ETV Bharat / bharat

అయ్యప్ప మాలధారులకు శుభవార్త - శబరిమలకు 22 స్పెషల్ ట్రైన్స్ - టైమింగ్స్ ఇవే

author img

By ETV Bharat Telugu Team

Published : Nov 22, 2023, 10:03 AM IST

Sabarimala Special Trains
Sabarimala Special Trains

Sabarimala Special Trains 2023 : శబరిమల పుణ్య క్షేత్రానికి వెళ్లే అయ్యప్ప భక్తులకు శుభవార్త. తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల నుంచి శబరికి ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. మొత్తం 22 రైళ్లను నిర్ణీత తేదీల్లో ఏర్పాటు చేసినట్లు ప్రకటించింది.

Sabarimala Special Trains 2023 : శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని శబరిమల పుణ్య క్షేత్రాన్ని దర్శించుకొనేందుకు వెళ్లే వారి కోసం.. ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే ప్రకటించింది. తెలుగు రాష్ట్రాల్లోని వేర్వేరు ప్రాంతాలను కలుపుతూ శబరిమల(Sabarimala Temple)కు మొత్తం 22 రైళ్లు ఏర్పాటు చేసింది. ఆయా రైళ్లు ప్రయాణించే తేదీలు, టైమింగ్స్‌, తదితర వివరాలను దక్షిణ మధ్య రైల్వే విడుదల చేసింది. ఈ ప్రత్యేక రైళ్లు నవంబర్ 22 నుంచి డిసెంబర్‌ 8 వరకు నిర్దేశించిన రోజుల్లో రాకపోకలు కొనసాగించనున్నాయి. ఈ ప్రత్యేక రైళ్లలో ఫస్ట్‌ ఏసీ, సెకండ్‌ ఏసీ, థర్డ్‌ ఏసీతో పాటు స్లీపర్‌, సెకెండ్‌ క్లాస్‌ కోచ్‌లు ఉంటాయని రైల్వే అధికారులు వెల్లడించారు.

Sabarimala Special Trains Dates and Timings :

సికింద్రాబాద్ - కొల్లాం (07129) : సికింద్రాబాద్​లో ఈ నెల 26, డిసెంబర్ 3 తేదీల్లో సాయంత్రం 4గంటల 30 నిమిషాలకు బయల్దేరి మరుసటి రాత్రి 11గంటల 55 నిమిషాలకు కొల్లాం చేరుకుంటుంది.

కొల్లాం-సికింద్రాబాద్(07130) : కొల్లాంలో ఈ నెల 28, డిసెంబర్‌ 5 తేదీల్లో తెల్లవారుజామున 2.30 గంటలకు బయల్దేరి తర్వాతి రోజు ఉదయం 8.55 నిమిషాలకు సికింద్రాబాద్ వస్తుంది.

ఈ రైళ్లు ఆగే స్టేషన్లు : నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, కావలి, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, కాట్పాడి, జోలర్‌పేట్‌, సేలం, ఈరోడ్‌, తిరుప్పూర్‌, కోయంబత్తూర్‌, పాలక్కడ్‌, త్రిసూర్‌, ,ఆలువా, ఎర్నాకుళం టౌన్‌, కొట్టాయం, చెంగనస్సెరి, తిరువళ్ల, చెంగనూర్‌, మావెలికెర స్టేషన్ల మీదుగా రాకపోకలు కొనసాగించనున్నాయి.

నర్సాపూర్‌-కొట్టాయం(07119) : ఇది ఈ నెల 26, డిసెంబర్‌ 3 తేదీల్లో మధ్యాహ్నం 3గంటల 50 నిమిషాలకు బయల్దేరి మరుసటి రోజు సాయంత్రం 4.50 గంటలకు కొట్టాయం చేరుకుంటుంది.

కొట్టాయం-నర్సాపూర్(07120) : తిరుగు ప్రయాణంలో ఈ రైలు కొట్టాయంలో ఈ నెల 27, డిసెంబర్‌ 4 తేదీల్లో సాయంత్రం 7 గంటలకు బయల్దేరి తర్వాతి రోజు రాత్రి 9 గంటలకు నర్సాపూర్‌ వస్తుంది.

ఈ రైళ్లు ఆగే స్టేషన్లు : భీమవరం, భీమవరం టౌన్‌, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, తిరుపతి, చిత్తూరు, కాట్పాడి, జోలర్‌పేట్‌, సేలం, ఈరోడ్‌, తిరుప్పూర్‌, కోయంబత్తూర్‌, పాలక్కాడ్‌, త్రిసూర్‌, ఆలువా, ఎర్నాకుళం టౌన్‌ మీదుగా వెళ్తుంది.

శబరిమల వెళ్లే అయ్యప్ప మాలధారులు - ఈ జాగ్రత్తలు తీసుకోవాలి!

కాచిగూడ-కొల్లం(07123) : ఇది ఈ నెల 22, 29, డిసెంబర్‌ 6 తేదీల్లో.. సాయంత్రం 5.30 గంటలకు కాచిగూడలో బయల్దేరి మరుసటి రోజు రాత్రి 11.55 గంటలకు కొల్లాం చేరుకుంటుంది.

కొల్లం-కాచిగూడ (07124) : తిరుగు ప్రయాణంలో ఈ రైలు ఈ నెల 24, డిసెంబర్‌ 1, 8 తేదీల్లో తెల్లవారుజామున 2.30 గంటలకు కొల్లంలో బయల్దేరి తర్వాతి రోజు ఉదయం 10.30 గంటలకు కాచిగూడ రీచ్ అవుతుంది.

ఇవి ఆగే స్టేషన్లు : మల్కాజ్‌గిరి, నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, కాట్పాడి, జోలర్‌పేట్‌, సేలం, ఈరోడ్‌, తిరుప్పూర్‌, కోయంబత్తూరు, పాలక్కాడ్‌, త్రిసూర్‌, ఆలువా, ఎర్నాకుళం టౌన్‌, కొట్టాయం, చెంగనస్సెరి, తిరువళ్ల, చెంగనూర్‌, మావెలికెర స్టేషన్ల మీదుగా రాకపోకలు సాగిస్తాయి.

కాకినాడ టౌన్‌ -కొట్టాయం(07126) : ఇది ఈ నెల 23, 30 తేదీల్లో సాయంత్రం 5.40 గంటలకు కాకినాడ నుంచి బయల్దేరి మరుసటి రోజు రాత్రి 10 గంటలకు కొట్టాయం చేరుకుంటుంది.

కొట్టాయం-కాకినాడ టౌన్ (07126) : ఈ ప్రత్యేక రైలు తిరుగు ప్రయాణంలో ఈ నెల 25, డిసెంబర్‌ 2 తేదీల్లో రాత్రి 12.30 గంటలకు కొట్టాయంలో బయల్దేరి తర్వాతి రోజు తెల్లవారుజామున 4 గంటలకు కాకినాడకు వస్తుంది.

ఈ రైళ్లు ఆగే స్టేషన్లు : సామల్‌కోట్‌, అనపర్తి, రాజమండ్రి, నిడదవోలు, తణుకు, భీమవరం టౌన్‌, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, కాట్పడి, జోలర్‌పెట్టై, సేలం, ఈరోడ్‌, తిరుప్పూర్‌, కోయంబత్తూరు, పాలక్కాడ్‌, త్రిసూర్‌, ఆలువా, ఎర్నాకుళం టౌన్‌ స్టేషన్ల మీదుగా రాకపోకలు సాగిస్తాయి.

సికింద్రాబాద్‌ -కొల్లం(07127) : ఇది సికింద్రాబాద్​లో ఈ నెల 24, డిసెంబర్‌ 1 తేదీల్లో మధ్యాహ్నం 3 గంటలకు బయల్దేరి మరుసటి రోజు సాయంత్రం 7.30 గంటలకు కొల్లాం చేరుకుంటుంది.

కొల్లం-సికింద్రాబాద్‌(07128) : ఈ స్పెషల్ ట్రైన్ తిరుగు ప్రయాణంలో ఈ నెల 25, డిసెంబర్‌ 2 తేదీల్లో రాత్రి 11 గంటలకు కొల్లంలో బయల్దేరి రెండో రోజు తెల్లవారుజామున 4.30 గంటలకు సికింద్రాబాద్‌ చేరుకుంటుంది.

ఈ రైళ్లు ఆగే స్టేషన్లు : కాచిగూడ, ఉందానగర్‌, షాద్‌నగర్‌, జడ్చర్ల, మహబూబ్‌నగర్‌, వనపర్తి రోడ్‌, శ్రీరామ్‌నగర్‌, గద్వాల్‌, కర్నూలు సిటీ,డోన్‌, గుత్తి, తాడిపత్రి, ఎర్రగుంట్ల, కడప, రాజంపేట, రేణిగుంట, తిరుపతి, చిత్తూరు, కాట్పాడి, జోలర్‌పేట్‌, సేలం, ఈరోడ్‌, తిరుప్పూర్‌, కోయంబత్తూరు, పాలక్కాడ్‌, త్రిసూర్‌, ఆలువా, ఎర్నాకుళం టౌన్‌, కొట్టాయం, చెంగనస్సెరి, తిరువళ్ల, చెంగనూర్‌, మావెలికెర స్టేషన్ల మీదుగా రాకపోకలు కొనసాగిస్తాయి.

How to Book Sabarimala Online Darshan Tickets 2023 : శబరిమల దర్శనం టికెట్లు ఆన్​లైన్లో.. ఇలా బుక్ చేసుకోండి..!

అయ్యప్ప భక్తులకు శుభవార్త.. ప్రపంచంలో ఎక్కడి నుంచైనా శబరిగిరీశునికి కానుకలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.