంకింగ్ రంగంలో పలు కీలక సంస్కరణలు చేపట్టాలని నిర్ణయించింది. 2020 కేంద్ర బడ్జెట్​ను మరికొద్ది రోజుల్లో పార్లమెంట్​లో ప్రవేశపెట్టనుంది. మరి ఇందులో ఈ కీలక సంస్కరణలకు చోటిస్తుందా?

బ్యాంకుల ప్రైవేటీకరణతో సమస్య పరిష్కారమౌతుందా?

బ్యాంకుల విలీనం?

బ్యాంకింగ్ రంగ సంక్షోభాన్ని పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల పలు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా బ్యాంకుల విలీనాన్ని ప్రతిపాదించింది. 10 ప్రభుత్వరంగ బ్యాంకులను పరస్పరం విలీనం చేసి 4 పెద్ద బ్యాంకులుగా మార్చింది. ఈ చర్యలు బ్యాంకింగ్​ రంగం కోలుకోవడానికి దోహదపడతాయని, ఆర్థికవ్యవస్థకు మంచి చేస్తాయని ప్రకటించింది.

నిరర్ధక ఆస్తులు

నిరర్ధక ఆస్తులు బ్యాంకులకు గుదిబండగా మారుతున్నాయి. అయితే ప్రస్తుతం ఇవి తగ్గుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. గణాంకాలు కూడా ఈ విషయాన్నే ధ్రువీకరిస్తున్నాయి. కనుక త్వరలోనే బ్యాంకులు కోలుకుంటాయని ప్రభుత్వం నమ్మకంగా చెబుతోంది.

ఇది నిజమేనా?

ప్రభుత్వ ప్రకటనలకు వాస్తవ పరిస్థితులకు మధ్య చాలా అంతరం ఉందని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కార్పొరేటు కంపెనీలు మళ్లీ మొండి బాకీల బారిన పడే అవకాశముందని అభిప్రాయపడుతున్నారు. దీనికి ప్రధాన కారణం బీఎస్​ఈలో లిస్ట్ అయిన కంపెనీల అప్పులు ఆయా కంపెనీల నికర విలువ కంటే చాలా ఎక్కువగా ఉన్న విషయాన్ని వారు ఎత్తిచూపుతున్నారు.

మొండి బకాయిలుగా ముద్రా రుణాలు

చిన్న తరహా పరిశ్రమలకు రుణాలందించడం కోసం ఉద్దేశించిన బృహత్తర పథకం ముద్రా రుణాలు. అయితే ప్రభుత్వాలు రుణమాఫీ చేస్తాయనే ఆశలతో లబ్ధిదారులు చాలా మంది తమ రుణాలు, వడ్డీలు చెల్లించడం లేదు. ఫలితంగా ఇవి మొండి బకాయిలుగా మారిపోతున్నాయి.

ఆర్​బీఐ మాజీ గవర్నర్ రఘురాం రాజన్​ ఈ విషయంపై అప్పట్లోనే ఆందోళన వ్యక్తం చేశారు. ఫలితంగా వాణిజ్య బ్యాంకులు ఈ ముద్రా రుణాల పంపిణీలో జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్​బీఐ సూచించింది.

ఎన్​బీఎఫ్​సీ

కొన్ని నెలల కిందట కేంద్ర ప్రభుత్వ ఒత్తిడి మేరకు రిజర్వ్​బ్యాంకు... నిరర్ధక ఆస్తులతో బాధపడుతున్న బ్యాంకులను ఆదుకునేందుకు మూలధనాన్ని అందించింది. కానీ నేడు ప్రభుత్వ ఆదాయం తగ్గిపోతున్న దృష్ట్యా.. బ్యాంకులకు మూలధన మద్దతు అందించలేకపోవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఐఎల్​ఎఫ్ఎస్​ సంక్షోభం తరువాత బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నాయి. ఈ సమస్య పరిష్కారానికి సంబంధించి బడ్జెట్​లో కీలక ప్రతిపాదనలు చేసే అవకాశముందని నిపుణులు భావిస్తున్నారు.

పరిష్కారం సాధ్యమేనా?

బ్యాంకింగ్ రంగ సంక్షోభానికి ప్రైవేటీకరణే సరైన సమాధానంగా ప్రభుత్వం భావిస్తోందని అయితే దీని వల్ల సమస్య మరింత జఠిలం అయ్యే అవకాశముందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఒకప్పుడు ప్రైవేటు బ్యాంకులపై ప్రజల్లో పూర్తిగా విశ్వాసం సన్నగిల్లిన నేపథ్యంలోనే.. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ బ్యాంకులను జాతీయం చేశారని నిపుణులు గుర్తుచేస్తున్నారు.

ప్రభుత్వ నిర్ణయం ఏమిటి?

బ్యాంకింగ్ రంగ సంక్షోభాన్ని అరికట్టేందుకు.. ఫైనాన్సియల్ రిజల్యూషన్​ అండ్ డిపాజిట్ ఇన్సూరెన్స్ (ఎఫ్​ఆర్​డీఐ) బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఖాతాదారులు బ్యాంకులో చేసిన జమకు కల్పించే బీమాను పెంచనున్నట్లు సమాచారం. దీని ద్వారా సహకార బ్యాంకులను కూడా నియంత్రించనున్నట్లు విశ్లేషకులు పేర్కొంటున్నారు.

ఇదీ చూడండి: స్వల్పంగా పెరిగిన బంగారం ధర- నేటి లెక్కలివే...

Intro:Body:

A customer in need of cash can simply open the PhonePe app, go to the 'Stores' tab and click on the 'PhonePe ATM' icon to locate nearby shops offering this facility.



Bengaluru: Digital payments platform PhonePe on Thursday launched a unique feature called 'PhonePe ATM' on its platform that will help users in need of cash can get instant money from merchants offering this facility.




Conclusion:
Last Updated :Feb 18, 2020, 3:35 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.