ETV Bharat / bharat

లిఫ్ట్​లో ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారం!.. పబ్లిక్​ టాయిలెట్​లో బాలుడి మృతదేహం

author img

By

Published : Dec 9, 2022, 12:44 PM IST

Etv Bharat
Etv Bharat

ఏసీ రిపేర్ చేసేందుకు వచ్చిన ఓ యువకుడు అమానుషంగా ఐదేళ్ల చిన్నారిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. మహారాష్ట్రలోని రాయగఢ్​లో ఈ ఘటన జరిగింది. మరోవైపు, పబ్లిక్ టాయిలెట్​లో మూడేళ్ల చిన్నారి మృతదేహం కనిపించడం కలకలం రేపింది.

ఏసీ రిపేర్​ చేసేందుకు వచ్చిన ఓ వ్యక్తి.. ఓ చిన్నారిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. బయట ఆడుకుంటున్న చిన్నారిని లిఫ్ట్​లోకి తీసుకెళ్లి లైంగిక దాడి చేశాడు. చిన్నారి వాంతులు చేసుకున్న విషయాన్ని గమనించిన తల్లిదండ్రులు ఆమెను దగ్గరకు పిలిచి అడగగా అసలు విషయం బయటపడింది. దీంతో అదే ప్రాంతంలో తిరుగుతున్న నిందితుడిని స్థానికులు వెంటనే పట్టుకున్నారు.

స్థానికుల వివరాల ప్రకారం.. మహారాష్ట్ర రాయ్​గఢ్​ జిల్లాలోని తలోజాలో ఏసీ రిపేయిర్​ చేసేందుకు మొహమ్మద్​ అక్తర్​ మతర్​ హుస్సేన్ అనే 19 ఏళ్ల యువకుడు అపార్ట్​మెంట్​​కు వచ్చాడు. అక్కడే ఆడుకుంటున్న చిన్నారికి మాయమాటలు చెప్పి.. లిఫ్ట్​లోకి తీసుకెళ్లిన నిందితుడు.. లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఏమీ తెలియని ఆ చిన్నారి ఇంటికి వెళ్లిపోయింది. ఇంట్లో వాంతులు చేసుకున్న సమయంలో గమనించిన కుటుంబసభ్యులు చిన్నారిని ఆరా తీయగా.. జరిగిదంతా బయటపడింది. దీంతో ఆగ్రహించిన కుటుంబ సభ్యులు స్థానికుల సహాయంతో నిందితుడిని పట్టుకున్నారు.

పబ్లిక్​ టాయిలెట్​లో మూడేళ్ల బాలుని మృతదేహం..
దిల్లీ షాహదరా జిల్లాలోని జిల్​మిల్​ ఇండస్ట్రీయల్​ ప్రాంతంలోని ఓ పబ్లిక్​ టాయిలెట్​లో ఓ మూడేళ్ల చిన్నారి మృతదేహం లభ్యమవ్వడం కలకలం రేపింది. చిన్నారి మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు శవపరీక్షల నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఆపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. చిన్నారి మృతదేహాన్ని గమనిన్తే గొంతునులిమి చంపినట్లు అనిపిస్తోందని పోలీసులు తెలిపారు.

పోలీసుల సమాచారం.. ప్రకారం జిల్​మిల్​ పరిశ్రమ వాడలోని పబ్లిక్​ టాయిలెట్​లో గురువారం సాయంత్రం ఓ గుర్తుతెలియని చిన్నారి మృతదేహాన్ని గమనించిన స్థానికులు వెంటనే సమాచారం అందించారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాలుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతదేహం పక్కన దుస్తులు, బిస్కెట్స్, కొంత నగదు సైతం దొరికిందని పోలీసులు తెలిపారు. చిన్నారి గుర్తింపు కోసం దర్యాప్తు చేపట్టిన పోలీసులకు ఆ బాలుడు జగ్గీ బస్తీకి చెందినవాడని స్ఫష్టమయ్యింది. దీంతో నిందితుడిని గుర్తించేందుకు ఆ ప్రాంత వాసులను విచారించడం ప్రారంభించారు పోలీసులు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.