ETV Bharat / bharat

శబరిమలలో ఆంక్షల సడలింపు- మరింత మంది భక్తులకు అవకాశం

author img

By

Published : Dec 20, 2021, 12:24 PM IST

sabarimala
శబరిమలలో ఆంక్షల సడలింపు

Sabarimala News: శబరిమలలో ఆంక్షలు సడలిస్తున్నట్లు ప్రకటించింది అక్కడి ప్రభుత్వం. రోజుకు 60వేల మంది భక్తులు ఆలయాన్ని దర్శించుకునేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు పేర్కొంది.

Sabarimala News: కేరళలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో శబరిమల ఆలయంపై విధించిన ఆంక్షలను సడలించింది అక్కడి ప్రభుత్వం. మండల మకరవిలక్​ సీజన్ సందర్భంగా భక్తులు ఆలయంలో నెయ్యితో అభిషేకం చేసేందుకు అనుమతించింది. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 12 వరకు ఈ సడలింపు వర్తించనున్నట్లు అధికారులు వెల్లడించారు.

రోజుకు 60వేల మంది భక్తులను ఆలయ దర్శనానికి అనుమతిస్తున్నట్లు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కొవిడ్​ నిబంధనలను పాటిస్తూ భక్తులు అడవి మార్గం ద్వారా కూడా ప్రయాణించేందుకు అనుమతించింది. ఆదివారం నాటికి 8,11,235 మంది భక్తులు శబరిమలకు వచ్చినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ సీజన్​లో అత్యధికంగా శనివారం ఒక్కరోజే 42,870 మంది భక్తులు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.

ఇదీ చూడండి : మహిళా కానిస్టేబుళ్లపైకి కత్తిపీటతో దూసుకొచ్చి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.