ETV Bharat / bharat

తిరుమల భక్తులకు గుడ్ న్యూస్ - నేటినుంచి ఏప్రిల్ టికెట్లు - స్పెషల్ దర్శనం టికెట్లు ఎప్పుడంటే?

author img

By ETV Bharat Telugu Team

Published : Jan 18, 2024, 10:37 AM IST

Tirumala Special Darshan Tickets For April
Tirumala Special Darshan Tickets For April 2024

Tirumala Special Darshan Tickets For April 2024 : శ్రీవారి భక్తులకు అలర్ట్. ఏప్రిల్​ నెలకు సంబంధించిన.. ఆర్జిత సేవలు, అంగ ప్రదక్షిణం, ప్రత్యేక దర్శన టికెట్లు, వసతి గదులు బుకింగ్​కు సంబంధించిన షెడ్యూల్​ను టీటీడీ ప్రకటించింది.

Tirumala Special Darshan Tickets For April 2024 : నిత్యం ప్రపంచ నలుమూలల నుంచి తిరుమలలో కొలువైన కలియుుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వరస్వామిని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తుంటారు. దీంతో.. అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడిని భక్తులు మరింత ప్రీతిపాత్రంగా సేవించుకునేందుకు.. తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) పలు ఆర్జిత సేవలను ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా ప్రతినెలా శ్రీవారి దర్శనానికి వెళ్లే వారి కోసం టీటీడీ మూడు నెలల ముందుగానే.. ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్లు బుక్ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తోంది.

తాజాగా 2024 ఏప్రిల్​లో శ్రీవారి దర్శనానికి వెళ్లే వారికోసం.. ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శన టికెట్లు, అంగప్రదక్షిణం టికెట్లు, వసతి గదులు ఆన్​లైన్​లో బుక్ చేసుకునేందుకు షెడ్యూల్ ప్రకటించింది. పై సేవలకు సంబంధించిన టికెట్లను నేటినుంచి విడుదల చేయనున్నట్లు తెలిపింది టీటీడీ. ఆ వివరాలు ఈ స్టోరీలో చూద్దాం..

Tirumala Rs.300 Special Darshan Tickets : ఏప్రిల్​ నెలకు సంబంధించిన ఆన్​లైన్​ టికెట్ల విడుదల షెడ్యూల్ చూస్తే.. సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన లాంటి ఆర్జిత సేవల ఆన్​లైన్ లక్కీడిప్ కోసం ఈరోజు(జనవరి 18) ఉదయం 10 గంటల నుంచి 20వ తేదీ ఉదయం వరకు నమోదు చేసుకునే అవకాశం కల్పించారు. ఈ లక్కీడిప్​లో టికెట్లు పొందిన భక్తులు ఈ నెల 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటల్లోగా డబ్బులు చెల్లించి.. టికెట్లు కన్ఫార్మ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్‌ సేవ, సహస్రదీపాలంకరణ సేవాటికెట్లను జనవరి 22న ఉదయం 10 గంటలకు విడుదల చేయనున్నట్లు టీటీడీ తెలిపింది. అదేవిధంగా ఆరోజు మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవా టికెట్లను విడుదల చేయనున్నారు.

How to Book TTD Special Darshan Tickets : తిరుమల స్పెషల్ దర్శనం టికెట్లు.. ఎలా బుక్ చేసుకోవాలో మీకు తెలుసా..?

తిరుమలలో ఏప్రిల్‌ 21 నుంచి 23 వరకు శ్రీవారి వార్షిక వసంతోత్సవం జరగనుంది. ఇందుకు సంబంధించిన సేవా టికెట్లను జనవరి 22వ తేదీ ఉదయం 10గంటలకు అధికారులు విడుదల చేయనున్నారు. ఇక అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను ఈనెల 23వ తేదీ ఉదయం 10గంటలకు విడుదల చేయనుండగా.. శ్రీవాణి ట్రస్ట్‌ బ్రేక్‌ దర్శనం, గదుల కోటాను అదే రోజు ఉదయం 11 గంటలకు విడుదల చేయనున్నారు. వృద్ధులు, దివ్యాంగులకు దర్శన టోకెన్ల కోటాను ఈ నెల 23వ తేదీ మధ్యాహ్నం 3గంటలకు అందుబాటులో ఉంచనున్నట్లు టీటీడీ తెలిపింది.

24న తిరుమల ప్రత్యేక దర్శన టికెట్లు : జనవరి 24న ఉదయం 10 గంటలకు స్వామివారి ప్రత్యేక దర్శన టికెట్లు(రూ.300 దర్శన టికెట్లు) రిలీజ్ చేయనున్నారు. తిరుమల, తిరుపతిలో వసతి గదుల బుకింగ్‌ ఈనెల 24న మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేస్తారు. ఇక.. శ్రీవారి సేవ కోటాను జనవరి 27న ఉదయం 11గంటలకు, నవనీత సేవ కోటాను మధ్యాహ్నం 12గంటలకు, పరకామణి సేవ కోటాను మధ్యాహ్నం ఒంటిగంటకు వెబ్​సైట్​లో అందుబాటులో ఉంచనున్నారు. ఏప్రిల్​లో తిరుమల వెళ్లాలనుకునే భక్తులు ఈ విషయాలను గమనించి https://tirupatibalaji.ap.gov.in వెబ్​సైట్ ద్వారా శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శన టికెట్లు బుక్‌ చేసుకోవాలని టీటీడీ కోరుతోంది.

తిరుమల వెంకటేశ్వర స్వామి ఆస్తి ఎంతో మీకు తెలుసా..?

Tirumala Darshanam : తిరుమల భక్తులకు షాక్​.. రద్దు నిర్ణయం తీసుకున్న టీటీడీ​..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.