ETV Bharat / bharat

Viral Video Woman Innovation : టూత్​పేస్ట్​ డబ్బాతో.. వాటర్ ట్యాప్​ నోరు మూసేసిందిగా..!  హర్ష గోయెంకా ఫన్నీ కామెంట్​

author img

By ETV Bharat Telugu Team

Published : Sep 8, 2023, 4:10 PM IST

Updated : Sep 8, 2023, 4:25 PM IST

Video Viral Woman Innovation Toothpaste Used as Tap Contro
Viral Video Woman Innovation

Viral Video Woman Innovation: ఈ భూమ్మీద పనికిరాని వస్తువంటూ ఉండదు. కాకపోతే.. దాని అవసరం రావాలి.. వాడే విధానం తెలిసి ఉండాలి. ఇందుకు సరైన నిదర్శనమే ఈ వీడియో. కొన్నిరోజుల క్రితం సోషల్​మీడియాలో వైరల్​​ అయిన ఆ వీడియో.. ఇప్పుడు ప్రముఖ పారిశ్రామిక వేత్త హర్ష గోయెంకా తన Xలో(ట్విట్టర్​)లో పోస్ట్​ చేయడంతో మరోసారి వైరల్​ అవుతోంది. ఇంతకీ ఆ వీడియో ఏంటి..??

Video Viral Woman Innovation Toothpaste Used as Tap Control : సోషల్ మీడియా వినియోగం పెరిగిపోయాక.. వింతలూ విశేషాలు నిమిషాల్లో వైరల్ అవుతున్నాయి. ఓ వైపు కొందరు వాంటెడ్​గా తమ టాలెంట్ చూపిస్తుండగా.. మరికొందరు తమకు తెలియకుండానే వైరల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నారు. ఇలా.. ఓవర్ నైట్​లో ఫేమస్ అయిన వారు.. సెలబ్రిటీలుగా మారిపోయిన వారు ఎందరో ఉన్నారు. అయితే.. ఓ మహిళ తన ఇంటి పనిలో భాగంగా చేసిన వినూత్న ఆలోచన.. నెటిజన్లకు విపరీతంగా ఆకర్షించింది. సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

Woman Solve Her Problem With Toothpaste: కొత్తగా ఆలోచించాలే కానీ.. దేనికీ పనికిరావని పక్కన పడేసిన వస్తువులు కూడా.. ఆశ్చర్యపరుస్తూ అంతకంటే ఎక్కువగా పనికొస్తుంటాయి. కొందరు పాడయిన వస్తువులతోనే ఎవరూ ఊహించని విధంగా అద్భుతాలు సృష్టిస్తుంటారు. ఇక్కడ ఈ మహిళ చేసిన పని కూడా అలాంటిదే. ఆమె ఏకంగా అయిపోయిన పేస్ట్​ ట్యూబ్​ను ఉపయోగించి.. తన సమస్యను పరిష్కరించుకుంది. ఈ వీడియో గతంలోనే వైరల్ అయ్యింది. అది చూసిన వారంతా.. ‘‘టూత్ పేస్ట్ డబ్బాను ఇలా కూడా వాడొచ్చా’’..! అంటూ కామెంట్లు చేశారు. మీ క్రియేటివిటీ సూపర్ అంటూ మెచ్చుకున్నారు. అయితే.. ఆ వీడియోను.. భారత దిగ్గజ పారిశ్రామికవేత్త, RPG ఎంటర్​ప్రైజెస్​ ఛైర్మన్​ హర్ష గోయెంకా.. తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్​ చేశారు. దీంతో.. ఆ వీడియో మరోసారి వైరల్​ అవుతోంది.

Butter Festival : వినూత్నంగా 'వెన్న హోళీ'.. 11వేల అడుగుల ఎత్తులో ఘనంగా వేడుకలు

పేస్ట్ అయిపోగానే సాధారణంగా ఎవరైనా డబ్బాను డస్ట్ బిన్​లో పడేస్తారు. అలాంటి డబ్బా దేనికి పనికొస్తుందని అంతా అనుకుంటారు. కానీ ఈ మహిళ మాత్రం అలా కాదు. ఖాళీ పేస్ట్ ట్యూబ్ కూడా ఎంతో పనికొస్తుందని నిరూపించింది. పెద్ద సమస్యకు సొల్యూషన్​గా ఉపయోగించడం మరింత ఆశ్చర్యకరం. ఆమె ఇంట్లోని వాటర్ ట్యాప్​ ముందు భాగం విరిగిపోయింది. దీంతో.. ఆ నీటిని ఆపడం ఇబ్బందిగా మారింది. ఈ సమస్యను ఎలా పరిష్కరించాలా అని ఆలోచిస్తున్న ఈ క్రమంలోనే.. ఆమెకు అద్భుతమైన ఐడియా తట్టింది.

రోజు వాడే టూత్ పేస్ట్ ప్యాకెట్​ను తన సమస్యకు సొల్యూషన్​గా వాడింది. టూత్ పేస్ట్ అయిపోయాక దానిని పడేయకుండా క్లీన్ చేసింది. టూత్ పేస్ట్ ప్యాకెట్ వెనుక భాగాన్ని కత్తిరించి.. దానిని నల్లా పైపునకు తొడిగింది. ముందు భాగంలో టూత్ పేస్ట్ క్యాప్ పెట్టేసింది. ఇంకేముంది..? ప్రాబ్లం సాల్వ్. తనకు అవసరమైనప్పుడల్లా.. నల్లా తిప్పినట్టుగా.. ఆ టూత్ పేస్ట్ మూతను తెరిచి నీటిని పట్టుకుంటోంది. ఆ తర్వాత మళ్లీ మూత పెట్టి నీటిని ఆపేస్తోంది. ఈ విధంగా టాప్ సహాయం లేకుండా తానే ఒక టాప్ ను తయారుచేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో నెటిజన్లను ఆకర్షించింది.

Harsh Goenka Post: ఇదే వీడియోను పారిశ్రామికవేత్త హర్ష​ గోయెంకా తన X(ట్విట్టర్​)లో ట్వీట్​ చేశారు. దీనికి ఓ ఫన్నీ కామెంట్​ కూడా జత చేశారు. "ట్యాప్స్ ఇన్ ఇండియా లైక్....#జుగాడ్​" అని క్యాప్షన్ జోడించారు. దీంతో.. ఈ వీడియో మరోసారి వైరల్ అవుతోంది.

Last Updated :Sep 8, 2023, 4:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.