ETV Bharat / bharat

సిద్ధూ రాజీనామా ఉపసంహరణ- ఆ పని అయ్యాకే బాధ్యతల స్వీకరణ!

author img

By

Published : Nov 5, 2021, 5:29 PM IST

Navjot Singh Sidhu
సిద్ధూ రాజీనామా వెనక్కి

పంజాబ్​ పీసీసీ అధ్యక్షుడిగా కొనసాగనున్నట్లు కాంగ్రెస్​నేత నవజ్యోత్​ సింగ్​ సిద్ధూ (Navjot Singh Sidhu) ప్రకటించారు. రాజీనామాను వెనక్కి తీసుకుంటున్నట్లు శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో వెల్లడించారు.

పంజాబ్​ పీసీసీ అధ్యక్ష​ పదవికి రాజీనామాపై ఆ పార్టీ నాయకుడు నవజ్యోత్​ సింగ్​ సిద్ధూ (Navjot Singh Sidhu) వెనక్కి తగ్గారు. తాను చేసిన రాజీమాను వెనక్కు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. అయితే.. కొత్త అడ్వకేట్​ జనరల్​ను ప్రభుత్వం నియమించిన రోజే.. తాను అధ్యక్ష బాధ్యతలు చేపడతానని స్పష్టం చేశారు.

"నా రాజీనామాను వెనక్కు తీసుకున్నాను. కొత్త అడ్వకేట్​ జనరల్​ను నియమించి, కొత్త ప్యానల్​ ఏర్పాటు అయిన రోజే.. నా ఆఫీస్​లో బాధ్యతలు స్వీకరిస్తాను. ఇది అహంకారంతో చేస్తున్న పని ఏ మాత్రం కాదు."

- నవజ్యోత్ సింగ్​ సిద్ధూ, పీపీసీసీ అధ్యక్షుడు

పంజాబ్​ కొత్త సీఎం చరణ్​జీత్ సింగ్ చన్నీ... తన ఆలోచనలకు విరుద్ధంగా స్వతంత్రంగా వ్యవహరించడం, స్వయంగా తాను ఎంపిక చేసిన వ్యక్తులకే కీలక బాధ్యతలు అప్పగించడం లాంటి పనులతో సిద్ధూ మనస్తాపానికి గురయ్యారు. అడ్వకేట్ జనరల్​ నియామకంపైనా అసహనంగా ఉన్నారు. అన్మోల్​ రతన్​కు ఆ బాధ్యతలు అప్పగించాలని ఆయన సూచించారు. కానీ చన్నీ మాత్రం ఏపీఎస్​ దేఓల్‌ను ఎంపిక చేశారు. దీంతో అసహనానికి గురైన సిద్ధూ సెప్టెంబర్​ 28న పీసీసీ పదవికి రాజీనామా చేశారు.

ఇవీ చూడండి:

పంజాబ్​ పీసీసీ చీఫ్​గా కొనసాగనున్న సిద్ధూ..

పట్టువీడని సిద్ధూ.. కేబినెట్​ భేటీపైనే అందరి దృష్టి

కాంగ్రెస్​కు మరో షాక్- పీసీసీ చీఫ్​ పదవికి సిద్ధూ రాజీనామా

'సిద్ధూ వెంటే మేము'.. పంజాబ్ మంత్రుల వరుస రాజీనామాలు!

Sidhu news: 'వ్యక్తిగతంగా ఎవరిపైనా వైరం లేదు.. ప్రజల కోసమే'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.