ETV Bharat / bharat

Covid vaccine: బూస్టర్ డోసు అవసరమా?

author img

By

Published : May 28, 2021, 6:58 AM IST

booster dose
బూస్టర్ డోసు, కొవిడ్ టీకా

ఇమ్యూనిటీ పెంచేందుకు కొవిడ్-19 వ్యాక్సిన్ బూస్టర్ డోసు అవసరమా? లేదా? అనే అంశంపై అధ్యయనం జరుగుతున్నట్లు కేంద్రం తెలిపింది. దీనిపై త్వరలోనే స్పష్టత వస్తుందని నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే పాల్ వెల్లడించారు.

కొవిడ్​-19 టీకా బూస్టర్​ డోసు అవసరమా? లేదా? అన్న విషయంపై ప్రస్తుతం అధ్యయనం జరుగుతోందని కేంద్రం వెల్లడించింది. ఏ వ్యాక్సిన్ అయినా.. వైరస్​ నుంచి పూర్తి స్థాయిలో రక్షణ ఇవ్వలేదని పేర్కొంది.

వ్యాక్సినేషన్​ ప్రక్రియలో భాగంగా ఇమ్యూనిటీని పెంచేందుకు.. బూస్టర్ డోసు అవసరం ఉందని నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే పాల్ పేర్కొన్నారు. దీనిపై అధ్యయనాలు జరుగుతున్నాయని తెలిపారు. ఆరు నెలల తర్వాత బూస్టర్ డోసు తీసుకోవాలా? లేదా? అనే అంశంపై 'కొవాగ్జిన్' ట్రయల్స్ జరుపుతున్నట్లు స్పష్టం చేశారు.

ప్రస్తుతం రెండు డోసులు తీసుకుని జాగ్రత్తలు వహించాలని పాల్ కోరారు. బూస్టర్​ డోసుపై త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పారు.

ఇదీ చదవండి:జూన్ వరకు కొవిడ్ మార్గదర్శకాలు కొనసాగింపు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.