ETV Bharat / bharat

రూ.200 కోట్లు దాటిన శబరిమల ఆదాయం- అయ్యప్పను దర్శించుకున్న 32 లక్షల మంది భక్తులు

author img

By PTI

Published : Dec 26, 2023, 4:37 PM IST

Updated : Dec 26, 2023, 5:32 PM IST

Sabarimala Mandala Pooja Season Revenue Collection Crosses Rs.200 Crores
Sabarimala Temple Revenue Collection 2023

Sabarimala Temple Revenue Collection : శబరిమల అయ్యప్ప స్వామి ఆలయానికి ఈ ఏడాది మండల పూజ సీజన్​లో రూ.204 కోట్లకుపైగా ఆదాయం వచ్చినట్లు ట్రావెన్​కోర్​ దేవస్థానం బోర్డు (టీడీబీ) ప్రకటించింది. భక్తుల కానుకలు సహా వివిధ ఆదాయ మార్గాల ద్వారా ఈ మొత్తం సమకూరినట్లు టీడీబీ అధ్యక్షుడు పీఎస్​ ప్రశాంత్​ తెలిపారు.

Sabarimala Temple Revenue Collection : కేరళలోని శబరిమల అయ్యప్ప స్వామి ఆలయ ఆదాయం మండల సీజన్​లో రూ.204 కోట్లు దాటిందని ట్రావెన్​కోర్​ దేవస్థానం బోర్డు (టీడీబీ) తెలిపింది. మండల పూజ కోసం ఈ ఏడాది ఆలయం తెరిచినప్పటినుంచి డిసెంబర్​ 25 వరకు(39 రోజుల్లో) రూ.204.30 కోట్ల మేర ఆదాయం సమకూరినట్లు టీడీబీ అధ్యక్షుడు పీఎస్​ ప్రశాంత్​ మంగళవారం వెల్లడించారు. కాగా, డిసెంబర్​ 27(బుధవారం)తో వార్షిక మండల పూజ సీజన్​ ముగియనుంది. మిగిలిన రెండు రోజుల్లో వచ్చే కానుకలను కూడా కలిపితే ఆదాయం మరింత పెరిగే అవకాశం ఉందని బోర్డు సభ్యులు తెలిపారు.

వివిధ ఆదాయ వనరుల ద్వారా
'శబరిమల యాత్రకు వచ్చే భక్తులు సమర్పించిన రూ.204.30 కోట్ల ఆదాయంలో రూ.63.89 కోట్లు భక్తులు నగదు రూపంలో హుండీలో సమర్పించారు. రూ.96.32 కోట్లు మహాప్రసాదం 'అరవణ ప్రసాదం' విక్రయాల ద్వారా వచ్చినవి. అలాగే భక్తులకు విక్రయించే ఇంకో తీపి ప్రసాదం 'అప్పం' అమ్మకాల ద్వారా మరో రూ.12.38 కోట్లు సమకూరాయి' అని అధ్యక్షుడు పీఎస్​ ప్రశాంత్​ ప్రకటించారు.

32లక్షలకు చేరువలో భక్తులు
మరోవైపు, వార్షిక తీర్థయాత్ర (మండల పూజ) సీజన్‌ను పురస్కరించుకొని డిసెంబర్ 25 వరకు 31,43,163 మంది భక్తులు శ్రీ అయ్యప్ప స్వామిని దర్శించుకున్నట్లు రద్దీని ప్రస్తావిస్తూ వివరించారు బోర్డు అధ్యక్షుడు ప్రశాంత్​. 'అన్నదాన మండలం' కార్యక్రమం ద్వారా డిసెంబర్​ 25 వరకు 7,25,049 మందికి ఉచితంగా ఆహారాన్ని పంపిణీ చేసినట్లు చెప్పారు. మండల పూజ సీజన్​ చివరిరోజైన బుధవారం(డిసెంబర్​ 27న) రాత్రి 11 గంటలకు ఆలయాన్ని మూసేస్తామని టీడీబీ తెలిపింది. మకరవిళక్కు ఉత్సవం సందర్భంగా తిరిగి డిసెంబర్​ 30న తిరిగి ఆలయాన్ని తెరుస్తామని బోర్డు చెప్పింది. ఇక జనవరి 15న మకరజ్యోతి దర్శనం ఉంటుందని ప్రశాంత్​ అన్నారు.

దర్శనం చేసుకోకుండానే వెనక్కి
శబరిమలలో ఈసారి జరుగుతున్న మండల పూజలకు భక్తులు భారీగా పోటెత్తారు. దీంతో రద్దీని అరికట్టడంలో భద్రతా దళాలు విఫలమయ్యాయి. ఆలయానికి వెళ్లే రహదారులన్నీ ట్రాఫిక్‌తో నిండిపోయాయి. ఫలితంగా ఇతర రాష్ట్రాల నుంచి శబరిమలకు వచ్చిన అయ్యప్ప భక్తులు సన్నిధానానికి చేరుకోకుండానే పందళం వలియకోయికల్ ధర్మశాస్త్ర ఆలయాన్ని దర్శించుకుని వెనుదిరిగారు. ఈ వార్తి పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

శబరిమల భక్తులకు గుడ్​న్యూస్​- అయ్యప్ప స్వామి దర్శన సమయం పెంపు

అయ్యప్ప ఆలయంలో 18 మెట్లు మాత్రమే ఎందుకుంటాయి? ఒక్కో మెట్టు విశిష్టత ఏంటి?

శబరిమల ప్రసాదం గురించి మీకు ఈ విషయాలు తెలుసా? - అయితే ఈ స్టోరీపై ఓ లుక్కేయండి!

శబరిమల అయ్యప్ప భక్తులకు గుడ్​న్యూస్​- వారి కోసం 'అయ్యన్​' యాప్​, ఇక మరింత ఈజీగా దర్శనం!

Last Updated :Dec 26, 2023, 5:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.