ETV Bharat / bharat

'ప్రతి కొవిడ్​ కేసుకు 25-30 మందిని గుర్తించాలి'

author img

By

Published : Mar 31, 2021, 5:14 AM IST

contacts of each COVID-19 case
'ప్రతి కొవిడ్​ కేసుకు 25-30 మందిని గుర్తించాలి'

దేశంలో కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తున్న నేపథ్యంలో.. ప్రతి కొవిడ్​ కేసుకు సంబంధించి 25-30 మంది కాంటాక్ట్​ వ్యక్తులను గుర్తించాలని అన్ని రాష్ట్రాలను కేంద్రం ఆదేశించింది. కంటెయిన్​మెంట్​ జోన్లను, 'టెస్ట్, ట్రాక్​, ట్రీట్​' విధానాన్ని పక్కాగా అమలు చేయాలని తెలిపింది. వైరస్​ కట్టడి కోసం ప్రతి జిల్లాకు ఒక కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని చెప్పింది. ​

దేశంలోని కరోనా మళ్లీ కోరలు చూస్తున్న తరుణంలో.. వైరస్​ వ్యాప్తిని కట్టడి చేసేందుకు ప్రతి కొవిడ్​ కేసుకు సంబంధించి 25-30 మందిని కాంటాక్ట్​ వ్యక్తులను గుర్తించాలని అన్ని రాష్ట్రాలను కేంద్రం ఆదేశించింది. కేసుల పెరుగుదలతో సంబంధం లేకుండా.. ప్రతి జిల్లాకు ఒక కార్యాచరణ రూపొందించి అమలు చేయాలని తెలిపింది. వైరస్​ వ్యాప్తి తీవ్రత ఎక్కువగా ఉన్న జిల్లాల్లో 45 ఏళ్లు పైబడిన వారికి 100 శాతం వ్యాక్సినేషన్​కు చర్యలు తీసుకోవాలని పేర్కొంది.

"వైరస్​ బారిన పడే వారి సంఖ్య పెరుగుతున్నప్పుడు.. బాధితులను, ఆయా వ్యక్తి కుటుంబాలను మాత్రమే క్వారంటైన్​లో ఉంచితే సరిపోదు. కంటెయిన్​మెంట్​ జోన్ల విస్తృతిని పెంచాలి. స్పష్టమైన సరిహద్దులను గుర్తించాలి."

-రాజేశ్​ భూషణ్​, కేంద్ర వైద్య ఆరోగ్య కార్యదర్శి

కొవిడ్​ నిబంధనలు పాటించనివారిపై పోలీసు చట్టం, విపత్తు నిర్వహణ చట్టం ప్రయోగించాలని రాష్ట్రాలకు కేంద్రం స్పష్టం చేసింది. పరీక్షల సంఖ్యను పెంచడం సహా కేసుల వృద్ధి, ​పాజిటివిటీ రేటు, మరణాల రేటును పరిశీలిస్తూ ఉండాలని తెలిపింది. 'టెస్ట్​, ట్రాక్​, ట్రీట్'​ విధానం పకడ్బందీగా అమలు చేయాలని పేర్కొంది.

ఇదీ చూడండి:'కరోనా పరిస్థితి తీవ్రం- 10 జిల్లాల్లోనే అధిక కేసులు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.