ETV Bharat / bharat

50 అడుగుల బోరుబావిలో చిన్నారి.. చివరికి!

author img

By

Published : Jun 11, 2021, 6:27 AM IST

Updated : Jun 11, 2021, 7:13 AM IST

Two year old kid rescued from borewell in Nagpur
50 అడుగుల బోర్​వెల్​లో చిన్నారి.. రక్షించిన గ్రామస్థులు

మహారాష్ట్ర రామ్​టెక్​లో.. పశువులు కాస్తున్న తండ్రితో వెళ్లి పొరపాటున బోరుబావిలో పడ్డ చిన్నారిని గ్రామస్థులు బయటకు తీశారు. అధికారులు చేరుకోకముందే వారంతా కలసి ఈ కార్యక్రమాన్ని పూర్తిచేయడం విశేషం.

మహారాష్ట్రలో 50 అడుగుల లోతైన బోరుబావిలో పడిన రెండేళ్ల చిన్నారిని గ్రామస్థులు సురక్షితంగా బయటకు తీశారు. నాగ్‌పూర్‌లోని రామ్‌టెక్ తాలూకా శివాని భోండ్కి గ్రామంలో జరిగిందీ ఘటన. నవ్​గన్ దేవా అనే బాలుడి తండ్రి సమీప పొలాల్లో పశువులు కాస్తుండగా.. తోటి చిన్నారులతో కలసి ఆడుకుంటున్న సమయంలో దేవా బోర్‌వెల్​లో పడిపోయాడు. దీనితో చిన్నారి తల్లిదండ్రులు సహాయం కోసం అరవగా అక్కడికి చేరుకున్న గ్రామస్థులు ఆ బాలుడిని తాడు సహాయంతో రక్షించారు.

Two year old kid rescued from borewell in Nagpur
బోర్​వెల్​ నుంచి బయటకు తీసిన అనంతరం చిన్నారికి నీళ్లు తాగిస్తున్న దృశ్యం

ఇదీ చదవండి: తల్లి ప్రోత్సాహం.. చిన్నారి సాహసం!

ఇదీ చదవండి: బెంచ్​లో ఇరుక్కుపోయిన చిన్నారి.. చివరికి!

Two year old kid rescued from borewell in Nagpur
చిన్నారి పడిపోయిన బోర్​వెల్​ గుంత..

బావి లోపలికి ఒక పొడవైన తాడును విడిచిన గ్రామస్థులు.. దానిని గట్టిగా పట్టుకోవాలని చిన్నారికి సూచించారు. బాలుడు సైతం తాము చెప్పినట్లు చేయడం వల్ల తమ పని సులువైందని కృష్ణ అనే గ్రామస్థుడు తెలిపాడు. సుమారు 45 నిమిషాల పాటు ఈ ఆపరేషన్ కొనసాగింది.

Two year old kid rescued from borewell in Nagpur
చిన్నారి నవ్​గన్ దేవా..

అధికారులకు సమాచారం అందించినప్పటికీ.. వారి రాక కోసం వేచిచూడకుండా గ్రామస్థులు చూపిన సమయస్ఫూర్తికి సర్వత్రా ప్రశంసలు లభిస్తున్నాయి.

ఇవీ చదవండి: అయ్యో పాపం.. తాగునీరు లేక చిన్నారి మృతి

అమ్మ కోసం చిన్నారి ఆరేళ్ల నిరీక్షణ- చివరకు కలిసిందిలా

Last Updated :Jun 11, 2021, 7:13 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.