ETV Bharat / bharat

తిరుపతిలో దారుణం.. తమ్ముడు చేసిన తప్పు.. అన్న బలి

author img

By

Published : Apr 2, 2023, 7:38 AM IST

Updated : Apr 2, 2023, 2:06 PM IST

Man Burnt Alive: తిరుపతి జిల్లాలో దారుణం జరిగింది. ఓ వ్యక్తిని కారులోనే సజీవ దహనం చేశారు. మృతుడి తమ్ముడి వివాహేతర సంబంధమే ఈ ఘటనకు దారి తీసినట్లుగా చెబుతున్నారు. సమస్య పరిష్కారానికి పిలిచి.. దారుణంగా కాల్చి చంపేశారని మృతుడి కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. మరో ఘటనలో లారీ డ్రైవర్ సజీవ దహనం అయ్యాడు.

man burnt alive in tirupati
వ్యక్తి సజీవదహనం

తమ్ముడు చేసిన తప్పు.. అన్న బలి

Man Burnt Alive In Tirupati : తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం గంగుడుపల్లెలో శనివారం అర్ధరాత్రి చంద్రగిరి మండలం గంగుడుపల్లెలో ఓ కారుపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. స్థానికులు... మంటలను గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడికి చేరుకున్నపోలీసులు.. కారులో వెదురుకుప్పం మండలం బ్రాహ్మణపల్లికి చెందిన నాగరాజు సజీవ దహనమైనట్లు గుర్తించారు. మృతుడు బెంగళూరులో సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో పని చేస్తున్నట్లు తెలిపారు. పోలీసుల క్లూస్ టీం వివరాలు సేకరించింది.

నాగరాజు బంధువులు ఘటనా స్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు. తన కుమారుడ్ని అన్యాయంగా చంపేశారని ఆయన తండ్రి జయ రామయ్య ఆవేదన వ్యక్తం చేశారు. తన మరిదికి, ఓ వ్యక్తి భార్యకు ఉన్న సంబంధం కారణంగానే హత్య జరిగినట్లు నాగరాజు భార్య సులోచన ఆరోపించారు. గొడవులు లేకుండా సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్న తన భర్తను చంపేశారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది.

"నా మరిది.. బట్టే రూపంజయ్య వాళ్ల వైఫ్​కు రెండు నెలల నుంచి రిలేషన్ షిప్​లో ఉన్నారు. రూపంజయ్యకు తెలిసి ఎప్పటి నుంచే హత్య చేయాలని చూస్తున్నాడు. పురుషోత్తంని చంపాలని చూశారు. దీంతో నాగరాజు తమ్ముడిని బెంగుళూరుకు పంపిచేశాడు. కాంప్రమైజ్ కోసం నాగరాజు ప్రతి వారం వెళ్లి వస్తున్నాడు. మాకు ఫోన్లుచేసి మిమల్ని ఎలాగైనా చంపేస్తాను అని బెదిరించాడు. పలు రకాలుగా కేసులు పెట్టి ఇబ్బంది పెట్టేవాడు. మేము ఫైన్ కట్టాము. గోపి అనే అతను ఫోన్ చేశాడు. బట్టే రూపంజయ్య.. నా భర్తను కలుపుతానని.. కాంప్రమైజ్ చేస్తానని అన్నాడు. కాంప్రమైజ్ కోసం తిరుపతి వస్తున్నానని, వాళ్లు ఇంకా రాలేదు. వాళ్లు వస్తారని చెప్పారు. నేను ఫోన్ చేసినపుడు అదే చెప్పాడు. వెంటనే కాల్ కట్ అయిపోయింది. ఫోన్ స్విచ్చాఫ్ అయింది. వాళ్ల ఫ్రెండ్స్ 12:30 కాల్ చేసి మీ కారు కాలిపోతుందని అని చెప్పారు." - మృతుడి భార్య

" కారు బర్న్ అయి.. లోపలి వ్యక్తి పూర్తిగా కాలిపోయిన స్థితిలో ఉన్నారు. ఇక్కడ దొరికనటువంటి చెప్పులు, చైన్, కారు నంబర్ ప్లేట్​ను బట్టి నాగరాజుగా గుర్తించాము. జయరామయ్య అనే అతను ఇచ్చిన ఫిర్యాదు మేరకు మర్డర్ కేసు నమోదు చేయడం జరిగింది. బట్టే రూపుంజయ్య అనే అతను మీద అనుమానం వ్యక్తం చేస్తున్నారు. " - ఓబులేసు, సీఐ

నాగరాజును దారుణం హత్య చేసినవారికి కఠినంగా శిక్షించాలని బంధువులు కోరుతున్నారు.

మంటల్లో దగ్ధమైన లారీ.. ఒకరు మృతి : చిత్తూరు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కోడి గుడ్ల లారీ మంటల్లో దగ్ధం అయ్యింది. అందులో ఉన్న డ్రైవర్ మంటల్లో సజీవ దహనం అయ్యాడు. వివరాల్లోకి వెళితే..రామ కుప్పం మండలంలో శనివారం విద్యుదాఘాతం సంభవించి కోడి గుడ్ల లారీతో పాటు అందులోని డ్రైవర్ మంటల్లో సజీవ దహనం అయ్యాడు. కొంగన పల్లి సమీప వెంకటాపురం రోడ్డులో వెళుతున్న కోడి గుడ్ల లారీపై భాగంలో విద్యుత్ తీగలు తగలటం వల్ల ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఒక్క సారిగా మంటలు చెలరేగి ఈ దుర్ఘటన జరిగింది.

ఇవీ చదవండి

Last Updated :Apr 2, 2023, 2:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.