ETV Bharat / bharat

గోధుమ వర్ణ కశ్మీర్​లో ప్రీ వెడ్డింగ్​ షూట్​ సందడి.. ఇప్పటికే 1.62 కోట్ల పర్యటకుల రాక

author img

By

Published : Nov 15, 2022, 2:19 PM IST

Pre wedding shoots in Kashmir
Pre wedding shoots in Kashmir

కశ్మీర్​ అందాలను చూసి ముగ్ధులవ్వని వారు ఎవరుంటారు. మరీ ముఖ్యంగా శరద్​ రుతువులో ఆ ప్రకృతి సోయగం మామూలుగా ఉండదు. ఎంతో మంది పర్యటకులను ఆకర్షించే ఈ ప్రాంతం ప్రస్తుతం ప్రీ వెడ్డింగ్​ షూట్లకు నెలవుగా మారింది. ఆ గోధుమ వర్ణ శోభను తమ కెమెరాలో బంధించేందుకు కశ్మీర్​కు తరలివస్తున్నారు ప్రకృతి ప్రేమికులు.

కశ్మీర్​లో శరద్​ రుతువు శోభ

ప్రకృతి అందాలకు నెలవైన కశ్మీర్​కు పర్యటకుల తాకిడి అధికంగా ఉంటుంది. సాధారణం కంటే శరద్​ కాలంలో ఈ ప్రాంతానికి వచ్చే వారి సంఖ్య మరింత ఎక్కువగా ఉంటుంది. కశ్మీర్​ అందాలకు ముగ్ధులయ్యే పర్యటకులు ప్రత్యేక ఫొటో షూట్ల కోసం తరలివస్తున్నారు. పచ్చని ఆకులతో హరిత వర్ణంలో కనిపించే కశ్మీర్..​ ఈ కాలంలో ఆకులు రాలుతూ గోధుమ వర్ణంలో దర్శనమిస్తుంది. దీంతో ఆ సోయగాన్ని తిలకించేందుకు దేశం నలమూలల నుంచి పకృతి ప్రేమికులు ఇక్కడికి చేరుకుంటున్నారు.

ముఖ్యంగా మన సినిమాల్లో చూపించే కశ్మీర్​ అందాలను చూసిన అభిమానులు.. దాన్ని రియల్​ లైఫ్​లోనూ చూసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఆ సినిమాలను​ ఆదర్శంగా తీసుకుని మరి ప్రీ వెడ్డింగ్​ ఫొటో షూట్ల కోసం వస్తున్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చి మరి మధుర క్షణాలను కెమెరాల్లో బంధిస్తున్నారు. అంతే కాకుండా సోషల్​ మీడియా ఇన్​ఫ్లుయెన్సర్లు, వ్లాగర్లు, అలాగే బ్రాండ్​ మార్కెటర్లు ఈ ప్రకృతి అందాలను తమ వీక్షకులకు చూపించేందుకు పర్యటిస్తున్నారు. కశ్మీర్​లోని ప్రముఖ ప్రాంతాలైన నిషాత్ బాఘ్​ అలాగే దాచిగామ్ నేషనల్ పార్క్​లకు వచ్చే సందర్శకులు అక్కడే తమ ఫొటో షూట్లను నిర్వహించేందుకు ఇష్టపడుతున్నారు.

Pre wedding shoots in  Kashmir
కశ్మీర్​ అందాలను ఆస్వాదిస్తున్న టూరిస్ట్​

ఈ ఏడాది మొత్తం వచ్చిన సందర్శకుల సంఖ్య 1.62 కోట్లకు చేరుకుందని శ్రీనగర్​ పరిపాలన సీనియర్ అధికారి తెలిపారు. గత నెలలో ఈ ప్రాంతాలన్నీ భారీ జనసందోహంతో నిండిపోయారని.. ముఖ్యంగా మొఘల్ గార్డెన్స్‌లో ప్రతిరోజూ అనేక ప్రీ వెడ్డింగ్ షూట్లు​ జరుగుతాయన్నారు. శరద్​ రుతువులో తమ ఉత్పత్తుల కోసం ప్రచార వీడియోలతో పాటు ఫోటోలను చిత్రీకరించడానికి పెద్ద బ్రాండ్‌లు ఇక్కడికి వస్తుంటాయని అధికారులు పేర్కొన్నారు.

Pre wedding shoots in  Kashmir
ఫోటో షూట్​లో పెళ్లి జంట
Pre wedding shoots in  Kashmir
జంటను కెమెరాలో బంధిస్తున్న వెడ్డింగ్​ షూటర్లు
Pre wedding shoots in  Kashmir
ప్రీ వెడ్డింగ్​ షూట్​లో జంట
Pre wedding shoots in  Kashmir
ఫొటో షూట్లతో నిండిపోయిన కశ్మీర్​

ఇదీ చదవండి:పెళ్లిచూపుల జాతర.. 250 మంది అమ్మాయిల కోసం 11వేల మంది యువకుల పోటీ

ఒకేసారి రెండు చేతులతో రాస్తూ.. ఐదారు భాషల్లో స్పీచ్​ దంచికొట్టే సూపర్​కిడ్స్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.