ETV Bharat / bharat

మోదీ నిర్ణయం కరెక్ట్​.. నేను చెప్పినట్టే చేశారు: రాహుల్​

author img

By

Published : Dec 26, 2021, 10:59 AM IST

Updated : Dec 26, 2021, 12:02 PM IST

Rahul Gandhi on booster dose
Rahul Gandhi on booster dose

Rahul Gandhi on booster dose: కొవిడ్ బూస్టర్ డోసులు పంపిణీ చేయాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరైనదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పేర్కొన్నారు. తన సిఫార్సులను స్వీకరించిందని తెలిపారు.

Rahul Gandhi booster dose: కరోనా టీకా బూస్టర్ డోసు పంపిణీ విషయంలో కేంద్ర ప్రభుత్వం తన సిఫార్సులను స్వీకరించిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చెప్పుకొచ్చారు. తన సూచనలను ఆమోదించి.. బూస్టర్ డోసులు పంపిణీ చేసేందుకు ముందుకొచ్చిందని అన్నారు. దేశంలోని ప్రతి పౌరుడికీ టీకా/బూస్టర్ డోసు అందాలని ఆకాంక్షించారు.

Booster dose in India

శనివారం దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించిన మోదీ.. హెల్త్​కేర్, ఫ్రంట్​లైన్ వర్కర్లకు బూస్టర్ డోసు అందించాలని నిర్ణయించినట్లు ప్రకటించారు. జనవరి 10 నుంచి 'ప్రికాషన్ డోసు' పేరుతో వీటిని పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ స్పందిస్తూ ట్వీట్ చేశారు. కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతించారు. ఇది సరైన దిశలో ముందడుగు అని పేర్కొన్నారు.

"బూస్టర్ డోసు విషయంలో నేను ఇచ్చిన సలహాలను కేంద్ర ప్రభుత్వం స్వీకరించింది. ఇది సరైన ముందడుగు. దేశంలో ప్రతి పౌరుడికీ బూస్టర్/టీకా రక్షణ లభించాలి."

-రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్రనేత

ఈ ట్వీట్​కు డిసెంబర్ 22న చేసిన తన ట్వీట్​ను జోడించారు రాహుల్. దేశంలోని మెజారిటీ జనాభాకు టీకాలు దక్కలేదని, బూస్టర్ డోసులు ఎప్పుడు ప్రారంభిస్తారని ఆ ట్వీట్​లో ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

ఇదీ చదవండి: Vaccination for Children: జనవరి 3 నుంచి పిల్లలకు టీకా

Last Updated :Dec 26, 2021, 12:02 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.