ETV Bharat / bharat

అమరీందర్​ను తొలగించడానికి కారణం అదే.. : ప్రియాంక

author img

By

Published : Feb 13, 2022, 10:21 PM IST

Priyanka
ప్రియాంకా గాంధీ వాద్రా

Punjab Election 2022: అమరీందర్​ సింగ్​ నాయకత్వంలో పంజాబ్ ప్రభుత్వాన్ని దిల్లీలోని భాజపా నడిపిందని కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంకా గాంధీ వాద్రా ఆరోపించారు. అందుకే ఆ ప్రభుత్వాన్ని తొలగించాల్సి వచ్చిందని చెప్పారు. ఆమ్​ ఆద్మీ పార్టీ 'ఆర్​ఎస్​ఎస్​' నుంచి ఆవిర్భవించిందని అన్నారు ప్రియాంక.

Punjab Election 2022: పంజాబ్​లో అమరీందర్ సింగ్ ప్రభుత్వాన్ని దిల్లీలోని భాజపా నడిపించిందని ఆరోపించారు కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంకా గాంధీ. అందుకే అమరీందర్​ను తొలిగించాల్సి వచ్చిందని అన్నారు. ఆమ్​ ఆద్మీ పార్టీ 'ఆర్​ఎస్​ఎస్​'నుంచి ఆవిర్భవించిందని తీవ్ర విమర్శలు చేశారు ప్రియాంక. పంజాబ్​లోని కొట్కాపురాలో నిర్వహించిన బహిరంగ సభలో ప్రియాంక ప్రసంగించారు.

ఆమ్​ ఆద్మీ పార్టీ దిల్లీలో చేసిందేమీ లేదని.. అది ఒక 'ఓటమి పాలైన ప్రభుత్వం' అని మండిపడ్డారు.

"ఆమ్​ఆద్మీ పార్టీ దిల్లీ మోడల్ అంటోంది. భాజపా కూడా గుజరాత్ మోడల్ అంటూనే 2014లో కేంద్రంలో అధికారంలోకి వచ్చింది. కానీ ఆ పార్టీల నిజస్వరూపం ఇప్పుడు ప్రజల ముందు ఉంది. కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్​ ఆర్​ఎస్​ఎస్​ నుంచి ఆవిర్భవించింది. భాజపా సిద్ధాంతాన్నే ఆప్ ఆచరిస్తోంది" అని ప్రియాంకా గాంధీ ఆమ్ ఆద్మీ పార్టీపై నిప్పులు చెరిగారు.

'దిల్లీ నుంచి నడిపించారు...'

అమరీందర్ నాయకత్వంలోని పంజాబ్ ప్రభుత్వం దిల్లీ నుంచి నడిచిందని ఆరోపించారు ప్రియాంక.

"ఐదేళ్లపాటు మా ప్రభుత్వం పంజాబ్​లో ఉంది. కానీ ఎక్కడో తప్పు జరిగింది. ఆ ప్రభుత్వం పంజాబ్​ నుంచి పరిపాలించడం ఆగిపోయింది. దిల్లీ నుంచి నడవడం మొదలు పెట్టింది. అది కూడా కాంగ్రెస్​తో కాదు భాజపా నేతృత్వంలో! ఆ విషయాన్ని గ్రహించే ఆ ప్రభుత్వాన్ని మార్చాం" అని మాజీ సీఎం అమరీందర్ సింగ్, భాజపాపై పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు ప్రియాంకాగాంధీ.

చన్నీ ప్రజల్లోంచి వచ్చిన నాయకుడని.. అధికారంలోకి వచ్చిన 100-150 రోజుల్లోనే ఎంతో చేశారని అన్నారు. ఆప్​ రూపంలో మళ్లీ దిల్లీ నుంచి పంజాబ్​ను శాసించాలని భాజపా చూస్తోందని.. అందుకే ఆప్​కు మద్దతు ఇవ్వొద్దని ప్రియాంకా గాంధీ సూచించారు.

చన్నీ నాయకత్వంలో పంజాబ్​లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే.. ఒక్కో కుటుంబానికి ఏడాదికి 8 గ్యాస్ సిలిండర్​లు ఉచితంగా ఇస్తామన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో రూ. 20 లక్షల వరకు ఉచిత వైద్య సౌకర్యం కల్పిస్తామని తెలిపారు.

117 అసెంబ్లీ స్థానాలున్న పంజాబ్​లో ఫిబ్రవరి 20న ఎన్నికలు జరగనున్నాయి. ఓట్ల లెక్కింపు మార్చి 10న జరగనుంది.

ఇవీ చూడండి:

టికెట్ల వేటలో నేతల వలసలు- వేడెక్కిన పంజాబ్‌ రాజకీయాలు!

రాహుల్​పై అనుచిత వ్యాఖ్యలను సమర్థించుకున్న సీఎం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.