చివరి నిమిషంలో అభ్యర్థులను మార్చిన బీజేపీ - కంటతడి పెట్టుకున్న నేతలు

By ETV Bharat Telangana Desk

Published : Nov 10, 2023, 5:06 PM IST

thumbnail

BJP MLA Candidates Change Last Minute : బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థుల విషయంలో చివరి నిమిషంలో మార్పు రావడంతో అప్పటివరకు టికెట్​ వచ్చిందనుకున్న అభ్యర్థులు తీవ్ర నిరాశకు గురయ్యారు. దీంతో వారు స్వతంత్రంగా పోటీ చేసేందుకు నామినేషన్లు వేశారు. సంగారెడ్డి బీజేపీ టికెట్ పక్కా అని చెప్పిన రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి.. మాట మార్చి మరొకరికి బీ-ఫామ్ ఎలా ఇస్తారని బీజేపీ నాయకుడు రాజేశ్వేర్‌రావు ధేశ్‌పాండే (Rajeshwer Rao Deshpande Fire on Kishan Reddy) ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ పేరుతో పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటానన్నారు. ఇచ్చిన లిస్టులో తన పేరు ఉంటే చివరి నిమిషంలో బీ-ఫామ్ వేరే వాళ్ల చేతిలో ఎలా పెడతారంటూ కన్నీటి పర్యంతమయ్యారు.

Tula Uma Crying not Given BJP MLA Candidate : మరోవైపు రాజన్న సిరిసిల్ల జిల్లాలోనూ చివరి నిమిషంలో వేములవాడ టికెట్​ను బీజేపీ అధిష్ఠానం మార్చింది. ఇవాళ ఉదయం బీజేపీ అభ్యర్థిగా తుల ఉమ నామినేషన్ వేశారు. నామినేషన్​ వేసిన కొద్దిసేపటికే బీజేపీ అభ్యర్థిగా వికాస్​రావు అదే నియోజకవర్గంలో నామినేషన్ వేశారు. ఈ విషయం తెలుసుకున్న ఉమ కంటతడి పెట్టుకున్నారు. బీసీ మహిళలంటే పార్టీలో గౌరవం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దొరల పాలనకు వ్యతిరేకంగా కొట్లాడినందుకే తనకు టికెట్​ నిరాకరించారని ఆమె ఆరోపించారు. అభ్యర్థిని మార్చినట్టు కనీసం సమాచారం ఇవ్వకపోవడం దారుణమని మండిపడ్డారు. దొరలకు వ్యతిరేకంగా ఆనాడు పోరాడానని.. ఇప్పుడూ పోరాడుతానని స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.