ETV Bharat / bharat

'ఆదిపురుష్​' సినిమా సెట్​లో భారీ అగ్ని ప్రమాదం

author img

By

Published : Feb 2, 2021, 6:58 PM IST

Updated : Feb 2, 2021, 7:59 PM IST

Mumbai: Fire breaks out at a studio in Goregaon, 8 fire tenders present at the spot
'ఆదిపురుష్​' సినిమా సెట్​లో భారీ అగ్ని ప్రమాదం

ముంబయిలో ఓ మాల్​ నిర్మించిన 'ఆదిపురుష్'​ సినిమా సెట్​లో అగ్ని ప్రమాదం సంభవించింది. అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి హాని జరగలేదని అధికారులు తెలిపారు. అగ్నిమాపక సిబ్బంది.. మంటలను అదుపు చేశారు.

మహారాష్ట్ర ముంబయిలో 'ఆదిపురుష్' సినిమా సెట్​లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. డార్లింగ్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతోన్న ఈ చిత్రం షూటింగ్​ కోసం గోరేగావ్​లోని ఓ మాల్​లో భారీ స్థాయిలో నిర్మించిన సెట్​లో మంటలు చెలరేగాయి.

'ఆదిపురుష్​' సినిమా సెట్​లో భారీ అగ్ని ప్రమాదం

ప్రమాదం జరిగినప్పుడు ఘటనా స్థలంలో ప్రభాస్​, సైఫ్​ అలీ ఖాన్​ లేరని... దర్శకుడు ఓమ్​ రౌత్​ సహా కొంతమంది సిబ్బంది మాత్రమే ఉన్నట్లు సమాచారం. అయితే ఎవరికీ ఎలాంటి హాని జరగలేదని అధికారులు తెలిపారు.

Mumbai: Fire breaks out at a studio in Goregaon, 8 fire tenders present at the spot
సినిమా సెట్​లో చెలరేగిన మంటలు

సాయంత్ర 4.10 నిమిషాలకు మంటలు అంటుకున్నట్లు తెలుస్తోంది. దీంతో పరిసర ప్రాంతాల్లో దట్టంగా పొగ అలుముకుంది.

Mumbai: Fire breaks out at a studio in Goregaon, 8 fire tenders present at the spot
కారుమబ్బుల కమ్ముకున్న పొగ

8 అగ్నిమాపక యంత్రాలు, 6 వాటర్​ ట్యాంకులతో మంటలు అదుపు చేశారు. అయితే మంటలు చెలరేగడానికి కారణం ఇంకా తెలియరాలేదు.

ఇదీ చూడండి: 'రక్షణ రంగ కేటాయింపుల్లో 60 ఏళ్ల రికార్డ్ రిపీట్!'

Last Updated :Feb 2, 2021, 7:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.