ETV Bharat / bharat

పప్పు గిన్నెలో పాము.. మధ్యాహ్న భోజనం తిన్న విద్యార్థులకు అస్వస్థత

author img

By

Published : Jan 10, 2023, 12:47 PM IST

students-get-sick-after-eating-lunch-in-primary-school-west-bengal
బంగాల్​ ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనం తిని విద్యార్థులకు అనారోగ్యం

బంగాల్​లో మధ్యాహ్న భోజనం తిని పలువురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. బీర్బూమ్ జిల్లా, మయూరేశ్వర్ బ్లాక్​లోని ఓ ప్రాథమిక పాఠశాలలో ఈ ఘటన జరిగింది. కాగా పప్పు నిల్వ ఉంచిన పాత్రలో.. ఓ పామును గుర్తించినట్లు పాఠశాల సిబ్బంది ఒకరు తెలిపారు. ఘటనలో దాదాపు 30 మంది అస్వస్థతకు గురయ్యారు.

పాఠశాలలో మధ్యాహ్న భోజనం తిని పలువురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. బంగాల్​లోని బీర్బూమ్ జిల్లాలో ఈ ఘటన జరిగింది. దాదాపు 30 మంది విద్యార్థులు అస్వస్థతకు లోనయ్యారు. సోమవారం మధ్యాహ్నం భోజనం తిన్న విద్యార్థులు.. అనంతరం అనారోగ్యం పాలైనట్లు అధికారులు తెలిపారు.
వివరాల్లోకి వెళితే..
మయూరేశ్వర్ బ్లాక్​లోని ఓ ప్రాథమిక పాఠశాలలో ఈ ఘటన జరిగింది. పప్పు నిల్వ ఉంచిన పాత్రలో ఓ పామును గుర్తించినట్లు పాఠశాల సిబ్బంది ఒకరు తెలిపారు. మధ్యాహ్న భోజనం తిన్న విద్యార్థులు.. అనంతరం వాంతులు చేసుకున్నట్లు ఆయన వెల్లడించారు. వెంటనే వారందరిని రాంపుర్హాట్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్​కు తరలించినట్లు ఆయన పేర్కొన్నారు.

ఘటనపై మయూరేశ్వర్ బ్లాక్ డెవలప్​మెంట్​ అధికారి దీపంజన్ జానా స్పందించారు. పాఠశాల విద్యార్థులు అస్వస్థతకు గురైన విషయం తన దృష్టికి వచ్చినట్లు తెలిపారు. వెంటనే సమాచారాన్ని జిల్లా పోలీసు అధికారికి తెలిపినట్లు ఆయన వెల్లడించారు. విద్యార్థులెవ్వరికి ప్రాణహాని లేదని అధికారి దీపంజన్ జానా స్పష్టం చేశారు. ఒక్క విద్యార్థి తప్ప, మిగతా వారందరూ ఆసుపత్రిలో చికిత్స పొంది.. అనంతరం డిశ్చార్జ్ అయినట్లు వెల్లడించారు. కాగా ఘటన స్థలాన్ని సందర్శించిన పోలీసులు.. జరిగిన పరిణామంపై అక్కడి వారిని ఆరా తీశారు.​ పిల్లలు అస్వస్థతకు గురవడంపై ఆగ్రహించిన వారి తల్లిదండ్రులు హెడ్​మాస్టర్​కు వ్యతిరేకంగా ఆందోళనకు దిగారని, అనంతరం ఆయన బైక్​ను ద్వంసం చేశారని పోలీసులు తెలిపారు. వారందరిని శాంతింపజేసినట్లు వారు వెల్లడించారు.

ఇవీ చదవండి:

చలికి దిల్లీ గజగజ.. దట్టంగా పొగమంచు.. 260 రైళ్లు, 30 విమానాలు ఆలస్యం

స్వాతంత్ర్యం వచ్చిన 75 ఏళ్లకు విద్యుత్ వెలుగులు.. కశ్మీరీ గ్రామస్థుల సంబరాలు

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.