ETV Bharat / bharat

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు - ముగిసిన నామినేషన్ల ప్రక్రియ

author img

By ETV Bharat Telugu Team

Published : Nov 10, 2023, 3:53 PM IST

Updated : Nov 10, 2023, 8:15 PM IST

Nominations Process Concluded in Telangana
Nominations Process Concluded in Telangana

15:51 November 10

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు-ముగిసిన నామినేషన్ల ప్రక్రియ

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు - ముగిసిన నామినేషన్ల ప్రక్రియ

Nominations Process Concluded in Telangana : రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల్లో కీలకమైన నామినేషన్ల దాఖలు ఘట్టం ముగిసింది. ఏకాదశి సందర్భంగా ఒక రోజు ముందుగానే ప్రధాన పార్టీలకు చెందిన చాలా మంది అభ్యర్థులు నామినేషన్‌(Telangana Election Namination) వేయగా.. మిగిలిన వారందరూ చివరి రోజు భారీగా నామపత్రాలు దాఖలు చేశారు. కాంగ్రెస్‌, బీజేపీలు చివరి వరకు బీఫాంల విషయంలో స్పష్టత లేక కార్యకర్తలు, నేతల్లో గందరగోళం నెలకొంది. మధ్యాహ్నం 3 గంటల్లోగా నామినేషన్‌ వేసేందుకు సంబంధిత ఆర్వో కార్యాలయానికి వెళ్లి లైన్‌లో ఉన్న అభ్యర్థులను నామినేషన్‌ వేసేందుకు అధికారులు అనుమతించారు.

కామారెడ్డిలో నామినేషన్‌ వేసిన రేవంత్‌ రెడ్డి : పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కామారెడ్డిలో నామినేషన్(Revanthreddy Namination in Kamareddy) వేశారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, పార్టీ నేతలతో కలిసి ఆర్వో కార్యాలయానికి వెళ్లిన ఆయన.. ఆర్వోకు నామపత్రాలు అందజేశారు. పీసీసీ అధ్యక్షుడి నామినేషన్ సందర్భంగా కామారెడ్డిలో కాంగ్రెస్‌ కార్యకర్తలు భారీ ర్యాలీ(Congress Rally) నిర్వహించారు. ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గం బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ నామినేషన్‌ వేశారు. ఎంపీ నామా నాగేశ్వరరావుతో కలిసి ఆర్వో కార్యాలయానికి వెళ్లిన పువ్వాడ.. నామపత్రాలు సమర్పించారు. నిజామాబాద్ అర్బన్ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి బిగాల గణేశ్‌ గుప్తా నామినేషన్‌ దాఖలు కార్యక్రమంలో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. మెదక్ జిల్లా నర్సాపూర్ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి సునీతా లక్ష్మారెడ్డి నామినేషన్‌ కార్యక్రమానికి ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు హాజరయ్యారు. నర్సాపూర్‌లో రోడ్‌షోలో పాల్గొన్న మంత్రి.. అభివృద్ధి కొనసాగాలంటే కారుకు ఓటేయాలని కోరారు.

చివరి నిమిషంలో అభ్యర్థులను మార్చిన బీజేపీ - కంటతడి పెట్టుకున్న నేతలు

Telangana Election 2023 : యాదాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న గొంగిడి సునీత.. ఆలేరులో బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా నామినేషన్‌ వేశారు. భద్రకాళీ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన దాస్యం వినయ్‌భాస్కర్.. వరంగల్ పశ్చిమ నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా నామపత్రాలు దాఖలు చేశారు. గద్వాలలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి సరిత నామినేషన్లు వేశారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం అభ్యర్థి, మంత్రి సబితాఇంద్రారెడ్డి నామినేషన్‌ సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించారు. కర్మన్‌ఘాట్‌ ఆంజనేయస్వామి ఆలయంలో పూజలు నిర్వహించిన సబిత.. తీగల కృష్ణారెడ్డితో కలిసి ర్యాలీగా వెళ్లారు. ఈ క్రమంలో ట్రాఫిక్‌లో చిక్కుకున్న మంత్రి.. ప్రచారరథం దిగి వాహనాలను మళ్లించారు. నామినేషన్‌ గడువు ముగుస్తుండటంతో ఆమె వ్యక్తిగత సిబ్బంది దాఖలు చేశారు.

మునుగోడు అభ్యర్థిగా కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి నామినేషన్‌ : సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో కాంగ్రెస్‌ నేత ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, తుంగతుర్తి కాంగ్రెస్‌ అభ్యర్థిగా మందుల సామెలు, కామారెడ్డి జిల్లా బాన్సువాడలో కాంగ్రెస్ అభ్యర్థి ఏనుగు రవీందర్‌రెడ్డి నామినేషన్‌ వేశారు. నల్గొండ జిల్లా చండూరులో మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి నామినేషన్‌ వేశారు. సనత్‌నగర్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి కోట నీలిమ నామినేషన్‌ సందర్భంగా మోండా మార్కెట్‌ నుంచి సికింద్రాబాద్ మున్సిపల్‌ కార్యాలయం వరకు హస్తం శ్రేణులు ర్యాలీ నిర్వహించారు. కొత్తగూడెం కాంగ్రెస్‌ టికెట్‌ దక్కకపోవటంతో ఆ పార్టీ నేత జలగం వెంకట్‌రావు ఆలిండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ నుంచి నామినేషన్‌ వేస్తున్నారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ సీపీఎం అభ్యర్థి జూలకంటి రంగారెడ్డి నామినేషన్‌ సందర్భంగా పట్టణంలో ఆ పార్టీ కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు.

చివరి నిమిషంలో తారుమారు - ఆశ రేపారు, అంతలోనే ఉసూరుమనిపించారు

Political Parys Nominations in Telangana : హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌ బీజేపీ అభ్యర్థి లంకల దీపక్‌రెడ్డి నామినేషన్‌ కార్యక్రమంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా యూసఫ్‌గూడ నుంచి బీజేపీ కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. గద్వాలలో పార్టీ అభ్యర్థి బోయ శివ.. డీకే అరుణతో కలిసి వెళ్లి, నామపత్రాలు దాఖలు చేశారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ బీజేపీ అభ్యర్థి యెండల లక్ష్మీనారాయణ నామినేషన్‌ కార్యక్రమంలో కేంద్ర మంత్రి అర్జున్‌ముండా పాల్గొన్నారు. నిర్మల్‌లో బీజేపీ అభ్యర్థి ఏలేటి మహేశ్వర్‌రెడ్డి నామినేషన్‌ సందర్భంగా పట్టణం కాషాయమయమైంది. నిజామాబాద్ గ్రామీణ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి దినేష్ కులచారి నామినేషన్‌ కార్యక్రమంలో ఆ పార్టీ ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్‌ ఈటల రాజేందర్‌ పాల్గొన్నారు. బీసీలకు రాజ్యాధికారం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్న తమ పార్టీకి వెనకబడిన వర్గాలు అండగా నిలవాలని ఈటల కోరారు.

కామారెడ్డిలో నామినేషన్​ వేసిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్​రెడ్డి

రాష్ట్రవ్యాప్తంగా జోరుగా నామినేషన్లు, భారీ ర్యాలీలతో అభ్యర్థుల హంగామా

Last Updated : Nov 10, 2023, 8:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.