ETV Bharat / business

త్వరలోనే ఆ రెండు బ్యాంకుల ప్రైవేటీకరణ?

author img

By

Published : Jun 27, 2021, 5:19 PM IST

Rapid steps towards privatization of banks
ప్రైవేటీకరణకు వేగంగా చర్యలు

రెండు ప్రభుత్వ రంగ బ్యాంకుల ప్రైవేటీకరణకు వడివడిగా అడుగులు పడుతున్నట్లు తెలుస్తోంది. కేంద్ర కార్యదర్శుల నేతృత్వంలో ఉన్నత స్థాయి ప్యానెల్ ఇటీవల సమావేశమై.. ప్రైవేటీకరణకు ఎదురయ్యే సమస్యలను గుర్తించినట్లు సమాచారం. ఆ సమస్యల పరిష్కారానికి సంబంధించిన ప్రణాళికను సంబంధిత మంత్రివర్గాలకు పంపనున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్​సిస్ బ్యాంక్ (ఐఓబీ) ప్రైవేటీకరణపై కసరత్తు ముమ్మరమైనట్లు తెలుస్తోంది. రెండు ప్రభుత్వ బ్యాంకుల ప్రైవేటీకరణకు సంబంధించి ఇటీవల.. క్యాబినెట్ కార్యదర్శులు, ఉన్నత స్థాయి ప్యానెల్​ భేటీ అయినట్లు సమాచారం. ఇందులో వివిధ నియంత్రణ, పరిపాలనా సమస్యలను గుర్తించినట్లు తెలిసింది. దీనితో పెట్టుబడుల ఉపసంహరణ లేదా ఆల్టర్నేటివ్​ మెకానిజమ్​ (ఏఎం) కోసం సంబంధిత ప్రతిపాదనను మంత్రివర్గం ముందుకు పంపించనున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.

ఈ భేటీలో.. ఆర్థిక వ్యవహారాలు, ఆదాయ, వ్యయాలు, కార్పొరేట్, న్యాయ విభాగాల కార్యదర్శులు సహా డిపార్ట్​మెంట్ ఆఫ్​ పబ్లిక్​ ఎంటర్​ప్రైజెస్​, డిపార్ట్​మెంట్​ ఆఫ్ ఇన్వెస్ట్​మెంట్​ అండ్ పబ్లిక్ అసెట్ మేనేజ్​మెంట్​ (దీపమ్​) కార్యదర్శి, ఇతర ప్రతినిధులు పాల్గొన్నట్లు తెలిసింది.

2021-22 బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. రెండు ప్రభుత్వ రంగ బ్యాంకులను, ఓ బీమా సంస్థను ప్రైవేటీకరించనున్నట్లు ప్రకటించారు. ఈ ప్రణాళికలో భాగంగా ప్రైవేటీకరణకు అనుగుణంగా ఉన్న బ్యాంకుల ఎంపిక బాధ్యతను నీతి ఆయోగ్​కు అప్పగించింది కేంద్రం. ఈ ప్రైవేటీకరణ ద్వారా రూ.1.75 లక్షల కోట్ల ఆదాయం గడించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

ఇందుకు సంబంధించి నీతి ఆయోగ్​ నివేదికను ఇటీవల కేంద్రానికి సమర్పించింది. ఇందులో సెంట్రల్‌ బ్యాంక్‌, ఇండియన్‌ ఓవర్‌సీస్‌ బ్యాంక్ (ఐఓబీ)లను ప్రైవేటీకరణకు సిఫారసు చేసినట్లు తెలిసింది.

గత ఏడాది మెగా విలీనం..

కేంద్రం గత ఏడాది బ్యాంకుల మెగా విలీన ప్రక్రియను చేపట్టింది. ఇందులో భాగంగా 10 ప్రభుత్వ బ్యాంకులను 4 బ్యాంకులుగా విలీనం చేసింది. దీనితో మొత్తం ప్రభుత్వ బ్యాంకుల సంఖ్య 2017 మార్చిలో 27గా ఉంటే.. ఇప్పుడవి 12కు తగ్గాయి. మెగా విలీనానికి ముందు ఎస్​బీఐ బ్యాంకులో పలు ఇతర బ్యాంకులు విలీనమవడం గమనార్హం.

ఇదీ చదవండి:అదనపు డీఏ చెల్లింపులపై ప్రభుత్వం క్లారిటీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.