ETV Bharat / bharat

సైగలతో ఆర్డర్ చేస్తేనే ఆ హోటల్​లో భోజనం

author img

By

Published : Jan 4, 2022, 7:17 PM IST

Deaf and Dumb Hotel
ఆ హోటల్​లో ఆర్డర్​ చేయాలంటే సైగలతోనే..

Deaf and Dumb Hotel: ఆ హోటల్​లో ఏదైనా వంటకం ఆర్డర్​ చేయాలంటే మెనూ కార్డులో ఉన్న ప్రత్యేక గుర్తులతోనే చెప్పాలి. ఎందుకంటే అక్కడి సిబ్బంది అంతా బధిర యువతీయువకులు. అదే ఆ హోటల్​కు ప్రత్యేకతను తెచ్చిపెట్టింది. ఇంతకీ ఈ హోటల్​ ఎక్కడ ఉందంటే..

బధిర యువతీయువకులు నిర్వహిస్తున్న టెర్రాసిన్​ హోటల్

Deaf and Dumb Hotel: మహారాష్ట్ర పుణెలో ఉన్న టెర్రాసిన్​ హోటల్​లోకి అడుగుపెట్టగానే అక్కడి సిబ్బంది చిరునవ్వుతో స్వాగతం పలుకుతారు. సైగలతోనే ఒకరికొకరు సంభాషించుకుంటారు. ఎందుకంటే వీరంతా బధిర యువతీయువకులు. ఆ హోటల్​ ప్రత్యేకత కూడా అదే. ఒకరు, ఇద్దరు కాదు ఆ హోటల్​ సిబ్బంది మొత్తం వినికిడి-మూగ సమస్యతో బాధపడుతున్న వారే. కానీ విజయవంతంగా ఆ హోటల్​ను నిర్వహిస్తున్నారు. ఇదే అందరి దృష్టిని ఆకర్షించేలా చేస్తోంది.

Deaf and Dumb Hotel
సంజ్ఞ భాషలో యజమాని సోనమ్​తో సంభాషిస్తున్న సిబ్బంది
Deaf and Dumb Hotel
ఆర్డర్​ ఇస్తున్న కస్టమర్

బధిర యువతీయువకుల్లో ఆత్మవిశ్వాసం పెంచి, వారిని ప్రోత్సహించాలనే లక్ష్యంతో టెర్రాసిన్ పేరుతో హోటల్​ను స్థాపించారు సోనమ్​ కపాసే. ఒకరికొకరు సంభాషించుకునేందుకు సిబ్బందికి సంజ్ఞల భాషను నేర్పించారు. ఇదంతా బానే ఉంది. కానీ ఎలాంటి సంజ్ఞల భాష రాని ఓ కస్టమర్​ వీరితో సంభాషించాలంటే ఎలా? దానికి కూడా ఓ పరిష్కారం కనిపెట్టారు సోనమ్. కస్టమర్ల కోసం ఓ ప్రత్యేక మెనూ కార్డును తయారు చేశారు. అందులో సంబంధిత వంటకం పేరు పక్కన సైన్​ లాంగ్వేజ్​లో గుర్తులను జోడించారు. దీని ద్వారా కస్టమర్లకు సిబ్బందితో సంభాషించడం సులువు అవుతోంది.

Deaf and Dumb Hotel
కస్టమర్ల కోసం డిజైన్​ చేసిన ప్రత్యేక మెనూ కార్డ్​

ఎఫ్​సీ రోడ్డులో ఉన్న టెర్రాసిన్​ హోటల్​కు​.. ప్రారంభించిన కొద్ది రోజులకే మంచి ఆదరణ లభిస్తోంది. ఎలాంటి తడబాటు లేకుండా పనిచేస్తున్న ఇక్కడి సిబ్బందిని చూసి కస్టమర్లు ఆశ్చర్యపోతున్నారు.

ఇదీ చూడండి : కుమార్తెను కొట్టారని స్కూల్ డైరెక్టర్​పై జవాన్ కాల్పులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.