ETV Bharat / bharat

ఈశాన్య రాష్ట్రాల్లో ఆ చట్టం ఎత్తివేత: ప్రధాని మోదీ

author img

By

Published : Apr 28, 2022, 1:19 PM IST

PM Modi Assam Rally
ప్రధాని మోదీ

Modi News: సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని ఈశాన్య రాష్ట్రాల్లో పూర్తిగా ఎత్తివేయనున్నట్లు వెల్లడించారు ప్రధాని నరేంద్ర మోదీ. అసోంలో నిర్వహించిన ర్యాలీలో ఈ విషయాన్ని తెలిపారు. ఈ ప్రాంతంలో శాంతిభద్రతలు మెరుగుపడినందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.

PM Modi Assam Rally: అసోం కర్బీ ఆంగ్లాంగ్ జిల్లా దిఫులో 'శాంతి, ఐక్యత, అభివృద్ధి' పేరుతో నిర్వహించిన ర్యాలీకి హాజరయ్యారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఆరోగ్య, విద్యా రంగానికి సంబంధించిన వెటర్నరీ కాలేజ్, డిగ్రీ కాలేజ్​, అగ్రికర్చర్ కాలేజీ వంటి ముఖ్యమైన ప్రాజెక్టులను ప్రారంభించారు. అనంతరం భారీ సంఖ్యలో వచ్చిన ప్రజలను ఉద్దేశించి సభలో మాట్లాడారు. అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మతో పాటు ఇతర భాజపా నేతలు ఈ ర్యాలీలో పాల్గొన్నారు.

"అసోం అభివృద్ధికి భాజపా కట్టుబడి ఉంది. రూ.1000కోట్లు విలువ చేసే ప్రాజెక్టులకు ఇవాళ శంకుస్థాపన జరిగింది. రాష్ట్రంలో డబుల్​ ఇంజిన్ ప్రభుత్వం అధికారంలో ఉంది. అభివృద్ధి, నమ్మకమే మా విధానం. సబ్​కా సాత్​, సబ్​కా వికాస్​, సబ్​కా విశ్వాస్​, సబ్​కా ప్రయాస్​ లక్ష్యంతోనే ముందుకుసాగుతున్నాం. అసోంలోని 23 జిల్లాలో సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని(AFSPA) తొలగించాం. ఈశాన్యంలో శాంతి భద్రతలు మెరుగపడినందువల్లే ఈ నిర్ణయం తీసుకున్నాం. సబ్​కా సాత్, సబ్​కా వికాస్ స్ఫూర్తితోనే సరిహద్దు సంబంధిత సమస్యలకు పరిష్కారాలు వెతుకుతున్నాం. అసోం, మేఘాలయ మధ్య కుదిరిన ఒప్పందం ఇతరులనూ ప్రోత్సహిస్తుంది. అసోంను శాశ్వతంగా శాంతియుత రాష్ట్రంగా మారుస్తాం. "

- ప్రధాని మోదీ.

ఈ సందర్భంగా మొత్తం ఈశాన్య ప్రాంతంలోనే సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని ఎత్తివేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు మోదీ వెల్లడించారు. గత 8 ఏళ్లలో ఇక్కడి పరిస్థితులు మెరుగుపడ్డాయని చెప్పారు. నాగాలాండ్, అసోం, మణిపుర్​లోని చాలా ప్రాంతాల్లో AFSPA చట్టాన్ని ఏప్రిల్​ 1న ఎత్తివేసింది కేంద్రం. దశాబ్దాల తర్వాత వీటిని శాంతియుత ప్రదేశాలుగా ప్రకటించింది.

ఇదీ చదవండి: 'సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీసేలా ప్రధాని వ్యాఖ్యలు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.