ETV Bharat / bharat

రైతుల విడుదల కోసం టికాయత్ ధర్నా

author img

By

Published : Jun 6, 2021, 10:56 AM IST

Updated : Jun 6, 2021, 5:09 PM IST

tikait, yogendra yadav
టికాయత్, యోగేంద్ యాదవ్, గురుణామ్ సింగ్

అరెస్టు చేసిన అన్నదాతలను విడుదల చేయాలని డిమాండ్​ చేస్తూ హరియాణా తోహానా సర్దార్ పోలీస్​ స్టేషన్​ ముందు ధర్నాకు దిగారు భారతీయ కిసాన్ యూనియన్ నేత రాకేశ్ టికాయత్. ఎమ్మెల్యే దేవెందర్ సింగ్ బబ్లీతో వాగ్వాదం నేపథ్యంలో రైతులను అరెస్టు చేశారు పోలీసులు.

భారతీయ కిసాన్ యూనియన్ నాయకుడు రాకేశ్ టికాయత్ అన్నదాతలతో కలిసి హరియాణా ఫతేహ్​బాద్​ జిల్లా తొహానా సర్దార్ ఠాణా ముందు బైఠాయించారు. ఈ ధర్నాలో యునైటెడ్ కిసాన్ మోర్చా నేత యోగేంద్ర యాదవ్, గురుణామ్​ సింగ్ కూడా పాల్గొన్నారు. అరెస్టైన రైతులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

farmers dharna
రాకేశ్ టికాయత్​
dharna, fatehbad
రైతులను విడుదల చేయాలని డిమాండ్

స్థానిక జేజేపీ ఎమ్మెల్యే దేవెందర్ సింగ్ బబ్లీపై కేసు నమోదు చేయాలని టికాయత్ కోరారు. బబ్లీ.. రైతులపై దుర్భాషలాడారని అన్నారు. జూన్​1న బబ్లీ నివాసం వద్ద ఘెరావ్​ నేపథ్యంలో రవి ఆజాద్, వికాస్​ సిసార్ అనే ఇద్దరు రైతులను పోలీసులు అరెస్టు చేశారు.

"రైతులపై పెట్టిన కేసును ఎమ్మెల్యే వెనక్కితీసుకున్నారు. రైతులపై ఆయన చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు కోరారు. అయినప్పటికీ పోలీసులు.. అరెస్టు చేసి జైలుకు తరలించిన రైతులను విడుదల చేయడం లేదు. ఈ విషయంపై అధికారులతో మాట్లాడాం. రైతులను విడుదల చేసే వరకూ ధర్నా కొనసాగిస్తాం. వారిని విడుదల చేయకపోతే మమ్మల్నందరినీ అరెస్టు చేయాలని కోరుతాం."

--రాకేశ్ టికాయత్, బీకేయూ నేత.

రైతులు ఠాణా ముందు ధర్నాకు దిగిన నేపథ్యంలో.. పోలీసులు పెద్ద మొత్తంలో స్టేషన్​ వద్దకు వచ్చారు.

sardar police station
ఠాణా వద్ద రైతులు

ఇదీ చదవండి:టీకా తీసుకోకుండా తిరిగితే.. రూ.500 ఫైన్!

Last Updated :Jun 6, 2021, 5:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.