ETV Bharat / bharat

జమ్ముకశ్మీర్​లో ఎన్​ఐఏ సోదాలు.. నలుగురు ఉగ్రవాదులు అరెస్ట్

author img

By

Published : Oct 13, 2021, 3:08 PM IST

NIA
ఎన్​ఐఏ

జమ్ముకశ్మీర్​లోని పలు ప్రాంతాల్లో దాడులు నిర్వహించిన ఎన్​ఐఏ(National Investigation Agency).. నలుగురు ఉగ్రవాదులను అరెస్టు(Terrorist Arrested Today) చేసింది. అరెస్టయిన వారంతా వివిధ నిషేధిత ఉగ్రవాద సంస్థల కోసం కిందిస్థాయిలో పనిచేస్తున్నట్లు ఎన్​ఐఏ గుర్తించింది.

దిల్లీ సహా.. దేశంలోని ప్రధాన నగరాల్లో దాడులు చేసేందుకు కుట్ర పన్నిన వివిధ తీవ్రవాద గ్రూపులకు చెందిన నలుగురు ఉగ్రవాదులను జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్​ఐఏ) అదుపులోకి తీసుకుంది. వారిని జమ్ముకశ్మీర్​లోని శ్రీనగర్​(Terrorism in Jammu and Kashmir)కు చెందిన వసీం అహ్మద్ సోఫీ, తారిక్ అహ్మద్ దార్, బిలాల్ అహ్మద్ మీర్ అలియాస్ బిలాల్ ఫాఫు, తారిఖ్ అహ్మద్ బఫండాగా గుర్తించింది. శ్రీనగర్, పుల్వామా, షోపియాన్ జిల్లాల్లో ఏకకాలంలో మంగళవారం నిర్వహించిన సోదాల్లో వీరిని అదుపులోకి తీసుకున్నట్లు ఎన్​ఐఏ అధికారి ఒకరు తెలిపారు. ఉగ్రకుట్రలకు(Terrorist Attack) సంబంధించి అక్టోబర్ 10న కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించింది ఎన్​ఐఏ.

అరెస్టయిన వారంతా వివిధ నిషేధిత ఉగ్రవాద సంస్థల కోసం కిందిస్థాయిలో పనిచేస్తున్నట్లు ఎన్​ఐఏ గుర్తించింది. ముష్కరుల కార్యకలాపాల్లో సహకరిస్తూ.. వారికి అవసరమైన సరకు రవాణాలో మద్దతిస్తున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైనట్లు తెలిపింది. 'మంగళవారం నిర్వహించిన సోదాల్లో అనేక ఎలక్ట్రానిక్ పరికరాలు, జిహాదీ సాహిత్యం, అనుమానాస్పద ఆర్థిక లావాదేవీల రికార్డులు స్వాధీనం చేసుకున్నట్లు ఎన్​ఐఏ ప్రతినిధి వెల్లడించారు.

"నిషేధిత ఉగ్ర సంస్థలైన లష్కరే తోయిబా(ఎల్​ఈటీ), జైషే మహ్మద్ (జేఈఈఎమ్), హిజ్బుల్ ముజాహిదీన్ (హెచ్‌ఎం), అల్ బదర్​తో పాటు.. వాటి అనుబంధ సంస్థలైన రెసిస్టెన్స్ ఫ్రంట్ (టీఆర్‌ఎఫ్), పీపుల్ ఎగైనెస్ట్ ఫాసిస్ట్ ఫోర్సెస్ (పీఏఎఫ్​ఎఫ్).. ప్రోద్బలంతో దేశంలోని ప్రధాన నగరాల్లో భౌతిక దాడులు చేసేందుకు కుట్రలు జరుగుతున్నాయి. "

-ఎన్​ఐఏ

పైన పేర్కొన్న సంస్థలకు చెందిన ఉగ్రవాదులు పొరుగు దేశంలోని తమ కమాండర్లతో కలిసి కుట్ర చేస్తున్నట్లు ఎన్​ఐఏ దర్యాప్తులో వెల్లడైంది. ఆయుధాల ఉపయోగం, పేలుడు పదార్థాల వినియోగంలో నియామకం, శిక్షణతో పాటు.. స్థానిక యువతను తీవ్రవాద భావజాలం వైపు మళ్లించేలా వీరంతా పనిచేస్తున్నట్లు ఎన్​ఐఏ గుర్తించింది.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.