ETV Bharat / bharat

తెలంగాణలో 70.79% పోలింగ్‌ - మళ్లీ పట్నం బద్ధకించింది - పల్లె ఓటెత్తింది

author img

By ETV Bharat Telugu Team

Published : Dec 1, 2023, 7:35 AM IST

Updated : Dec 1, 2023, 2:27 PM IST

Telangana Assembly Elections Polling Percentage 2023 : రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో 70.79 శాతం పోలింగ్‌ నమోదైంది. రాత్రి 12 గంటల వరకు ఈ మేరకు ఓటింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. మునుగోడులో అత్యధికంగా 91.51 పోలింగ్‌ నమోదు కాగా.. యాకుత్‌పురలో అత్యల్పంగా 39.69 ఓటింగ్‌ జరిగింది.

Highest Polling Percentage Constituency Telangana
Telangana Assembly Elections Polling Percentage

తెలంగాణలో 70.79శాతం పోలింగ్‌ మునుగోడు నియోజకవర్గంలో అత్యధికంగా 91.51 శాతం

Telangana Assembly Elections Polling Percentage 2023 : రాష్ట్రంలో రానున్న ఐదేళ్ల పాలనను వేలికొనలతో నిర్ణయించేందుకు.. పల్లె ఓటర్లు బారులు తీరగా.. పట్టణాలు, నగరాల్లో పెద్దగా ఆసక్తి చూపలేదు. చెదురుమదురు ఘటనలు మినహా.. గురువారం అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. అర్ధరాత్రి 12 గంటల వరకు అందిన సమాచారం ప్రకారం 70.79 శాతం పోలింగ్‌ నమోదైందని(Telangana Polling Percentage 2023) ఎన్నికల అధికారులు తెలిపారు. మరిన్ని వివరాలు.. రావాల్సి ఉందని చెప్పారు. పోస్టల్‌ బ్యాలెట్‌ల వివరాలను ఇంకా లెక్కలో చేర్చలేదని పేర్కొన్నారు.

Highest Polling Percentage in Telangana 2023 : హైదరాబాద్‌ పరిధిలో కేవలం 46.56 శాతం మాత్రమే పోలింగ్‌ నమోదైంది. అత్యధికంగా(Yadadri District Highest Polling Percentage) యాదాద్రి భువనగిరి జిల్లాలో.. 90.03 శాతం రికార్డయింది. మెదక్‌ 86.69, జనగామ 85.74, నల్గొండ 85.49, సూర్యాపేట జిల్లాలో 84.83 శాతం ఓటింగ్‌ నమోదైంది. నియోజకవర్గాల వారీగా.. మునుగోడులో గరిష్ఠంగా 91.51 శాతం, యాకుత్‌పురలో అత్యల్పంగా.. 39.69 శాతం నమోదైంది. జంట నగరాల పరిధిలోని నియోజకవర్గాల్లో ఓటర్లు ఓటు హక్కు(Right to Vote) వినియోగించుకునేందుకు..పెద్దగా ఆసక్తి చూపలేదు. 2018 శాసనసభ ఎన్నికల్లో 73.37 శాతం ఓటింగ్‌(Telangana Voting Percentage) నమోదైంది.

చెదురుమదురు ఘటనల మధ్య ప్రశాంతంగా ముగిసిన పోలింగ్​.. ఓటింగ్​ శాతం ఎంతంటే?

రాష్ట్రంలో గరిష్ఠ, కనిష్టంగా నమోదయిన నియోజకవర్గాల వివరాలు :

నియోజకవర్గం పేరుపోలింగ్ శాతం
మునుగోడు91.51గరిష్ఠం
యాకుత్‌పుర39.69 కనిష్టం

రాష్ట్రంలో జిల్లాల వారీగా నమోదయిన పోలింగ్ శాతం :

క్రమ సంఖ్యజిల్లా పేరు పోలింగ్​ శాతం
1యాదాద్రి భువనగిరి జిల్లా90.03(అత్యధికం)
2మెదక్‌ 86.69
3జనగామ85.74
4నల్గొండ 85.49
5సూర్యాపేట84.83
6మహబూబాబాద్ 83.70
7ఖమ్మం83.28
8ములుగు82.09
9భూపాలపల్లి81.20
10జోగులాంబ గద్వాల్81.16
11ఆసిఫాబాద్80.82
12ఆదిలాబాద్79.86
13సిద్దిపేట79.84
14కామారెడ్డి 79.59
15నాగర్‌కర్నూల్79.46
16భద్రాద్రి కొత్తగూడెం78.65
17నిర్మల్78.24
18వరంగల్78.06
19మహబూబ్‌నగర్‌77.72
20వనపర్తి 77.64
21నారాయణపేట76.74
22పెద్దపల్లి76.57
23వికారాబాద్76.47
24సంగారెడ్డి76.35
25సిరిసిల్ల76.12
26జగిత్యాల 76.10
27మంచిర్యాల75.59
28కరీంనగర్74.61
29నిజామాబాద్73.72
30హనుమకొండ66.38
31మేడ్చల్ 56
32రంగారెడ్డి 59.94
33హైదరాబాద్‌46.56(అత్యల్పం)
2023లో పోలింగ్ శాతం 70.66
2018లో పోలింగ్ శాతం73.37

Telangana Polling Percentage 2023 : మొత్తం 119 నియోజకవర్గాలకు ఎన్నిక జరగగా.. సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం రెడ్డిఖానాపూర్‌లో రాత్రి 8 గంటల వరకు జరిగింది. షాద్‌నగర్‌ నియోజకవర్గం కొత్తూరు మండలం గూడూరు, తిమ్మాపూర్‌లలోని పోలింగ్‌ కేంద్రాల్లో రాత్రి 8.30 దాటాక కూడా.. పోలింగ్‌ జరిగింది. మరికొన్ని ప్రాంతాల్లో.. రాత్రి 9:30 వరకు కొనసాగింది. సాయంత్రం అయిదు గంటల తర్వాత కూడా ఓటు వేసేందుకు పెద్ద సంఖ్యలో ఓటర్లు వేచి ఉండటం వల్ల.. వారికి టోకెన్లు ఇచ్చి ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది. తీవ్రవాద ప్రభావిత 13 నియోజకవర్గాల్లో.. సాయంత్రం 4 గంటలకు పోలింగ్‌ ముగియగా, అక్కడ కూడా అప్పటికే క్యూలో ఉన్న వారికి.. ఓటేసేందుకు అవకాశం కల్పించారు.

5 రాష్ట్రాల ఎగ్జిట్ పోల్స్​ - అధికార పీఠం ఎవరిదంటే?

Telangana Polling at 8PM : కామారెడ్డి, జనగామ, ముథోల్‌, ఇబ్రహీంపట్నం, అచ్చంపేట, పినపాక, పాలేరు, వరంగల్‌ తూర్పు నియోజకవర్గాల్లో.. స్వల్ప ఘటనలు చోటు చేసుకున్నాయి. సుమారు 25 నుంచి 30 కేంద్రాల పరిధిలో ఈవీఎంలు మొరాయించగా.. సుమారు 20 నుంచి 30 నిమిషాల పాటు పోలింగ్‌ ఆలస్యమైంది.

వరంగల్‌ తూర్పులో.. 5 గంటలు దాటిన తర్వాత వచ్చిన వారిని ఓటు వేసేందుకు అనుమతించకపోవటం వల్ల.. ఓటర్లు, పోలీసుల మధ్య(Clash Between Voters and Police) వాగ్వావాదం చోటుచేసుకుంది. కాగజ్‌నగర్​లో ఓ పార్టీ ఏజెంట్లు.. ఓటర్లను ప్రభావితం చేస్తున్నారంటూ ఇతర పార్టీల కార్యకర్తలు పెద్దఎత్తున గుమిగూడగా.. చెదరగొట్టే క్రమంలో పోలీస్​ అధికారులకు కూడా గాయాలయ్యాయి. మరికొన్ని ప్రాంతాల్లోనూ.. పరిస్థితులను అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు లాఠీలు ఝళిపించారు.

Telangana Polling Percent Increase Villages : పల్లెల్లో పొద్దంతా పనులు చేసుకుని వచ్చిన ప్రజలు సాయంత్రం.. పోలింగ్‌ కేంద్రాలకు రావడం కనిపించింది. యాచారం, ఇబ్రహీంపట్నం మండలాల్లోని పలు బూత్‌లకు ఓటర్లు ఎంసెట్‌ పరీక్షకు పరుగెత్తినట్లు.. ఉరుకులు, పరుగులతో వస్తూ కనిపించారు. సాయంత్రం నాలుగు గంటల తర్వాత చాలా పార్టీల వారు.. ఓటర్ల తరలింపు చేపట్టారు. జాబితాను ముందు పెట్టుకుని ఇంకా ఎవరు ఓటుకు రాలేదో ఆరా తీసి.. వారి కోసం వాహనాలు పంపారు. వ్యాన్లు, ఆటోలు, చివరకు ద్విచక్ర వాహనాలు కూడా పంపి.. ఓటర్లను తీసుకొచ్చారు.

హస్తానికే అధికారం! - తెలంగాణ ఎగ్జిట్ పోల్స్​ 2023 ఫలితాలు ఇవే

పోలింగ్‌ కేంద్రం వద్ద మహిళల ఆందోళన - మద్యం, డబ్బుల పంపకాల్లో వివక్ష చూపారని నిరసన

Last Updated : Dec 1, 2023, 2:27 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.