ETV Bharat / bharat

అమ్మవారికి వింత పూజలు.. వీపు చూస్తూ మొక్కులు.. కానుకలుగా చెప్పులు

author img

By

Published : Nov 11, 2022, 7:04 PM IST

కర్ణాటక కలబురిగి జిల్లాలోని గోల లక్కమ్మ అమ్మవారిని భక్తులు వింతగా పూజిస్తున్నారు. కానుకలుగా ఒక జత చెప్పులను సమర్పిస్తున్నారు. దేవత వీపు వైపుగా మొక్కుతూ కోరికలను కోరుకుంటున్నారు. దీపావళి తరువాత వచ్చే పంచమి నాడు జరిగే ఈ జాతరకు కర్ణాటకతో పాటు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర నుంచి భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారు.

Gola Lakkamma deity in karnataka
లక్కమ్మ అమ్మవారి జాతర

కర్ణాటకలోని లక్కమ్మ దేవత

సాధారణంగా భక్తులు దేవుళ్లను ఎలా మొక్కుతారు? వారి ముందు నిల్చుని వారిని చూస్తూ వేడుకుంటారు. దేవుడికి కానుకగా ఏం సమర్పిస్తారు? పూలు, పండ్లు, టెంకాయలు, విరాళాలు లాంటివి ఇస్తారు. అయితే ఈ గుడిలో మాత్రం దేవత వీపు చూస్తూ మొక్కుతారు. చెప్పులను కానుకలుగా ఇస్తారు. ఈ వింత ఆచారం పాటించే సంప్రదాయం కర్ణాటకలో ఉంది.

కలబురిగి జిల్లా అలంద్​ తాలుకా గోల గ్రామంలోని లక్కమ్మ దేవతను భక్తులు విచిత్రంగా పూజిస్తారు. గుడి ముందు ఒక జత చెప్పులను కట్టి కోరికలు కోరుకుంటారు. అమ్మవారి వీపు వైపుగా మొక్కుతారు. ఇలా చేస్తేనే దేవత తమ కోరికలు నెరవేరుస్తుందని బలంగా నమ్ముతారు. ఈ అమ్మవారిని కాళికా దేవి మరో రూపంగా భావిస్తారు అక్కడి ప్రజలు. శాకాహార భక్తులు అమ్మవారికి ఒబట్టు అనే వంటకాన్ని సమర్పిస్తారు. మాంసాహారులు మాత్రం కోళ్లు, మేకలను బలిస్తారు.

"చాలా ఏళ్లుగా ఈ సంప్రదాయన్ని పాటిస్తూ వస్తున్నాం. ప్రతి సంవత్సరం గోల అమ్మవారి జాతరను దీపావళి తరువాత వచ్చే పంచమి నాడు నిర్వహిస్తాం. భక్తులు అమ్మవారి ముందు చెప్పులు కట్టి, టెంకాయలు కొట్టి మొక్కులు చెల్లించుకుంటారు. కర్ణాటకతో పాటు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర నుంచి ​సైతం భక్తులు అధిక సంఖ్యలో జాతరకు వస్తారు. చివరగా గ్రామం నుంచి ఊరేగింపుగా కొయ్య కలశం, కంచు కలశం ఆలయానికి చేరుకున్న అనంతరం జాతర ముగుస్తుంది."

-మల్లన్న గౌడ, గ్రామ పెద్ద

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.