ETV Bharat / bharat

ప్రేమించడమే పాపం... యువకుడిపై పెట్రోల్ పోసి నిప్పంటించి..

author img

By

Published : Feb 11, 2022, 8:32 PM IST

Man burnt alive: ప్రేమించడమే ఆ యువకుడికి శాపమైంది.. మనసిచ్చిన అమ్మాయినే చేసుకుంటానని తెగేసి చెప్పడం అతడి ప్రాణాలమీదకు తెచ్చింది.

love affair murder maharashtra
love affair murder maharashtra

Man burnt alive: ప్రేమ వ్యవహారం ఓ యువకుడి ప్రాణాల మీదకు తెచ్చింది. మహారాష్ట్రలోని నాశిక్​కు చెందిన ఓ వ్యక్తిపై యువతి కుటుంబ సభ్యులు దాడి చేసి సజీవ దహనానికి యత్నించారు. బాధితుడి శరీరం 55శాతం కాలిపోయింది. ప్రస్తుతం అతడిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

కేసు నేపథ్యమిదీ!

love affair murder maharashtra: దేవోలా తాలుకాలోని లోహనేర్​కు చెందిన గోరఖ్ బచ్చవ్ అనే వ్యక్తి ఓ యువతిని ప్రేమించాడు. అయితే, ఈ విషయం గిట్టని యువతి కుటుంబ సభ్యులు ఆమెకు వేరే సంబంధాలు చూశారు. అయితే, యువతి ప్రేమ వ్యవహారం తెలిసి ఓ సంబంధం రద్దైంది. దీంతో శుక్రవారం మధ్యాహ్నం గోరఖ్​తో గొడవ పెట్టుకున్నారు యువతి కుటుంబ సభ్యులు. ఇప్పటికైనా యువతిని పెళ్లి చేసుకునేందుకు సిద్ధమేనని గోరఖ్ చెప్పాడు. దీంతో వివాదం పంచాయతీ పెద్దల దాకా వెళ్లింది. అయితే, ఇక్కడే గోరఖ్​పై యువతి కుటుంబ సభ్యులు దాడి చేశారు. పెట్రోల్ పోసి నిప్పంటించారు.

కాలిన గాయాలతో విలవిల్లాడిన బాధితుడిని వెంటనే దేవోలా స్థానిక ఆస్పత్రికి అనంతరం నాశిక్ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. ఐదుగురు నిందితులను అరెస్టు చేశారు. తదుపరి విచారణ కొనసాగిస్తున్నారు.

ఇదీ చదవండి: కశ్మీర్​లో భద్రతా దళాలపై గ్రెనేడ్ దాడి.. ఒకరు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.