ETV Bharat / bharat

రాజస్థాన్​లో సెంటిమెంట్ రిపీట్​- 'కమల' వికాసం- కాంగ్రెస్​కు నిరాశ!

author img

By ETV Bharat Telugu Team

Published : Nov 30, 2023, 5:39 PM IST

Updated : Nov 30, 2023, 10:02 PM IST

rajasthan assembly election 2023 exit polls
rajasthan assembly election 2023 exit polls

Rajasthan Election Exit Poll Results 2023 LIVE Updates : రాజస్థాన్​లో అధికార కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగిలేలా కనిపిస్తోంది. అధికార మార్పిడి సంప్రదాయం మరోసారి కొనసాగే అవకాశముంది. మెజారిటీ సంస్థలు విడుదల చేసిన ఎగ్జిట్​పోల్స్​ బీజేపీ అధికారంలో రానుందని అంచనా వేశాయి.

Rajasthan Election Exit Poll Results 2023 LIVE Updates : రాజస్థాన్​లో అధికార కాంగ్రెస్ పార్టీకి ఎదురుదెబ్బ తగలనుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. అధికార మార్పిడి సంప్రదాయం మరోసారి కొనసాగనుందని జోస్యం చెప్పాయి. కాంగ్రెస్ నుంచి బీజేపీ.. అధికార పీఠాన్ని వశం చేసుకుంటుందని తెలిపాయి.

రాజస్థాన్​లో మొత్తం 200 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. 199 స్థానాల్లో నవంబరు 25న పోలింగ్ జరిగింది. మొత్తం 51,000 పోలింగ్​ బూత్​ల్లో శనివారం రాత్రి 9 గంటల వరకు 70శాతం ఓటింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. కరణ్‌పుర్‌లో కాంగ్రెస్ అభ్యర్థి గుర్మీత్ సింగ్ ఆకస్మిక మృతితో అక్కడ ఎన్నిక వాయిదా పడింది. 199 స్థానాలకు 1,862 మంది అభ్యర్థులు బరిలో దిగారు.

Rajasthan Exit Poll
రిపబ్లిక్ టీవీ ఎగ్జిట్ పోల్స్​
Rajasthan Exit Poll
పీ మార్క్ ఎగ్జిట్ పోల్స్​
Rajasthan Exit Poll
యాక్సిస్​ మై ఇండియా ఎగ్జిట్ పోల్స్​
Rajasthan Exit Poll
టైమ్స్​నౌ - ఈటీజీ ఎగ్జిట్ పోల్స్​
Rajasthan Exit Poll
పీపుల్స్​ పల్స్​ ఎగ్జిట్ పోల్స్​
Rajasthan Exit Poll
ఇండియా టీవీ-సీఎన్​ఎక్స్ ఎగ్జిట్ పోల్స్​
Rajasthan Exit Poll
జన్​కీబాత్​ ఎగ్జిట్ పోల్స్​
Rajasthan Exit Poll
టీవీ9 - భారత్​వర్ష్​ ఎగ్జిట్ పోల్స్​

Dainik Bhaskar Exit Polls

  • భాజపా 98-105
  • కాంగ్రెస్‌ 85-95
  • ఇతరులు 10-15

భాజపాకే అధికార పీఠం!
మెజారిటీ ఎగ్జిట్​ పోల్స్ రాజస్థాన్​లో భాజపాకే అధికారం దక్కుతుందని అంచనా వేస్తున్నాయి. వివరాల్లోకి వేళ్తే..​ టైమ్స్‌నౌ-ఈటీజీ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం, భాజపా 108 నుంచి 128 స్థానాలను గెలుచుకుంటుంది. కాంగ్రెస్‌ 56 నుంచి 72 స్థానాలతో ప్రతిపక్షానికే పరమితం అవుతుంది. ఇతరులు 13 నుంచి 21 స్థానాలు గెలవచ్చని అంచనా వేసింది. టీవీ-9 భారత్‌ వర్ష్‌ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం, భాజపాకు 100 నుంచి 110 సీట్లు, కాంగ్రెస్‌కు 90 నుంచి 100 స్థానాలు వస్తాయి. ఇతరులు 5 నుంచి 15 చోట్ల గెలిచే అవకాశం ఉంది. జన్‌కీబాత్‌ ఎగ్జిట్‌ పోల్స్‌.. భాజపా 100 నుంచి 112 స్థానాలతో అధికారం సాధిస్తుందని అంచనా వేసింది. కాంగ్రెస్‌ 62 నుంచి 85 స్థానాలు సాధిస్తుందని పేర్కొంది. ఇతరులు 14 నుంచి 15 స్థానాలు గెలవచ్చని వివరించింది. పీపుల్స్‌ పల్స్‌ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం, భాజపా 95 నుంచి 115 స్థానాలు గెలుస్తుంది. కాంగ్రెస్‌ 73 నుంచి 95 సీట్లు, ఇతరులు 8 నుంచి 21 స్థానాలు గెలిచే అవకాశముందని తెలిపింది. దైనిక్​-భాస్కర్ ఎగ్జిట్​ పోల్స్​.. భాజపా 98 నుంచి 105, కాంగ్రెస్‌ 85 నుంచి 95, ఇతరులు 10 నుంచి 15 చోట్ల విజయం సాధించవచ్చని అంచనా వేసింది. పీ-మార్క్​ ఎగ్జిట్​ పోల్స్​.. భాజపా 105 నుంచి 125 స్థానాలు, కాంగ్రెస్‌ 69 నుంచి 91 చోట్ల, ఇతరులు 5 నుంచి 15 స్థానాల్లో విజయం సాధించవచ్చని పేర్కొంది.

Rajasthan Election 2018 Results : రాజస్థాన్​ అసెంబ్లీలో మొత్తం 200 సీట్లు ఉండగా.. కాంగ్రెస్​కు 100, బీజేపీకి 73 స్థానాల్లో గెలుపొందింది. బీఎస్పీ ఆరు స్థానాలు, ఇండిపెండెట్లు 13 స్థానాల్లో విజయం సాధించారు. అప్పుడు బీఎస్​పీ నుంచి గెలిచిన ఆరుగురు సభ్యులతో పాటు స్వతంత్రుల మద్దతుతో కాంగ్రెస్​ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.

ఛత్తీస్​గఢ్​లో మళ్లీ కాంగ్రెస్​కే అధికారం!- ఎగ్జిట్​ పోల్స్​ లెక్కలు ఇలా!!

మధ్యప్రదేశ్​లో బీజేపీ, కాంగ్రెస్​ మధ్య హోరాహోరీ- ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్పాయంటే?

Last Updated :Nov 30, 2023, 10:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.