ETV Bharat / bharat

9 రోజుల్లోనే విచారణ పూర్తి.. అత్యాచార నిందితుడికి జీవిత ఖైదు!

author img

By

Published : Jun 30, 2022, 12:51 PM IST

Kairana up court verdict
ఖైరానా ప్రత్యేక న్యాయస్థానం సంచలన తీర్పు

ఉత్తర్​ప్రదేశ్​లోని ఖైరానా ప్రత్యేక న్యాయస్థానం సంచలన తీర్పును ఇచ్చింది. తొమ్మిది రోజుల్లోనే విచారణ జరిపి.. అత్యాచార నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. మరోవైపు అయిదేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితుడికి మరణ శిక్ష విధించింది త్రిపురలోని ఖోవై జిల్లా కోర్టు.

ఏడేళ్ల బాలుడిపై లైంగిక వేధింపులకు పాల్పడిన వ్యక్తికి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది ఉత్తర్​ప్రదేశ్​.. షామ్లీ జిల్లాలోని ఖైరానా ప్రత్యేక కోర్టు. ఈ ఘటనపై విచారణ ప్రారంభించిన తొమ్మిది రోజులకే ఈ తీర్పును ఇచ్చింది న్యాయస్థానం. నిందితుడు వాసిల్(21)పై పోక్సో చట్టం కింద నమోదైన కేసులో విచారణ జరిపి తీర్పు వెల్లడించింది. నిందితుడికి రూ.45,000 జరిమానాను విధించారు ఖైరానా ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి జస్టిస్ ముంతాజ్​ అలీ. జరిమానాలోని సగం డబ్బుల్ని బాధితుడికి ఇవ్వాలని కోర్టు ఆదేశించింది.

అసలేం జరిగిందంటే: నిందితుడు.. బాలుడికి మిఠాయిలు ఇస్తానని నమ్మించి నిర్మానుష్య ప్రదేశంలోకి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానని బాధితుడిని బెదిరించాడు. ఈ ఘటన 2021 ఏప్రిల్ 1న ఖైరానాలో జరిగింది. జూన్ 1న పోలీసులు చార్జిషీట్​ దాఖలు చేశారు. జూన్​ 21న ఖైరానా ప్రత్యేక విచారణను ప్రారంభించిన న్యాయస్థానం.. బుధవారం తుది తీర్పును వెల్లడించింది.

హత్యాచార నిందితునికి మరణ శిక్ష: అయిదేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తికి త్రిపుర.. ఖోవై జిల్లా కోర్టు మరణ శిక్ష విధించింది. నిందితుడు కాళీ కుమార్(22)​.. గతేడాది ఫిబ్రవరిలో ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఈ కేసులో 35మంది వాంగ్మూలాన్ని తీసుకున్నారు పోలీసులు.

ఇవీ చదవండి: ప్రియుడితో భార్య పరార్​​.. కోపంతో ఇద్దరు కుమార్తెలను హత్య చేసిన భర్త!

మూడేళ్ల తర్వాత అమర్​​నాథ్ ​యాత్ర.. భారీగా తరలివచ్చిన యాత్రికులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.