ETV Bharat / bharat

ఐసిస్​​ ఉగ్రవాదిని దోషిగా తేల్చిన ఎన్​ఐఏ కోర్టు

author img

By

Published : Nov 17, 2021, 9:13 PM IST

kerala youth isis
ఎన్​ఐఏ

ఐసిస్​లో చేరి ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడిన కేరళకు (NIA ISIS Kerala) చెందిన నషీదుల్​ హమ్జాఫర్​ను దోషిగా తేల్చింది ఎన్​ఐఏ కోర్టు. తదుపరి విచారణను ఈనెల 23కి వాయిదా వేసింది.

ఉగ్రవాద సంస్థ ఐఎస్​ఐఎస్(ఐసిస్)​లో చేరిన 14 మంది కేరళ యువకుల కేసులో ప్రత్యేక ఎన్​ఐఏ కోర్టు.. నషీదుల్​ హమ్జాఫర్​ (NIA ISIS Kerala) అనే నిందితుడిని దోషిగా తేల్చింది. కేరళలోని ఎర్నాకులంలో బుధవారం జరిగిన విచారణలో భాగంగా న్యాయస్థానం ఈ తీర్పును (NIA ISIS Kerala) వెల్లడించింది. దోషికి విధించే శిక్షపై తదుపరి విచారణను కోర్టు ఈనెల 23కి వాయిదా వేసింది.

కాసరగోడ్​ జిల్లాకు చెందిన నషీదుల్​ హమ్జాఫర్ .. రషీద్​ అబ్దుల్లా, అష్​ఫక్​ మజీద్​ సహా పలువురు నిందితులతో (NIA ISIS Kerala) 2017 అక్టోబరు 3న విదేశాలకు వెళ్లిన హమ్జాఫర్​ కాబుల్​లో పట్టుబడ్డాడు. 2018 సెప్టెంబరులో ఎన్​ఐఏ హమ్జాఫర్​ను అరెస్ట్​ చేసి భారత్​కు తీసుకువచ్చింది. ​

బెంగళూరులో..

మరోవైపు, ఐఎస్​ఐఎస్​తో సంబంధం ఉందన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న జుహబ్​ హమీద్​ షకీల్​ మన్నా (32) అనే వ్యక్తిని ఎన్​ఐఏ అరెస్ట్ చేసింది. ఉగ్రవాద సంస్థతో సంబంధం ఉన్న మిగతా నిందితులతో కలిసి సంస్థకు విరాళాలు సేకరించేవాడని అధికారులు వెల్లడించారు. అంతేకాకుండా ఓ మతానికి చెందిన యువకులను ఐఎస్​ఐఎస్​లో చేరే విధంగా ప్రేరేపించి, వారిని సిరియాకు తరలించేవాడని తెలిపారు.

ఇదీ చూడండి : దేశంలోనే తొలి ఆహార మ్యూజియం.. అందరికీ అవగాహనే లక్ష్యం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.