ETV Bharat / bharat

భాజపా టికెట్​పై అఖిలేశ్​​ సోదరి పోటీ

author img

By

Published : Apr 8, 2021, 5:53 PM IST

Mulayam's niece opts for BJP ticket
సమాజ్​వాదీ కుటుంబీకురాలు భాజపా తరుపున పంచాయతీ ఎన్నికల్లో పోటీ

సమాజ్​వాదీ పార్టీ స్థాపకుడు ములాయం సింగ్​ యాదవ్​ సోదరుని కుమార్తె సంధ్యా యాదవ్​.. స్థానిక సంస్థల ఎన్నికల్లో భాజపా నుంచి పోటీచేస్తున్నారు. సమాజ్​వాదీకి కంచుకోటగా పోరొందిన మైన్​పురీ జిల్లా పంచాయతీ​ ఎన్నికల్లో కమలదళం తరఫున బరిలోకి దిగారు.

యూపీలో సమాజ్​వాదీ పార్టీకి ఇబ్బందికర పరిస్థితి ఎదురైంది. పార్టీ స్థాపకుడు ములాయం సింగ్​ యాదవ్​ సోదరుని కుమార్తె సంధ్యా యాదవ్​.. జిల్లా పంచాయతీ ఎన్నికల్లో భాజపా అభ్యర్థిగా పోటీకి దిగారు. సమాజ్​వాదీ పార్టీకి కంచుకోటగా పేరొందిన మైన్​పురీ నుంచి కమలదళం తరఫున బుధవారం నామినేషన్​ దాఖలు చేశారు. ఏప్రిల్​ 19న పోలింగ్​ జరగనుంది.

భర్త అడుగుజాడల్లోనే..

2017లో సమాజ్​వాదీ పార్టీని వీడి శివపాల్​ యాదవ్​ కొత్త పార్టీని స్థాపించారు. ఆ సమయంలోనే సంధ్యా యాదవ్​ భర్త అనుజేష్​ యాదవ్.. శివపాల్​కు సన్నిహితంగా మెలిగారు. జిల్లా పంచాయతీ అధ్యక్షుడు, సమాజ్​వాదీ నాయకుడు విజయ్ ప్రతాప్​పై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై సంతకం చేశారు. దీంతో అనుజేష్​ యాదవ్​ను సమాజ్​వాదీ పార్టీ బహిష్కరించింది. అప్పటినుంచి సమాజ్​వాదీకి అనుజేష్​ దంపతులు దూరమయ్యారు.

సంధ్యాయాదవ్​ భాజపా నుంచి పోటీ చేసి గెలుస్తారు. నా తల్లి ఊర్మిళా యాదవ్​ ఘిరోర్​ నుంచి రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచారు. అక్కడ మాకు ప్రజల మద్దతు ఉంది.

--అనుజేష్​ యాదవ్​

సంధ్యా యాదవ్​ను సమాజ్​వాదీ పార్టీ రాజకీయ ప్రత్యర్థిగా పరిగణిస్తుంది. మా పార్టీకి సొంత అభ్యర్థి ఉన్నారు. ఆయన విజయం కోసం మేము పనిచేస్తాము.

--తేజ్​ ప్రతాప్​ యాదవ్​, సమాజ్​వాదీ పార్టీ మాజీ ఎంపీ​

ములాయం సింగ్​ యాదవ్​ సైతం ప్రధాని నరేంద్ర మోదీని పార్లమెంట్​లో కొనియాడారు. సంధ్యా యాదవ్​ మా పార్టీ తరఫున పోటీ చేసున్నారంటే.. మోదీ అభివృద్ధి ప్రణాళికలకు ఆమె మద్దతు ఇస్తున్నారని అర్థం. ఇందులో ఎలాంటి తప్పు లేదు. ప్రతిఒక్కరికీ తమ సొంత మార్గాన్ని ఎన్నుకునే హక్కు ఉంటుంది.

--ప్రదీప్​ చౌహాన్​, భాజపా నేత

ఇదీ చదవండి: 'చమురు ధరలపై ప్రధాని మాట్లాడరేం?'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.